E-Paper
Advertisement

ఒట్టేసి చెబుతున్నాం! ఆయ‌న‌తో పొత్తు మాకొద్దే ఒద్దు!

ఒట్టేసి చెబుతున్నాం! ఆయ‌న‌తో పొత్తు మాకొద్దే ఒద్దు!
Advertisement

బండ్లు ఓడ‌లు.. ఓడ‌లు బండ్లైత‌యంటారు. అట్ల‌నే ఉంది బీఆరెస్ దుస్థితి. కేసీఆర్ ప‌రిస్థితి. ఒక‌ప్పుడు బీజేపీని కేర్ కూడా చేయ‌లేదు. లెక్క‌లోకి కూడా తీసుకోలే. అంతో ఇంతో ఉన్న కాంగ్రెస్‌ను మొత్తం లేకుండా చేసే ప్ర‌య‌త్న‌మే జ‌రిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకు ఆ బీజేపీ అవ‌స‌రం క‌చ్చిత‌మై పోయింది కేసీఆర్‌కు. అందుకే కొంత‌కాలంగా అడుగులు అటే ప‌డుతున్నాయి. అప్ప‌ట్నుంచి కూడా ఆయ‌న మోడీకి ద‌గ్గ‌ర కావాల‌నే చూశాడు. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీల‌పై కూడా కేంద్రానికి మద్ద‌తు తెలిపాడు.

ఆ త‌రువాత చిన్న చిన్న విష‌యాల‌పై ఆక్షేప‌ణ‌లు వ‌చ్చినా.. మొత్తానికి మిత్ర‌ప‌క్షంగానే ప‌రోక్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చాడ‌నే చెప్పాలి. కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు కేసీఆర్‌. ఆ మాట‌ను స్వ‌యంగా త‌న‌తో చెప్పిన‌ట్టు స్వ‌యానా మోడీనే మీడియాకు వెల్ల‌డించిన విష‌య‌మూ అంద‌రికీ తెలుసు. ఇక కేసీఆర్ ప‌తార కాస్త కాస్త పడిపోతూ వ‌స్తున్న‌ది. ఓడినంక ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిల‌మైంది. క‌విత వేరు పార్టీ పెట్టుకోవ‌డం… అదీ త‌మ పాత పేరు టీఆరెస్‌తోనే త‌మ ప‌క్క‌లో బ‌ల్లెంలా మార‌డం.. తాము ఒక‌డుగు ముందుకేస్తే రేవంత్ మూడడుగులు వెన‌క్కి వేసేలా వెంటాడ‌టం.. ఇవ‌న్ని ప్ర‌తిక‌కూల ప‌రిస్థితుల న‌డుమ.. బీజేపీతో ఇక స్నేహ‌హ‌స్తం త‌ప్ప‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు గులాబీ ద‌ళ‌ప‌తి.

Advertisement

అయ‌తే ఈ అంశంపై కూడా రేవంత్ రెడ్డి… కేసీఆర్‌ను కార్న‌ర్ చేస్తూ వ‌స్తున్నారు. దేవుడిపై ఒట్టేసి చెబుతావా? బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నిక‌ల‌కు పోతావని? అని నిలదీస్తున్నారు. దీంతో దీనిపై ఏదీ క్లారిటీగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది కేసీఆర్‌కు. రేవంత్ రెడ్డి అలా అడిగినా.. ఏ ఒక్క బీఆరెఎస్ నేత కూడా దీనిపై మాట్లాడ‌లేదు. మేము బీజేపీతో క‌ల‌వ‌బోమ‌ని గానీ, పొత్తులుండ‌వ‌ని గానీ ఏదీ చెప్ప‌లేక‌పోయారు. అంటే భ‌విష్య‌త్తులో క‌లిసే పోటీ చేస్తామ‌నే సంకేతాలిస్తున్నారు మౌనం వ‌హించ‌డం ద్వారా. ఇక బీజేపీ రంగంలోకి దిగింది. ఛ‌ల్‌..! ఆయ‌న‌తో మాకు పొత్తేంది బై..! మేము ఆ బీఆరెస్‌తో పొత్తు పొట్టుకోబోం..! ఒంట‌రిగానే పోరాడుతాం.. ఎన్నిక‌ల‌కు పోతాం..!అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

ఒట్టేసి చెప్ప‌మ‌ని రేవంత్‌.. కేసీఆర్‌ను అడిగితే.. ఇక్క‌డ బీజేపీ నేత‌లు ముందుకొచ్చారు. ఒట్టేసి చెబుతున్నాం.. పొత్తు ఉండ‌బోదంటున్నారు. అంటే కేసీఆర్ స్నేహ‌హ‌స్తం చాచినా.. అందుకోబోమంటున్నారు. ఒక‌వేళ ఎన్నిక‌ల వేళ ఢిల్లీ పెద్ద‌ల‌తో మంచి మాట కుదిరి పొత్తుకు పోయినా.. ఇప్పుడు తుక్కు తుక్కు తిట్టిన తిట్లు జ‌నం మ‌రిచిపోతారా? ఆయ‌న అసెంబ్లీకి కూడా రావ‌డం లేదు. ప్ర‌తి ప‌క్ష నేత‌గా కూడా ఓడిపోయిండ‌ని బిరుదిలిచ్చేసిన బీజేపీ నేత‌లు.. రేపు ఫ్యూచ‌ర్‌లో బీఆరెస్‌తో జ‌త క‌ట్టినా.. జ‌నం ముందు ఈ రెండు పార్టీల‌కు మైన‌స్ మార్కులే ప‌డుతాయి త‌ప్ప‌.. పొత్తుకు పెద్దగా జ‌నం మద్ద‌తైతే దొర‌క‌ద‌నే అనిపిస్తుంది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×