// // Grok Imagine 1.0| వీడియో జెనెరేషన్ టూల్ సూపర్ అడ్వాన్స్ వెర్షన్ తీసుకొచ్చిన మస్క్.. ఫ్రీగా ఎలా ఉపయోగించాలంటే? -->
E-Paper
Advertisement

Grok Imagine 1.0: వీడియో జెనెరేషన్ టూల్ సూపర్ అడ్వాన్స్ వెర్షన్ తీసుకొచ్చిన మస్క్.. ఫ్రీగా ఎలా ఉపయోగించాలంటే?

Grok Imagine 1.0: వీడియో జెనెరేషన్ టూల్ సూపర్ అడ్వాన్స్ వెర్షన్ తీసుకొచ్చిన మస్క్.. ఫ్రీగా ఎలా ఉపయోగించాలంటే?
Advertisement

Grok Imagine 1.0 Video Generation| ప్రపంచంలో టాప్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన xAI కంపెనీ కొత్త వీడియో జనరేషన్ టూల్ లాంచ్ చేసింది. దీని పేరు గ్రోక్ ఇమాజిన్ 1.0. ఈ టూల్ AIతో వీడియోలు సృష్టించడంలో చాలా ఫాస్ట్‌గా మెరుగ్గా ఉంది. AI వీడియో జనరేషన్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. టెక్ కంపెనీల మధ్య టెక్స్ట్‌తో వీడియో సృష్టించే ఏఐ టూల్స్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పుడు xAI కూడా.. ఓపెన్AI, గూగుల్, ఇతర స్టార్టప్‌లతో నేరుగా పోటీ పడుతోంది.

గ్రోక్ ఇమాజిన్ 1.0 అంటే ఏమిటి?

గ్రోక్ ఇమాజిన్ అనేది xAI యొక్క AI వీడియో జనరేటర్ టూల్. సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోలు క్రియేట్ చేయవచ్చు. ఇది కొత్త వెర్షన్. పాత వెర్షన్ కంటే ఇందులో విజువల్స్, సౌండ్ క్వాలిటీ చాలా మెరుగుపడ్డాయి. ఈ టూల్‌ను గ్రోక్ చాట్‌బాట్‌లోనే ఇంటిగ్రేట్ చేశారు. X ప్లాట్‌ఫామ్‌లోని మిలియన్ల యూజర్లు దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు.

వీడియో క్వాలిటీ, డ్యూరేషన్ మెరుగుదల

Advertisement

గ్రోక్ ఇమాజిన్ 1.0లో 720p రిజల్యూషన్‌లో వీడియోలు జనరేట్ చేయవచ్చు. గరిష్టంగా 10 సెకన్ల వీడియోలు సృష్టించవచ్చు. ఆడియో క్లారిటీ, సింక్రనైజేషన్ చాలా మెరుగుపడింది. AI వీడియో టూల్స్‌లో ఆడియో సింక్ ఇంకా గొడవే. కానీ ఈ టూల్ సోషల్ మీడియా కంటెంట్‌కు బాగా సరిపోతుంది. స్పీడ్, క్వాలిటీ రెండూ బ్యాలెన్స్ చేసింది.

ఒక నెలలో భారీగా పెరిగిన యూజర్ల సంఖ్య

xAI ప్రకారం గ్రోక్ ఇమాజిన్ చాలా వేగంగా పాపులర్ అయింది. 30 రోజుల్లో 1.245 బిలియన్ వీడియోలు జనరేట్ అయ్యాయి. దీంతో AI వీడియో కంటెంట్ పై ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో తెలియజేస్తోంది. షార్ట్ వీడియో ఫార్మాట్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో బాగా రన్ అవుతోంది. గ్రోక్ ఇమాజిన్‌కు బలమైన ఆరంభం లభించింది.

AI వీడియో మార్కెట్‌లో పోటీ

Advertisement

AI వీడియో జనరేషన్ టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. రన్‌వే, పికా వంటి స్టార్టప్‌లు అడ్వాన్స్‌డ్ టూల్స్ ఇస్తున్నాయి. ఓపెన్AI సోరా చాలా హైప్ సృష్టించింది కానీ సాధారణ యూజర్లకు అందుబాటులో లేదు. అందుకే xAI,, గ్రోక్ ఇమాజిన్‌ ని ఉచితం చేసి ఎక్కువ మందికి అందుబాటులో తీసుకొచ్చింది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

ప్రాంప్ట్ అర్థం, ఆడియో సింక్ మెరుగుదల

టెస్టింగ్ కేటలాగ్ ప్రకారం గ్రోక్ ఇమాజిన్ ప్రాంప్ట్‌లను బాగా అర్థం చేసుకుంటుంది. యూజర్ వివరణకు దగ్గరగా వీడియోలు తయారవుతాయి. ఇది ఎడిటింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. ఆడియో సింక్రనైజేషన్ కూడా గణనీయంగా మెరుగుపడింది. దీంతో వీడియోలు ఎక్కువ రియలిస్టిక్‌గా ఉంటాయి.

డెవలపర్ల కోసం API లాంచ్

xAI గ్రోక్ ఇమాజిన్ API కూడా లాంచ్ చేసింది. డెవలపర్లు తమ యాప్‌లలో వీడియో జనరేషన్ యాడ్ చేయవచ్చు. వీడియో ఎడిటింగ్, రిఫైన్‌మెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. బిజినెస్‌లు కస్టమైజ్డ్ కంటెంట్ తయారు చేయవచ్చు. ఈ టూల్‌ను క్యాజువల్ యూజర్లకు మాత్రమే పరిమితం కాదు.. అందరూ వినియోగించవచ్చు. అయితే ఎక్స్‌లో అకౌంట్ ఉండాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×