E-Paper
Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!

ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!
Advertisement

Fast Charging: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎంతపెరిగిందో.. అంతేస్థాయిలో బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మొబైల్ కంపెనీలు ‘ఫాస్ట్ ఛార్జింగ్’ (Fast Charging) సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయి. గంటల కొద్దీ పట్టే ఛార్జింగ్ సమయాన్ని ఇది నిమిషాల్లోకి మార్చేసింది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుందా? సాధారణ ఛార్జింగ్ కంటే ఇది ప్రమాదకరమా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది?

సాధారణ ఛార్జర్లు తక్కువ వోల్టేజ్, కరెంట్‌తో బ్యాటరీని నింపుతాయి. కానీ ఫాస్ట్ ఛార్జర్లు అలా కాదు. ఇవి రెండు దశల్లో పనిచేస్తాయి. మొదటి దశలో బ్యాటరీ ఖాళీగా ఉన్నప్పుడు (0 నుండి 70 శాతం) చాలా వేగంగా, ఎక్కువ విద్యుత్‌ను బ్యాటరీలోకి పంపుతాయి. అందుకే మొదటి అరగంటలోనే ఫోన్ సగం కంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంది. రెండవ దశలో అంటే బ్యాటరీ నిండే కొద్దీ (70 నుండి 100 శాతం వరకు) బ్యాటరీపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఛార్జింగ్ వేగాన్ని మొబైల్ లోని సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా తగ్గించేస్తుంది.

బ్యాటరీ పాడవడానికి కారణం!

Advertisement

నిజానికి ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల మాత్రమే బ్యాటరీ పాడైపోదు. బ్యాటరీ లైఫ్‌ను దెబ్బతీసే మెయిన్ విలన్ ‘వేడి’ (Heat). ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ కొద్దిగా వేడెక్కడం సహజం. అయితే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటోంది. ఇవి ఫోన్ మితిమీరిన వేడికి గురికాకుండా కరెంట్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి కంపెనీలు అందించే ఒరిజినల్ ఫాస్ట్ ఛార్జర్లను వాడినంత కాలం బ్యాటరీకి ఎలాంటి ముప్పూ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: గోర్లు లేకుండా మనిషి బతకలేడా? అవి పెరగడం ఆపేస్తే అంతే సంగతులా? నమ్మలేని నిజాలు!

ఈ తప్పులు చేయెుద్దు

Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కాకపోయినా కొందరు చేసే పొరపాట్ల వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు హెవీ గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు బ్రాండెడ్ ఛార్జర్లు కాకుండా తక్కువ ధరకు దొరికే లోకల్ ఛార్జర్లు వాడితే వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల బ్యాటరీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అటు రాత్రిళ్లు ఛార్జింగ్ పెట్టి వదిలేయద్దని నిపుణులు సూచిస్తున్నారు. లేటెస్ట్ ఫోన్లలో ఆటో కటా ఆఫ్ ఫీచర్ ఉన్నప్పటికీ 100 శాతం నిండిన తర్వాత కూడా గంటల కొద్దీ ప్లగ్‌లోనే ఉంచడం బ్యాటరీకి అంత మంచిది కాదని హితవు పలుకుతున్నారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ, స్పాట్‌లో 10 మంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×