E-Paper
Advertisement

Electric Charcoal Burner: ఇండక్షన్ కంటే తోపు.. గ్యాస్ కంటే చౌక.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్టవ్‌ గురించి తెలుసా?

Electric Charcoal Burner: ఇండక్షన్ కంటే తోపు.. గ్యాస్ కంటే చౌక.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్టవ్‌ గురించి తెలుసా?
Advertisement

Electric Charcoal Burner: ఒక్కసారిగా గ్యాస్ ధరలు పెరగడంతో బుక్ చేసినా సిలిండర్ ఇంటికి వచ్చే వరకు టెన్షనే. అమాంతం పెరిగిపోతున్న ధరలు ఒకెత్తయితే, వంట చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాస్ ఆగిపోతుందేమోననే భయం మరో వైపు. ఇలాంటప్పుడు చాలామందికి ఇండక్షన్ స్టవ్‌లు , కరెంట్ పొయ్యిలే గుర్తొస్తాయి. కానీ కొంతమంది వాటి దగ్గరకి వెళ్లాలంటే భయపడుతుంటారు. ఎక్కడ షాక్ కొడుతుందో అని. అలాగే ఇండక్షన్ స్టవ్‌ను ఎక్కువగా వినియోగించడం వలన కరెంటు ఎక్కువగా వస్తుందేమోనని మరో భయం. అయితే వీటన్నింటినీ పక్కకు నెట్టేలా.. ఇప్పుడు మార్కెట్లోకి ‘ఎలక్ట్రిక్ బొగ్గుల పొయ్యి’ అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.1,000 లోపు లభించే ఈ పరికరం సామాన్యులకు ఎంతో మేలు చేస్తోంది.

ఇదెలా పనిచేస్తుంది?

చాలామందికి ఒక డౌట్ రావచ్చు.. ఇది కరెంటుతో నడుస్తుందా లేక బొగ్గులతోనా అని? నిజానికి ఇది రెండింటి కలయిక. కరెంటు సాయంతో బొగ్గులను వేడి చేసే టెక్నాలజీ దీనిలో ఉంటుంది. మామూలుగా బొగ్గులు రాజేయాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. పైగా ఇల్లంతా పొగతో నిండిపోతుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ బర్నర్‌తో ఆ తిప్పలు ఉండవు. దీని ప్లగ్‌ను సాకెట్‌లో పెడితే చాలు, లోపల ఉన్న హీటింగ్ కాయిల్ సెకన్లలో వేడెక్కి బొగ్గులను ఎర్రగా మండిస్తుంది. ఎలాంటి పొగ రాకుండానే హాయిగా వంట చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.2,000 లోపు బెస్ట్ పోర్టబుల్ మినీ ఏసీలు, ఫ్యాన్లు.. ఇవి నిజంగా పనిచేస్తాయా?

ఈ పొయ్యిలో ఏముంటుంది?

ఈ పొయ్యిలో అన్నిటికంటే ముఖ్యమైనది దాని హీటింగ్ కాయిల్. మనం ప్లగ్ ఆన్ చేయగానే ఇది ఎర్రగా మారుతుంది. దీని పైన ఒక చిన్న మెటల్ ట్రే ఉంటుంది. అందులోనే మనం బొగ్గులను వేసుకోవాలి. కాయిల్ నుంచి వచ్చే సెగకు బొగ్గులు చిటికెలో రాజుకుంటాయి. మనకు ఎంత వేడి కావాలో సెట్ చేసుకోవడానికి ఒక నాబ్ కూడా ఉంటుంది. కొన్ని కొత్త మోడళ్లలో అయితే ఆటోమేటిక్ కట్ ఆఫ్ సౌకర్యం కూడా ఉంది. అంటే.. పని అయిపోగానే దానంతట అదే ఆగిపోతుంది. కాబట్టి సేఫ్టీ గురించి అసలు భయపడక్కర్లేదు.

ఎందుకు ఇది బెస్ట్ అంటే?

Advertisement

దీని వల్ల ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ పొయ్యి మీద మనం ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్‌ల లాగా దీనికి విడిగా రేటు పెట్టి స్టీల్ గిన్నెలు కొనాల్సిన పని లేదు. అలాగే ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. గ్యాస్ అయిపోయినప్పుడు, వర్షాకాలంలో కట్టెలు తడిసిపోయి పొయ్యి వెలగనప్పుడు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో వంట చేసినా పొగ రాదు కాబట్టి.. గోడలు పాడవుతాయనే భయం లేదు. ఆరోగ్యానికి కూడా మంచిదే.

Also Read: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×