// // Starlink vs Jio vs Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు కొత్త ఛాలెంజ్.. -->
E-Paper
Advertisement

Starlink vs Jio vs Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు కొత్త ఛాలెంజ్.. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ ఇండియాలో ఎంట్రీ ..

Starlink vs Jio vs Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు కొత్త ఛాలెంజ్.. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ ఇండియాలో ఎంట్రీ ..
Advertisement

Starlink vs Jio vs Airtel: స్టార్‌లింక్‌ ఇండియాలో ప్రవేశించబోతుందనే వార్త బయటపడిన దగ్గర నుంచి టెక్ ప్రపంచం స్పెషల్ దృష్టి పెట్టింది. ఎలాన్ మస్క్‌ స్పేస్‌ఎక్స్ రూపొందించిన ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉంది. కానీ ఇండియాలో మాత్రం ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యే వరకు సర్వీస్ ప్రారంభం కాదు. అనుమతులు వచ్చిన వెంటనే స్టార్‌లింక్‌ భారత మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. ఈ మార్కెట్‌ను ఇప్పటికే ముకేశ్ అంబానీ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్‌టెల్ లాంటి పెద్ద కంపెనీలు నడిపిస్తున్నా, స్టార్లింక్ రావడం వేరే రేంజ్‌లో ఉన్న కనెక్టివిటీని తీసుకురాబోతుందనేది స్పష్టమే.

స్టార్‌లింక్‌ ప్రత్యేకత ఏమిటంటే

Advertisement

స్టార్‌లింక్‌ ప్రత్యేకత, కేబుల్స్ వేయడం గ్రామాలు, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు వంటి చోట్ల కూడా వేగమైన ఇంటర్నెట్ అందించడం. శాటిలైట్ టెక్నాలజీ వల్ల భూమిపై కనెక్టివిటీ లేని జోన్‌ల్లో కూడా సిగ్నల్ అందుతుంది. విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ బ్రేక్ అయినా, స్టార్‌లింక్‌ పనిచేసే అవకాశముంది. అందుకే ఇది ఎమర్జెన్సీ కనెక్టివిటీలో కీలక పాత్ర పోషించగలదు. సాధారణ బ్రాడ్‌ బ్యాండ్ రాని ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, డిజిటల్ సర్వీసులు చేరాలంటే స్టార్‌లింక్‌ ఒక గేమ్‌చేంజర్ కావొచ్చు.

స్టార్‌లింక్‌తో పార్ట్‌నర్‌గా జియో, ఎయిర్‌టెల్

Advertisement

ఇది గుర్తించిన జియో ఇంకా ఎయిర్‌టెల్ ఇప్పటికే స్టార్‌లింక్‌తో పార్ట్‌నర్ అయ్యాయి. గ్రామీణ భారత డిజిటల్ కనెక్టివిటీని శాటిలైట్ నెట్‌వర్క్‌తో పెంచడం వీరందరి లక్ష్యంగా తెలుస్తుంది. కేబుల్ బ్రాడ్‌ బ్యాండ్ అసాధ్యమైన వేలాది గ్రామాల్లో స్టార్‌లింక్‌ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల భారత్‌లో డిజిటల్ డివైడ్ తగ్గొచ్చు. ఈ పార్ట్‌నర్‌షిప్ వల్ల రిమోట్ ఏరియాల్లో ఉన్న ప్రజలు ఫస్ట్‌ టైమ్ హైస్పీడ్ ఇంటర్నెట్ అనుభవించగల అవకాశం ఉంటుంది.

Also Read: iPhone 15 Vs 16 Offer: కేవలం రూ.60లలోపే రెండు ఐఫోన్‌లు.. ఐఫోన్15 vs 16 ఏది బెస్ట్?

జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువా? ఎక్కువా?

ధరల విషయానికి వస్తే, ప్రస్తుత మార్కెట్‌లో అతి తక్కువ ధర జియో నెలకు రూ.399. తర్వాత ఎయిర్‌టెల్ రూ.499. టాటా ప్లే 850 నుంచి మొదలవుతుంది. కానీ స్టార్‌ లింక్‌ మాత్రం ఇండియాలో ధరలను ప్రకటించలేదు. స్టార్‌లింక్‌ ఇండియా వెబ్‌సైట్ యాక్టివ్ కాదు. ధరలు ఇంకా ప్రకటించలేదని స్టార్‌లింక్‌ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ స్పష్టం చేశారు. అందువల్ల ఇది ఎంత ఖరీదో అధికారికంగా చెప్పలేమ గానీ, ఇతర దేశాల్లో ఇది సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంది. స్పీడ్ పరంగా చూస్తే ఎయిర్‌టెల్ ఎంట్రీ ప్లాన్ 40 ఎంబిపిఎస్, జియో 30 ఎంబిపిఎస్ ఇస్తాయి. ప్రీమియం ప్లాన్లు 1024mbps వరకు ఉంటాయి. స్టార్‌లింక్‌ స్పీడ్ 25 నుంచి 220 ఎంబిపిఎస్ మధ్యలో ఉంటుంది. టాటా ప్లే మాత్రం తక్కువ ధరలోనే 100 ఎంబిపిఎస్ అందిస్తోంది.

స్టార్‌లింక్‌ జియో, ఎయిర్‌టెల్‌ను రీప్లేస్ చేస్తుందా?

స్టార్‌లింక్‌ జియో, ఎయిర్‌టెల్‌ను రీప్లేస్ చేస్తుందా అంటే, ఎవరి దగ్గర జవాబు లేదు. ఎందుకంటే జియో ఇంకా ఎయిర్‌టెల్ ఇప్పటికే 90 శాతం పైగా 4జి ఇంకా 5జి కవరేజ్ కలిగి ఉన్నాయి. వీరి ఫైబర్ ఇంకా ఎఫ్ డబ్ల్యూ ఏ (FWA) ప్లాన్లు 500 నుంచి 1000 మధ్యలో ఉంటాయి. స్టార్‌లింక్‌ మాత్రం ఖరీదై ఉండే అవకాశం ఉన్నందున ఇది ప్రధానంగా రీప్లేస్ చేయడానికి కాదు, కనెక్టివిటీ అందని చోట్ల సేవలు ఇచ్చే కంప్లిమెంటరీ టెక్నాలజీగా పనిచేసే అవకాశం ఎక్కువ.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×