E-Paper
Advertisement

Samsung Folding Phone Fail: డ్యూరబిలిటీ టెస్ట్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన శాంసంగ్ కొత్త ఫోల్డింగ్ ఫోన్.. ఏం జరిగిందంటే

Samsung Folding Phone Fail: డ్యూరబిలిటీ టెస్ట్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన శాంసంగ్ కొత్త ఫోల్డింగ్ ఫోన్.. ఏం జరిగిందంటే
Advertisement

Samsung Folding Phone Fail| శామ్‌సంగ్ ఇటీవలే లాంచ్ చేసిన కొత్త ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ అయిన గెలాక్సీ Z ట్రై ఫోల్డ్ ఫోన్ డ్యూరబిలిటీ టెస్ట్‌లో ఘోరంగా ఫెయిల్ అయింది. ఒక యూట్యూబర్ చేసిన టెస్ట్‌లో స్క్రీన్, బాడీ బద్దలయ్యాయి. స్క్రీన్‌ను కొద్దిగా వెనక్కి బెండ్ చేయగానే పగిలిపోయింది. ఈ టెస్ట్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. శామ్‌సంగ్ ఈ ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్‌ను ఇటీవల గ్లోబల్‌గా లాంచ్ చేసింది.

వైరల్ అయిన డ్యూరబిలిటీ టెస్ట్ వీడియోలో ఏముంది?

యూట్యూబ్ లో JerryRigEverything అనే పాపులర్ ఛానల్ ఉంది. ఈ ఛానెల్ నడిపే జాక్ నెల్సన్ ఈ టెస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాడు. వీడియోలో ఫోన్ బెండ్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతోంది. స్క్రీన్ వెంటనే పగిలి నల్లగా మారిపోయింది. కొద్దిపాటి ప్రెషర్‌కే సపోర్టింగ్ బాడీ కూడా పగిలిపోయింది.

డ్యూరబిలిటీ టెస్ట్ అంటే ఏమిటి

Advertisement

డ్యూరబిలిటీ టెస్ట్ ఫోన్ ఎంత బలంగా తయారు చేయబడుతుందో చెక్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ బయటి బాడీ, స్క్రీన్‌ను పరీక్షిస్తారు. స్క్రాచ్, బెండ్, ఫైర్, వాటర్ రెసిస్టెన్స్ టెస్టులు ఉంటాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ బేసిక్ బెండ్ టెస్ట్‌లోనే ఫెయిల్ అయింది. ఫైర్ రెసిస్టెన్స్ టెస్ట్‌లో కూడా ఘోరంగా విఫలమైంది.

టెస్ట్‌లో జరిగిన ఫెయిల్యూర్లు ఇవే

స్క్రీన్‌ను వెనక్కి బెండ్ చేయగానే వెంటనే డ్యామేజ్ అయింది. స్క్రీన్ వెనక ఉన్న ప్లాస్టిక్ లేయర్ చాలా సన్నగా ఉంది. ఈ బలహీనమైన లేయర్ చిన్న స్ట్రెస్‌ వల్లే పగిలిపోయింది. ఫోన్ బాడీ స్క్రీన్‌ను సపోర్ట్ చేయలేకపోయింది. మొత్తం స్ట్రక్చర్ డ్యూరబిలిటీ దెబ్బతింది.

ఫైర్ టెస్ట్‌లో ఫోన్ ఎలా ఫెయిల్ అయింది

Advertisement

డైరెక్ట్ ఫ్లేమ్ టెస్ట్‌లో కూడా ఫోన్ ఫెయిల్ అయిపోయింది. OLED స్క్రీన్ కేవలం 17 సెకన్లలోనే డ్యామేజ్ అయింది. పిక్సెల్స్ శాశ్వతంగా గోల్డెన్ బ్లాక్ కలర్‌కు మారాయి. ఫ్లేమ్ తీసేసినా రికవర్ కాలేదు. దీని హీట్ రెసిస్టెన్స్ చాలా పేలవంగా ఉందని చూపిస్తోంది.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

ఇతర ఫోల్డబుల్స్‌తో పోలిక

శామ్‌సంగ్ రెగ్యులర్ గెలాక్సీ Z ఫోల్డ్ రెండు వైపులా బెండింగ్‌ను బాగా తట్టుకుంటుంది. కానీ ట్రిపుల్ ఫోల్డ్ మోడల్ వెనక్కి బెండ్ అస్సలు చేయలేదు. దాని కాంప్లెక్స్ హింజ్ డిజైన్ మరింత బలహీనంగా కనిపిస్తోంది. రోజువారీ రఫ్ ఉపయోగానికి డ్యూరబిలిటీ గురించి ఆందోళన కలిగిస్తోంది.

శామ్‌సంగ్ క్లెయిమ్స్, రియాలిటీ మధ్య తేడా ఇదే

శామ్‌సంగ్ ఈ ఫోన్ లో ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో బలంగా ఉంటుందని చెప్పింది. కానీ కొద్దిపాటి రివర్స్ బెండింగ్‌కే ఫోన్ పగిలిపోయింది. ఫ్రేమ్ ఇన్నర్ స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేయలేకపోయింది. ఈ మూడు ఫోల్డింగ్స్ డిజైన్ ఉన్న ఫోన్ లో శాంసంగ్ దాని డిజైన్ ఫార్మ్‌ కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఫంక్షన్లు వదిలేసినట్టు కనిపిస్తోంది. రియల్ వరల్డ్ డ్యూరబిలిటీ లోపిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×