E-Paper
Advertisement

Yograj Singh On Dhoni: మ‌రో 10 ఏళ్లు ధోని ఐపీఎల్ ఆడాల్సిందే..ట్రోల్ చేసిన వాళ్లకు బుద్ది రావాలి

Yograj Singh On Dhoni: మ‌రో 10 ఏళ్లు ధోని ఐపీఎల్ ఆడాల్సిందే..ట్రోల్ చేసిన వాళ్లకు బుద్ది రావాలి
Advertisement

Yograj Singh On Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. ముఖ్యంగా టీమిండియా కు మూడు ఐసీసీ టోర్నమెంట్లు అందించిన ఘనత ధోని ఖాతాలో ఉంది. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ పై యువరాజు సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ( Yograj Singh ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని మరో 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ లో కొనసాగాలని కోరారు. అతడు ఆడితే ట్రోల్ చేసేవాళ్లు కుళ్ళుకోవాల్సిందేనని సెటైర్లు పేల్చారు యోగరాజ్ సింగ్.

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

మ‌రో 10 ఏళ్లు ధోని ఐపీఎల్ ఆడాల్సిందే – యోగరాజ్ సింగ్

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు దాదాపు 5 సంవత్సరాల కిందట రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మాత్రం కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొన్ని రోజుల కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని, ఇప్పుడు సాధారణ ప్లేయర్ గానే కొనసాగుతున్నారు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ( Yograj Singh ) నిత్యం ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తన కొడుకు యువరాజ్ సింగ్ కు కెప్టెన్సీ రాకుండా మహేంద్రసింగ్ ధోని కుట్రలు పన్నాడని ఇప్పటికే చాలా సార్లు అన్నారు.

యువరాజ్ సింగ్ కు ఎక్కువ అవకాశాలు రాకుండా రిటైర్మెంట్ తీసుకునేలా ధోని పన్నాగం పన్నినట్టు కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు. అయితే అలాంటి యోగరాజ్ సింగ్ తాజాగా మాట మార్చారు. మహేంద్ర సింగ్ ధోనీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో మరో 10 సంవత్సరాల పాటు కొనసాగాలని డిమాండ్ చేశారు. అతడు ప్రపంచంలోనే అద్భుతమైన ప్లేయర్ అని కితాబు ఇచ్చారు. అలాంటోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ఇక ధోని పది సంవత్సరాల పాటు టోర్నమెంట్ ఆడితే, అతన్ని ట్రోల్ చేసిన వాళ్లు, బుద్ధి తెచ్చుకుంటారని కౌంటర్ ఇచ్చారు యోగరాజ్ సింగ్. మహేంద్ర సింగ్ ధోని ఆట తీర అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా వెల్లడించారు. ధోనిని చూసి కుర్ర క్రికెటర్లు.. మరింత నేర్చుకుంటారని తెలిపారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో యంగ్ కుర్రాళ్ళు ఉన్నారు.. వాళ్లందరినీ గైడ్ చేసేందుకు అయినా పది సంవత్సరాలపాటు ఐపీఎల్ లో ధోని కొనసాగాలని కోరారు.

Advertisement

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×