// // UPI Fail Compensation| గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు గుడ్‌న్యూస్.. యుపిఐ పేమెంట్స్ ఫెయిల్ అయితే ఎక్స్‌ట్రా పైసలు.. ఏం చేయాలంటే -->
E-Paper
Advertisement

UPI Fail Compensation: గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు గుడ్‌న్యూస్.. యుపిఐ పేమెంట్స్ ఫెయిల్ అయితే ఎక్స్‌ట్రా పైసలు.. ఏం చేయాలంటే

UPI Fail Compensation: గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు గుడ్‌న్యూస్.. యుపిఐ పేమెంట్స్ ఫెయిల్ అయితే ఎక్స్‌ట్రా పైసలు.. ఏం చేయాలంటే
Advertisement

UPI Fail Compensation| భారతదేశంలో అతి వేగంగా, సులభంగా డిజిటల్ పేమెంట్ చేసే పద్ధతి యుపిఐ. ప్రజలు నిత్య జీవితంలో కిరాణా, ట్రాన్స్‌పోర్ట్, బిల్లులు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటిఎం వంటి యుపిఐ యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లతో పేమెంట్లు చాలా సులభంగా జరుగుతాయి. కానీ కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఈ కారణంగా యూజర్లు చాలా ఇబ్బండి పడతారు. ముఖ్యంగా డబ్బు అకౌంట్ నుంచి తగ్గిపోయి, రిసీవర్‌కు చేరకపోతే భయపడతారు. డబ్బు పోయిందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ఈ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్పష్టమైన నియమాలు జారీ చేసింది. ఈ నియయాలే యుపిఐ యూజర్లను రక్షిస్తాయి. ఫెయిల్ అయిన పేమెంట్లకు రిఫండ్ తో పాటు అదనపు కాంపెన్సేషన్ కూడా లభిస్తుంది.

పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుంది?

యుపిఐ ట్రాన్సాక్షన్ (లావాదేవి) ఫెయిల్ అంటే మీ అకౌంట్ నుంచి డబ్బు తగ్గిపోతుంది కానీ మర్చంట్ (షాప్ కీపర్) లేదా రిసీవర్‌కు చేరదు. అలాంటి సమయంలో బ్యాంకులు లేదా UPI యాప్‌లు త్వరగా సమస్యను పరిష్కరించాలి. చాలాసార్లు ఫెయిల్ ట్రాన్సాక్షన్లు ఒక వర్కింగ్ డేలోపు ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతాయి. కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే రిఫండ్ వస్తుంది. కానీ సర్వర్ సమస్యలు లేదా టెక్నికల్ ఎర్రర్ల వల్ల ఆలస్యం అవుతుంది. ఇలాంటి ఆలస్యాలకు RBI నియమాల ప్రకారం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం లభిస్తుంది.

UPI ట్రాన్సాక్షన్ ఫెయిల్.. RBI నియమాలు

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. NPCI కూడా ఈ నియమాలను అమలు చేస్తుంది. బ్యాంకులు, UPI యాప్‌లు ఫెయిల్ ట్రాన్సాక్షన్లను నిర్దిష్ట సమయంలోపు పరిష్కరించాలి. అలా చేయకపోతే యూజర్లకు డబ్బు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది ఒరిజినల్ రిఫండ్ కాదు, అదనపు మొత్తం. బ్యాంక్ లేదా UPI సర్వీస్ ప్రొవైడర్ తప్పు చేస్తే మాత్రమే ఈ కాంపెన్సేషన్ వర్తిస్తుంది.

కాంపెన్సేషన్ ఎప్పుడు లభిస్తుంది?

రిఫండ్ తగిన సమయం కన్నా ఆలస్యమైతే యూజర్లకు నష్టపరిహారం వస్తుంది. టెక్నికల్ సమస్యలు, సర్వర్ డౌన్ టైమ్, సిస్టమ్ ఎర్రర్లు ఉంటే కాంపెన్సేషన్ ఇస్తారు. బ్యాంక్ లేదా UPI ప్రొవైడర్ బాధ్యత తీసుకోవాలి. యూజర్ ఫిర్యాదు చేస్తే మాత్రమే ఇది లభిస్తుంది. యూజర్ తప్పు చేస్తే (తప్పు UPI ID ఇవ్వడం వంటివి) నష్టపరిహారం రాదు.

నష్టపరిహారం ఎంత?

Advertisement

ఎన్ని రోజులు ఆలస్యం ఉంటే అంత మొత్తం నష్టపరిహారం ఇస్తారు. RBI ప్రకారం ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ ఉంటుంది. ఈ మొత్తం సర్వీస్ ప్రొవైడర్ నుంచి యూజర్ అకౌంట్‌కు నేరుగా వస్తుంది. ఇది చిన్న మొత్తమే అయినా, బ్యాంకులు జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది.

ఫెయిల్ యుపిఐ పేమెంట్ ఫిర్యాదు ఎలా చేయాలి?

ముందుగా మీ UPI యాప్‌ని ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లండి. ఫెయిల్ అయిన పేమెంట్‌ని సెలెక్ట్ చేయండి. “హెల్ప్” లేదా “రిపోర్ట్ ప్రాబ్లమ్” ఆప్షన్ క్లిక్ చేయండి. UTR నంబర్ లేదా ట్రాన్సాక్షన్ ID సరిగ్గా ఎంటర్ చేయండి. ఇది ఫిర్యాదు త్వరగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. చాలా సమస్యలు కొన్ని వర్కింగ్ డేస్‌లోపు పరిష్కారమవుతాయి.

నష్టపరిహారం ఎప్పుడు రాదు?

అన్ని ఫెయిల్ ట్రాన్సాక్షన్లకు కాంపెన్సేషన్ రాదు. తప్పు UPI ID ఎంటర్ చేస్తే, యూజర్ నెట్‌వర్క్ సమస్య వల్ల ఫెయిల్ అయితే రాదు. ఆటోమేటిక్ ఇన్‌స్టంట్ రివర్సల్ అయితే కూడా పెనాల్టీ లేదు. ప్రొవైడర్ సైడ్ ఎర్రర్ మాత్రమే ఉంటేనే నష్టపరిహారం వర్తిస్తుంది.

సమస్య పరిష్కారం కాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

యాప్ సహాయం చేయకపోతే మీ బ్యాంకుకు నేరుగా కాంటాక్ట్ చేయండి. బ్యాంకు కూడా సమస్య పరిష్కరించకపోతే NPCIకి ఎస్కలేట్ చేయండి. RBI అధికారిక గ్రీవెన్స్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయవచ్చు. అధికారులు నిజమైన కేసులను సీరియస్‌గా తీసుకుంటారు. అర్హత ఉన్న యూజర్లకు రిఫండ్ తో పాటు కాంపెన్సేషన్ కూడా వస్తుంది.

Also Read: ఛార్జింగ్ సమయంలో పేలిన గెలాక్సీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. శాంసంగ్ ఏం చెప్పిందంటే

UPI పేమెంట్ సమస్యలు రాకుండా టిప్స్

పేమెంట్ చేసేముందు UPI ID రెండుసార్లు చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ సమయంలో స్టేబుల్ ఇంటర్నెట్ ఉండేలా చూడండి. పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు యాప్ మూసివేయకండి. ప్రతి ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. కంప్లైంట్ చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×