// // Facebook Revenue| ప్రతి నెలా రూ.2.7 లక్షల ఆదాయం.. ఫేస్‌బుక్ యూజర్లకు మెటా బంపర్ ఆఫర్ -->
E-Paper
Advertisement

Facebook Revenue: ప్రతి నెలా రూ.2.7 లక్షల ఆదాయం.. ఫేస్‌బుక్ యూజర్లకు మెటా బంపర్ ఆఫర్

Facebook Revenue: ప్రతి నెలా రూ.2.7 లక్షల ఆదాయం.. ఫేస్‌బుక్ యూజర్లకు మెటా బంపర్ ఆఫర్
Advertisement

Facebook Creator Revenue| ఫేస్‌బుక్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్. మెటా కంపెనీ ఫేస్‌బుక్‌లో క్రియేటర్ల కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని పేరు క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్. క్రియేటర్లు ఫేస్‌బుక్‌లో త్వరగా ఫాలోవర్స్ ఈ ప్రొగ్రామ్ పెరగడానికి సహాయపడుతుంది. ఇది వారి ఆదాయాన్ని కూడా పెంచుతుంది. రీచ్ మరియు ఎంగేజ్‌మెంట్‌ను బాగా పెంచడంపై దృష్టి పెడుతుంది. కొత్త కంటెంట్‌కు ఎక్కువ విజిబిలిటీ ఇస్తుంది. పరిమిత కాలం గ్యారెంటీడ్ చెల్లింపులు కూడా ఇస్తుంది.

నెలవారీ ఆదాయ అవకాశం

ఈ ప్రోగ్రామ్‌లో అర్హత ఉన్న క్రియేటర్లకు నెలవారీ ఫిక్స్‌డ్ చెల్లింపులు ఉంటాయి. ఇవి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఉంటాయి. 1 లక్ష ఫాలోవర్లు ఉన్నవారు నెలకు గరిష్టంగా $1,000 (భారత కరెన్సీలో రూ.92,000) సంపాదించవచ్చు. 10 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారు నెలకు $3,000 (సుమారు రూ.2.7 లక్షలు) వరకు పొందవచ్చు.

ఈ ప్రోగ్రామ్‌లో ఎవరు చేరవచ్చు?

Advertisement

ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఉన్న క్రియేటర్లతో పాటు యాక్టివ్ లేని క్రియేటర్లు, కొత్త క్రియేటర్లకు ఉపయోగపడుతుంది. వీరు త్వరగా ఆడియన్స్‌ను తిరిగి పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్న క్రియేటర్లు కూడా అర్హులు. అయితే వారికి కనీసం 1 లక్ష ఫాలోవర్లు ఉండాలి. ఆడియన్స్ వృద్ధి, కంటెంట్ షేరింగ్ సులభం అవుతుంది.

క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ ప్రయోజనాలు

ఈ ప్రోగ్రామ్ రీల్స్ రీచ్‌ను చాలా ఎక్కువగా పెంచుతుంది. దీంతో ఫాలోవర్లు త్వరగా పెరుగుతారు. మూడు నెలల పాటు గ్యారెంటీడ్ చెల్లింపులు ఇస్తుంది. ఇది ప్రారంభ దశలో స్థిరమైన ఆదాయం ఇస్తుంది. మోనిటైజేషన్ టూల్స్‌కు తక్షణం యాక్సెస్ ఇస్తుంది. ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత కూడా సంపాదన కొనసాగుతుంది. దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలు సృష్టిస్తుంది.

ఫేస్‌బుక్ క్రియేటర్ ఎకానమీ వృద్ధి

Advertisement

2025లో ఫేస్‌బుక్ క్రియేటర్లకు సుమారు $3 బిలియన్లు చెల్లించింది. ఇది మునుపటి సంవత్సరం 2024 కంటే 35 శాతం ఎక్కువ. ఇప్పటి వరకు అత్యధిక పేమెంట్ ఇదే. ఇందులో రీల్స్ కోసమే 60 శాతం పేమెంట్ చేసింది. మిగిలినవి స్టోరీస్, ఫోటోలు, టెక్స్ట్ పోస్టుల నుంచి వచ్చాయి. సంవత్సరానికి $10,000 కంటే ఎక్కువ సంపాదించే క్రియేటర్ల సంఖ్య 30 శాతం పైగా పెరిగింది.

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

కొత్త పెర్ఫామెన్స్ ట్రాకింగ్ టూల్స్

ఫేస్‌బుక్ కొత్త మెట్రిక్స్ తీసుకొచ్చింది. ఇవి క్రియేటర్లు విజయాన్ని ట్రాక్ చేయడానికి సహాయపడతాయి. మానిటైజేషన్ కోసం అర్హత ఉన్న వ్యూస్ చూడవచ్చు. 1,000 వ్యూస్‌కు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవచ్చు. ఏ వ్యూస్‌ అనర్హతకు గురయ్యాయి, దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు. ఇవి కంటెంట్ స్ట్రాటజీ మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ప్రోగ్రామ్‌లో ఎలా చేరాలి?

ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ఇన్విటేషన్ మాత్రమే. ఆసక్తి ఉన్నవారు, అర్హులైనవారు ఎవరైనా చూపవచ్చు. ఫేస్‌బుక్ మొబైల్ యాప్ ఓపెన్ చేయండి. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌కు వెళ్లండి. మానిటైజేషన్ సెక్షన్‌లోకి వెళ్లండి. కంటెంట్ మానిటైజేషన్ సెలెక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఫామ్ నింపండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×