E-Paper
Advertisement

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ,  భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..
Advertisement

America: ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు రకరకాలు మ‌ృతి చెందుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, క్యాంపస్‌లో తుపాకీ కాల్పుల్లో మరి కొందరు, జలపాతాలకు వెళ్లి ఇంకొందరు మరణించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మతాల పేరుతో మరి కొందరు బలైవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోహెల్ అనే ఉద్యోగిపై మతం కారణంగా దాడి జరిగింది. అసలేం జరిగింది?

అమెరికాలో షాకింగ్ ఘటన-అమెరికాలో కొన్నేళ్లుగా  ముస్లిం వ్యతిరేక ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడి పౌర హక్కుల సంఘాలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. వలస వ్యతిరేక ప్రసంగాలు, శ్వేతజాతి ఆధిపత్య కార్యకలాపాలు, గాజా యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు వంటి అంశాలను కారణంగా చూపుతున్నారు.

Advertisement

నువ్వు ముస్లిమా అంటూ అడిగి పొడిచాడు-తాజాగా జూలై 13న అమెరికా ఊహించని ఘటన జరిగింది. ఉటాలో వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో భారతీయుడ్ని తోటి వ్యక్తి అత్యంత దారుణంగా పొడిచాడు. ఆ మాల్‌లో పని చేస్తున్న సోహెల్ అనే ఉద్యోగిని మతం అడిగి మరీ 15 సార్లు కత్తితో పొడిచాడు మైఖేల్ లార్సెన్.

నిందితుడు ఏం చెప్పాడు? 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్.. బాధితుడు ముస్లిం కావడంతో అతడ్ని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని తెలిపాడు. తనకు ముస్లింలను చంపాలనే ఉద్దేశం ఉందన్నాడు. అసలు దాడి ఎలా జరిగింది? అక్కడి పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. లార్సెన్ తొలుత సోహైల్‌ వద్దకు వచ్చాడు. తొలుత అతడితో మాటలు మొదలు పెట్టాడు.

Advertisement

కొన్నేళ్లుగా  ముస్లిం వ్యతిరేక ఘటనలు- ఆ తర్వాత సోహైల్ ఎక్కడివాడవని అడిగడంతో తాను సాల్ట్ లేక్ సిటీకి చెప్పాడు. నువ్వు ఎక్కడివాడివి అని లార్సెన్ మరోసారి ప్రశ్నించాడు. తాను భారతదేశానికి చెందినవాడినని, పేరు సోహైల్ అని చెప్పాడు. నువ్వు ముస్లింవా? అని అడగ్గా అవునని చెప్పాడు సోహైల్. అక్కడి నుంచి సోహైల్ వెను తిరిగిన క్రమంలో లార్సెన్ తనతో తెచ్చుకున్న కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు.

ALSO READ: ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు.. సైనిక స్థావరాలు ధ్వంసం, టార్గెట్ హోర్ముజ్ జలసంధి 

ఘటన సమయంలో మాల్‌లో ఉన్నవారు లార్సెన్ ఆపేందుకు ప్రయత్నించారు. అప్పటికే సోహెల్ ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత కొంతమంది లార్సెన్ ను పట్టుకొని కింద పడేయడంతో దాడి చేయడం  ఆపేశాడని అక్కడివారు తెలిపారు. ఈ ఘటన తర్వాత లార్సెన్‌ని అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు.

నిందితుడ్ని సాల్ట్ లేక్ కౌంటీ జైలుకు తరలించారు.  వెంటనే సోహైల్‌కు ఆపరేషన్లు చేసినా ఇంకా పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిని మాల్ మేనేజర్ అద్నాన్ ఖండించారు. ఇది చాలా దారుణమని, ద్వేషపూరిత నేరాలకు తావు లేదన్నాడు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×