E-Paper
Advertisement

Black Friday Scam: బ్లాక్ ఫ్రైడే సేల్‌ పేరుతో భారీ సైబర్ స్కామ్.. 2000కు పైగా నకిలీ వెబ్‌సైట్లు

Black Friday Scam: బ్లాక్ ఫ్రైడే సేల్‌ పేరుతో భారీ సైబర్ స్కామ్.. 2000కు పైగా నకిలీ వెబ్‌సైట్లు
Advertisement

Black Friday Scam Fake Websites | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఆన్ లైన్ షాపర్స్ కోసం తరుచూ ప్రత్యేక సేల్స్ ప్రకటిస్తుంటాయి. తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లతో పాటు మీషో, మింత్రా లాంటి అన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని రన్ చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఒక భారీ ఆన్‌లైన్ మోసం జరుగుతోంది.

క్లౌడ్‌సెక్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. ఈ సేల్ సందర్భంగా హ్యాకర్లు 2000 కంటే ఎక్కువ నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు ఉన్నాయని గుర్తించారు. ఈ సైట్లు అమెజాన్, ఆపిల్, శాంసంగ్, షావోమీ, రే-బ్యాన్ వంటి పెద్ద బ్రాండ్లను అధికారిక వెబ్ సైట్లకు పోలి ఉన్నాయి. సాధారణంగా చూస్తే ఇది పూర్తిగా అసలు సైట్‌లాగానే కనిపిస్తాయి, కానీ ఇవి పూర్తిగా మోసపూరిత సైట్లు.

సైబర్ మోసగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు?

Advertisement

ఆన్ లైన్ మోసాలు చేసే సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా పని చేస్తున్నారు. నకిలీ సైట్‌లో “బ్లాక్ ఫ్రైడే సూపర్ సేల్” అని పెద్ద బ్యానర్లు పెడతారు. “కేవలం 5 నిమిషాలే మిగిలాయి” అని కౌంట్‌డౌన్ చూపిస్తారు. “ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఒకరు కొన్నారు” అని పాప్-అప్ మెసేజ్‌లు వస్తాయి. దీంతో మీరు కూడా తొందరపడి కొనేయాలని అనుకుంటారు. ఆ తొందరపాటులో వెంటనే కొనుగోలు చేసేందుకు వెంట వెంటనే ఆర్డర్లు చేస్తారు.. అతి తక్కువ ధరకే మంచి ఫోన్, లాప్ టాప్ లభిస్తుందనే ఆశతో పేమెంట్ కూడా చెల్లించేస్తారు.

డబ్బు ఎలా దొంగిలిస్తారు?

మీరు వస్తువు ఎంచుకుంటే ముందు షిప్పింగ్ అడ్రస్ అడుగుతారు. తర్వాత కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్, CVV, OTP అన్నీ అడుగుతారు. మీరు వివరాలు ఇస్తే డబ్బు నేరుగా మోసగాళ్ల ఖాతాలోకి వెళ్తుంది. కానీ మీరు ఆర్డర్ చేసిన వస్తువు మాత్రం డెలివరీ జరగదు. ఆర్డర్ కన్ఫర్మేషన్ కూడా రాదు. మీ కార్డు వివరాలు వాళ్ల చేతిలో పడతాయి. ఇక ఆ తరువాత మీ బ్యంక్ ఖాతా ఖాళీ అవుతుంది.

ఏ బ్రాండ్లను ఎక్కువ కాపీ చేస్తున్నారు?

Advertisement

ఎక్కువగా ఆపిల్, శామ్‌సంగ్, అమెజాన్, షావోమీ, రే-బ్యాన్, లాజిటెక్, సిస్కో, టోషిబా వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ సైట్లు తయారు చేస్తున్నారు. మొత్తం 2000కు పైగా నకిలీ వెబ్ సైట్లు బయటపడ్డాయి.

మోసపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో కనిపించే యాడ్స్ మీద క్లిక్ చేయొద్దు.
  • అసలు సైట్‌కు వెళ్లాలంటే మీరే టైప్ చేసి వెళ్లండి (www.amazon.in, www.flipkart.com, www.apple.com). లాంటి అధికారిక వెబ్‌సైట్లతో మాత్రమే కొనుగోలు చేయాలి.
  • మీరు చూస్తున్న వెబ్‌సైట్ అడ్రస్ జాగ్రత్తగా చూడండి. ఒక్క అక్షరం తేడా ఉన్నా మోసమే!
  • చెక్‌అవుట్ సమయంలో వేరే వెబ్‌సైట్ అడ్రస్‌కు తీసుకెళ్తే వెంటనే సైట్ మూసేయండి. ఎందుకంటే ఆ కొత్త సైట్ సైబర్ మోసగాళ్ల మిమల్ని దోచుకునేందుకే రూపొందించారు.
    అపరిచిత సైట్‌లో కార్డు వివరాలు ఇవ్వొద్దు.

ఈ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఆనందంగా సాగాలంటే రెట్టింపు జాగ్రత్త అవసరం. ఒక్కసారి మోసపోతే డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. అందుకే జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా షాపింగ్ చేయండి.

Also Read: రూ.80,000 ఐప్యాడ్‌ పొరపాటున కేవలం రూ.1,500కే సేల్.. తరువాత కస్టమర్లకు షాకిచ్చిన కంపెనీ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×