E-Paper
Advertisement

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే
Advertisement

EV charging Highway| బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు (BEVs), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (HEVs) ఛార్జింగ్ కోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. పైగా దూర ప్రయాణాలు చేసేవారు అన్ని చోట్ల ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి లేకపోవడంతో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే కొత్త టెక్నాలజీ రూపొందించబడింది.

ఫ్రాన్స్ దేశ ప్రభుత్వం బ్యాటరీ కార్ల ఛార్జింగ్ కోసం ఒక సరికొత్త హైవే వ్యవస్థను నిర్మిస్తోంది. ఈ రహదారి ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవింగ్ చేసే సమయంలో ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం ఉండదు. పారిస్ సమీపంలో 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఇప్పటికే అందుబాటులో ఉంది.

సెల్ఫ్-ఛార్జింగ్ హైవే ఎలా పనిచేస్తుంది?

Advertisement

రహదారి ఉపరితలం కింద రాగి (కాపర్) కాయిల్స్ ఉంటాయి. ఇవి పవర్ ఫఉల్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్ అవ్వడానికి.. వాహనంలో ప్రత్యేక రిసీవర్ అమర్చి ఉండాలి. ఇది వాహన బ్యాటరీ నుండి వేరుగా అమర్చబడి ఉంటుంది. రహదారిపై వాహనం ప్రయాణిస్తున్నప్పుడు, రిసీవర్ అయస్కాంత క్షేత్రం నుండి శక్తిని గ్రహించి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లా పనిచేస్తుంది. వర్షంలో లేదా మంచులో కూడా ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఛార్జింగ్ వేగం, పవర్

ఈ హైవే ఛార్జింగ్ స్పీడ్ చాలా ఆకట్టుకుంటుంది. ఇది 200 కిలోవాట్ల శక్తిని అందిస్తుంది. ఇది టెస్లా కార్లలోని వేగవంతమైన V3 సూపర్‌ఛార్జర్‌తో సమానం. వాహనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడే సమర్థవంతంగా ఛార్జ్ అవుతుంది. బస్సులు, ట్రక్కులు, కార్లు, స్కూటర్లు ఈ హైవేను ఉపయోగించవచ్చు. ఈ టెక్నాలజీ ఎలక్ట్రిక్ వాహనాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సాధ్యం చేస్తుంది.

దూర ప్రయాణాలకు ప్రయోజనాలు

Advertisement

ఈ టెక్నాలజీ దూర ప్రయాణాలకు చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా BEVలు పరిమిత రేంజ్ మాత్రమే కలిగి ఉంటాయి. కారు ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్ లో చాలాసేపు ఆగవలసి ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు సమయం పడుతుంది. కానీ, ఈ వైర్‌లెస్ హైవే ఛార్జింగ్ ప్రక్రియంలో డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనం ఛార్జ్ అవుతూ ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్లు ఛార్జింగ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణం వేగవంతంగా, సులభంగా ఉంటుంది.

ఫ్రాన్స్ విస్తృత ప్రణాళిక

ఈ టెక్నాలజీతో మరిన్ని హైవేలు నిర్మించడానికి ఫ్రాన్స్ పూర్తిగా కట్టుబడి ఉంది. ఫ్రాన్స్ రవాణా మంత్రిత్వ శాఖ.. ఎలక్ట్రియాన్ కంపెనీతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించడంపై దృష్టి సారించింది. ఫ్రాన్స్ 9000 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తవుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఒక భారీ నెట్‌వర్క్‌గా రూపొందుతుంది.

Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×