E-Paper
Advertisement

స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది! 

స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది! 
Advertisement

Dolby Vision IQ TV Features: కొత్తగా టీవీ కొనేటప్పుడు లేదా ఇంట్లో టీవీ చూసేటప్పుడు మనకు సాంకేతిక ప్రపంచంలో రకరకాల కొత్త పదాలు వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి ‘డాల్బీ విజన్ ఐక్యూ’ (Dolby Vision IQ). సాధారణంగా టీవీ చూసేవారికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అసలు ఈ ఫీచర్ ఏంటి? దీనివల్ల మనకు ఎలాంటి లాభం ఉంటుంది? దీనిని ఆన్ చేయాలా వద్దా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మూవీని రియలిస్టిక్‌గా చూపించే ఫీచర్:

మొదట డాల్బీ విజన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది మన టీవీ స్క్రీన్‌పై వచ్చే కలర్స్, బ్రైట్‌నెస్‌ను అద్భుతంగా చూపించే ఒక అధునాతన టెక్నాలజీ. చీకటిగా ఉండే సీన్లలోని వివరాలను, అలాగే ఎక్కువ వెలుతురు ఉండే సీన్లను మన కళ్లకు నచ్చేలా, సహజంగా చూపించడం దీని ప్రత్యేకత. ఇది దాదాపు కోట్లాది రంగులను సపోర్ట్ చేస్తూ.. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌ను చాలా రియలిస్టిక్‌గా డిజైన్ చేస్తుంది.

Advertisement

Also Read: AC vs Cooler: వానా కాలంలో ఏది వాడితే కరెంట్ బిల్లు తగ్గుతుంది? కంఫర్ట్‌గా ఉంటుంది?

చీకటి సీన్ల సమస్యకు పరిష్కారం:

డాల్బీ విజన్ ఎంత బాగున్నా.. కొన్నిసార్లు చీకటి సీన్లు వస్తే స్క్రీన్‌పై ఏం జరుగుతుందో అస్సలు కనిపించదు. సినిమా తీసేవాళ్లు థియేటర్లలో లేదా చీకటి గదుల్లో చూసేందుకు వీలుగా ఆ సీన్లను డిజైన్ చేస్తారు. కానీ మనం ఇంట్లో లైట్లు వేసుకుని చూసినప్పుడు.. ఆ సీన్లు బాగా నల్లగా మారిపోయి ఏమీ అర్థం కాదు. ఈ ఇష్యూను క్లియర్ చేయడానికే డాల్బీ సంస్థ ‘డాల్బీ విజన్ ఐక్యూ’ను తీసుకొచ్చింది. ఇది టీవీలో ఉండే లైట్ సెన్సార్ సాయంతో మన రూమ్‌లో ఉన్న వెలుతురును గమనించి, దానికి తగ్గట్టుగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

ఈ ఫీచర్ ఏ టీవీల్లో ఉంటుంది?

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సోనీ, ఎల్‌జీ, హైసెన్స్, టీసీఎల్ వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీల్లో ఈ డాల్బీ విజన్ ఐక్యూ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే శాంం‌సంగ్ టీవీల్లో మాత్రం ఇది కనిపించదు. ఎందుకంటే.. శాంసంగ్ కంపెనీ డాల్బీ విజన్‌కు బదులుగా ‘హెచ్‌డీఆర్ 10 ప్లస్’ అనే సొంత టెక్నాలజీని వాడుతోంది. మీ టీవీలో ఈ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవడానికి సెట్టింగ్స్ చెక్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ను వాడాలా వద్దా?

మీకు ఇంట్లో లైట్లు ఆన్ చేసుకుని టీవీ చూసే అలవాటు ఉంటే.. ఖచ్చితంగా ఈ ఫీచర్‌ను ఒకసారి ఆన్ చేసి ప్రయత్నించవచ్చు. ఇది చీకటి సీన్లను కూడా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే కొన్ని టీవీల్లో దీని పేర్లు వేరుగా ఉంటాయి. ఉదా: ఎల్‌జీ టీవీల్లో దీనిని ‘ఏఐ బ్రైట్‌నెస్’ అని పిలుస్తారు. ఒకవేళ ఈ ఫీచర్ ఆన్ చేసినా మీకు నచ్చకపోతే.. మీ టీవీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డాల్బీ విజన్ ‘బ్రైట్’ లేదా ‘కస్టమ్’ మోడ్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా చీకటి సీన్లను స్పష్టంగా మార్చుకోవచ్చు.

Also Read: ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్ ఒకటుందని తెలిస్తే.. అసలు స్టవ్ మీద గుడ్లు ఉడకబెట్టడమే మానేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×