E-Paper
Advertisement

కొత్త ఏసీ కొంటున్నారా? ఈ 3 తప్పులు చేస్తే మీ డబ్బులు గోవిందా, సరైన ఏసీని ఇలా ఎంచుకోండి!

కొత్త ఏసీ కొంటున్నారా? ఈ 3 తప్పులు చేస్తే మీ డబ్బులు గోవిందా, సరైన ఏసీని ఇలా ఎంచుకోండి!
Advertisement

Dual Inverter AC vs Normal AC: ఒకప్పుడు ఏసీ అంటే అది పెద్దోళ్ల విలాసం అనుకునేవాళ్లం.. కానీ ఇప్పుడున్న వేడికి ఏసీ లేకపోతే ఎవరికైనా రోజు గడవటం కష్టంగా మారింది. అయితే ఏదైనా తక్కువ బడ్జెట్‌లో ఏసీ కొందామని షోరూమ్‌కి వెళ్తేనేమో.. రకరకాల మోడల్స్ చూపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ డ్యూయల్ ఇన్వర్టర్ గోలేంటి? మామూలు ఏసీకి దీనికి ఉన్న తేడా ఏంటి? ఏది కొంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది? ఇలాంటి సందేహాలన్నీ పక్కన పెట్టి.. ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?

సాధారణ ఏసీ ఎలా పనిచేస్తుందంటే.. అది ఒక స్విచ్ లాంటిది. గది చల్లబడే వరకు ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతుంది. గది చల్లబడగానే ఆగిపోతుంది. మళ్లీ గది కొంచెం వేడెక్కగానే మళ్లీ ఆన్ అవుతుంది. కానీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అలా కాదు. ఇది నిరంతరం రన్ అవుతూ ఉంటుంది. గదిలోని వేడిని బట్టి తన వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల గదిలో చల్లదనం ఎప్పుడూ ఒకేలా మెయింటైన్ అవుతుంది.

కరెంటు బిల్లు తగ్గాలంటే?

Advertisement

మనందరికీ ఉండే మెయిన్ టెన్షన్ కరెంటు బిల్లు. సాధారణ ఏసీ పదే పదే ఆన్, ఆఫ్ అవ్వడం వల్ల స్టార్ట్ అయిన ప్రతిసారీ ఎక్కువ పవర్ లాగేస్తుంది. దీంతో నెల చివర్లో బిల్లు చూస్తే గుండె జారినంత పనవుతుంది. అదే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అయితే, కంప్రెసర్ వేగం మారుతూ ఉంటుంది తప్ప పూర్తిగా ఆగిపోదు. కాబట్టి కరెంటు చాలా తక్కువ వాడుకుంటుంది. మీరు గనుక రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువ ఏసీ వాడేవారైతే.. కళ్లు మూసుకుని డ్యూయల్ ఇన్వర్టర్ కొనుగోలు చేయడం ఉత్తమం.

Also Read: పోర్టబుల్ ఏసీ vs టవర్ కూలర్.. మండుతున్న ఎండలకు ఏది బెస్ట్? కొనేముందు ఈ తేడాలు తెలియకపోతే నష్టపోతారు!

ఏసీ నుంచి సౌండ్ రాకూడదంటే?

Advertisement

రాత్రి పడుకున్నప్పుడు ఏసీ నుంచి గుయ్యి మనే శబ్దం వస్తే నిద్ర పట్టడం కష్టమే. సాధారణ ఏసీల్లో ఆ సౌండ్, వైబ్రేషన్లు కొంచెం ఎక్కువే ఉంటాయి. కానీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలో లోపల రెండు రోటర్లు ఉండటం వల్ల అవి ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేసుకుంటాయి. దీనివల్ల బయటి యూనిట్ నుంచి వచ్చే సౌండ్ గానీ, ప్రకంపనలు గానీ చాలా తక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా, గాఢనిద్ర పట్టాలంటే డ్యూయల్ ఏసీ బెస్ట్ ఆప్షన్.

కూలింగ్‌లో ఏది ఫాస్ట్?

ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే లేదంటే బయట ఎండలో తిరిగి వచ్చేసరికి గది చల్లగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ విషయంలో డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు తోపు అని చెప్పొచ్చు. ఇవి గదిలోని వేడిని చాలా ఫాస్ట్‌గా లాగేసి, నిమిషాల్లోనే కూలింగ్ ఇస్తాయి. అదే మామూలు ఏసీలు అయితే గది మొత్తం చల్లబడటానికి కొంచెం టైమ్ తీసుకుంటాయి. పైగా అప్పుడప్పుడు గది మరీ చల్లగా అయిపోవడం లేదా మళ్లీ వేడెక్కడం జరుగుతుంటుంది.

మొత్తానికి ఏది కొనాలి?

నార్మల్ ఏసీ కంటే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ రేటు షాపులో కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ఏసీని ఏళ్ల తరబడి వాడుతాం కదా. అలాంటప్పుడు ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లులో మనం చేసే పొదుపు చూసుకుంటే.. డ్యుయల్ ఏసీ మీద పెట్టిన అదనపు పెట్టుబడి కేవలం రెండు మూడు ఏళ్లలోనే వెనక్కి వచ్చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా చూస్తే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీయే లాభదాయకం.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ విండో ఏసీలు కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ బ్రాండ్లపై 40% వరకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×