E-Paper
Advertisement

Cybertruck Gift Employee: ఏఐ వల్ల ఒక్క రోజులో రూ.72 లక్షలు సంపాదించిన ఉద్యోగి.. ఎలాన్ మస్క్ ఫిదా

Cybertruck Gift Employee: ఏఐ వల్ల ఒక్క రోజులో రూ.72 లక్షలు సంపాదించిన ఉద్యోగి.. ఎలాన్ మస్క్ ఫిదా
Advertisement

Tesla Cybertruck| ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. మస్క్ తరుచూ హాస్యాస్పదమైన, ఆశ్చర్యకరమైన నిర్ణయాల తీసుకుంటూ వార్తాల్లో నిలిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు తరచూ వైరల్ అవుతాయి. ప్రముఖ టెక్ కంపెనీలు.. టెస్లా, స్పేస్‌ఎక్స్, సోషల్ మీడియా సంస్థ X (ట్విట్టర్) వంటి కంపెనీలకు మస్క్ యజమాని. ఇటీవల Xలో మస్క్ కు సంబంధించి ఒక పోస్ట్ చాలా వైరల్ అయింది. ఒక ఉద్యోగి చిన్న టాస్క్ పూర్తి చేసినందుకు ఆయన లక్షల విలువ చేసే పెద్ద బహుమతి ఇచ్చాడు.

ఎలాన్ మస్క్ AI, xAIపై దృష్టి

ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన xAI కంపెనీలో గ్రోక్ ఏఐ చాట్‌బాట్ ఫేమస్. ఈ కంపెనీ అడ్వాన్స్ AI మోడల్స్, రీసెర్చ్‌పై పనిచేస్తుంది. xAIలో నైపుణ్యం ఉన్న ఇంజినీర్లు, AI ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. నిరంతరం AIని మెరుగుపరుస్తున్నారు.

24 గంటల్లో టాస్క్ పూర్తిచేయాలని ఛాలెంజ్

Advertisement

ట్విట్టర్ ఎక్స్ లో xAIకి చెందిన ఒక ఆసక్తికర సంఘటన గురించి పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ప్రకారం.. టైలర్ అనే ఉద్యోగికి ఎలాన్ మస్క్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఆ టాస్క్ 24 గంటల్లో పూర్తి చేయాలని చెప్పాడు. టాస్క్ విజయవంతంగా పూర్తి అయితే స్పెషల్ రివార్డ్ ఇస్తానని హామీ ఇచ్చాడు. టైలర్ ఆ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా 24 గంటల్లో పూర్తి చేశాడు.

ఇచ్చిన టాస్క్ ఏంటి?

xAI టీమ్‌కు కొత్త GPU హార్డ్‌వేర్ వచ్చింది. ఆ కొత్త GPUలతో ఒక AI ట్రైనింగ్ ప్రాసెస్ రన్ చేయాలి. ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను ట్రైన్ చేసే పని. పెద్ద డేటాసెట్స్, అధిక కంప్యూటింగ్ పవర్ అవసరం. GPUలు.. CPUల కంటే చాలా వేగంగా పనిచేస్తాయి. అయితే టైలర్ ఈ కష్టమైన పనిని గడువులోగా అంటే డెడ్‌లైన్‌లోపు పూర్తి చేశాడు.

టెస్లా సైబర్‌ట్రక్ బహుమతి

Advertisement

టాస్క్ పూర్తి చేసినందుకు టైలర్‌కు ఎలాన్ మస్క్ టెస్లా సైబర్‌ట్రక్ బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలో ఈ ట్రక్ ధర సుమారు $79,900. భారతీయ కరెన్సీలో ఈ ట్రక్ విలువ దాదాపు రూ. 72.5 లక్షలు. ఈ బహుమతిని మస్క్ నేరుగా ఇచ్చాడు. సైబర్‌ట్రక్ మస్క్ ఇష్టమైన వాహనాల్లో ఒకటి. ఈ రివార్డ్ ఉద్యోగులను, సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యపరిచింది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

AIలో GPUల ప్రాధాన్యం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్‌లో GPUలు చాలా ముఖ్యం. అవి డేటాను CPUల కంటే చాలా వేగంగా ప్రాసెస్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ ట్రైనింగ్‌కు భారీ ప్రాసెసింగ్ పవర్ అవసరం. GPUలు ట్రైనింగ్ స్పీడ్, ఎఫిషియెన్సీని పెంచుతాయి. ఇది AI కంపెనీలకు అతి ముఖ్యమైనది.

ఈ ఘటన ఎలాన్ మస్క్ లీడర్‌షిప్ స్టైల్‌ను చూపిస్తుంది. ఉద్యోగుల నైపుణ్యానికి, ఇన్నోవేషన్‌కు మస్క్ ఉదారంగా ప్రతిఫలం ఇవ్వడానికి వెనుకాడడు. ఇది AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ఇలాంటి బహుమతులతో ఉద్యోగులకు సరైన మోటివేషన్ లభిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×