E-Paper
Advertisement

Apple Warning Chrome: గూగుల్ క్రోమ్‌‌ని వెంటనే డెలీట్ చేయండి.. ఐఫోన్ యూజర్లకు సీరియస్ వార్నింగ్

Apple Warning Chrome: గూగుల్ క్రోమ్‌‌ని వెంటనే డెలీట్ చేయండి.. ఐఫోన్ యూజర్లకు సీరియస్ వార్నింగ్
Advertisement

Apple Warning Chrome Privacy | ఐఫోన్ యూజర్లకు ఆపిల్ కంపెనీ తీవ్రంగా హెచ్చరించింది. “గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించడం వెంటనే ఆపేయాలని, అందుకు బదులుగా సఫారీ బ్రౌజర్ మాత్రమే ఉపయోగించాలని” అని స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే సఫారీ బ్రౌజర్ యూజర్ల ప్రైవసీ కాపాడడంలో చాలా బాగా పనిచేస్తుందని ఆపిల్ దావా. క్రోమ్, ఎడ్జ్, ఇతర బ్రౌజర్లలో “డిజిటల్ ఫింగర్‌ప్రింటింగ్” అనే కొత్త ప్రమాదం ఈ ఏడాది ముందుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని ఆపిల్ తెలిపింది.

డిజిటల్ ఫింగర్‌ప్రింటింగ్ అంటే ఏమిటి?

మీ ఫోన్ స్క్రీన్ సైజు, ఫాంట్స్, బ్రౌజర్ వెర్షన్, ఇన్‌స్టాల్ చేసిన యాప్స్.. ఇలాంటి వందల ఎలిమెంట్స్ కలిపి మీ ఫోన్‌కి ఒక యూనిక్ గుర్తింపు (ఫింగర్‌ప్రింట్) తయారు చేస్తారు. దీని ద్వారా మీరు ఎక్కడికి వెళ్లినా ట్రాక్ చేయొచ్చు. ఈ ట్రాకింగ్‌ని ఆపడం చాలా కష్టం. గూగుల్ గతంలో దీన్ని బ్యాన్ చేసినా ఇప్పుడు అనుమతిస్తోంది.

సఫారీ ఎలా కాపాడుతుంది?

Advertisement

సఫారీ బ్రౌజర్ ఈ ఫింగర్‌ప్రింటింగ్‌ని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. మీ ఫోన్ గురించి ఎవరికీ ప్రత్యేక సమాచారం ఇవ్వదు. అందరి ఫోన్ ఒకేలా కనిపించేలా చేస్తుంది. దీని వల్ల యాడ్స్ కంపెనీలు మిమ్మల్ని ట్రాక్ చేయలేవు. అలాగే AI ఉపయోగించి కుకీస్ ట్రాకింగ్ కూడా బ్లాక్ చేస్తుంది.

ప్రైవేట్ బ్రౌజింగ్ ఎలా పని చేస్తుంది?

సఫారీలో ప్రైవేట్ బ్రౌజింగ్ ఆన్ చేస్తే మీ లొకేషన్, సెర్చ్ హిస్టరీ ఎవరికీ కనిపించదు. యాడ్స్ కంపెనీలు మీ గురించి ఏమీ తెలుసుకోలేవు. గూగుల్ డాక్స్, షీట్స్ కూడా సఫారీలో బాగా పని చేస్తాయి.

గూగుల్ క్రోమ్‌తో జాగ్రత్త

Advertisement

కొంతకాలం క్రితమే సఫారీ బ్రౌజర్ ఉపయోగంలో వచ్చినా కొన్ని దేశాల్లో ఇప్పటికీ గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉంటుంది. సెర్చ్ చేస్తుంటే “గూగుల్ యాప్ డౌన్‌లోడ్” లింక్ వస్తుంది. ఒక్క క్లిక్‌తో మళ్లీ గూగుల్ జోన్‌లోకి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఇతర బ్రౌజర్లు కూడా సేఫ్‌గా ఉన్నాయా?

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కూడా ఫింగర్‌ప్రింటింగ్ బ్లాక్ చేస్తుంది. కానీ ఐఫోన్‌లో సఫారీని మించిన ప్రైవసీ ఇచ్చే బ్రౌజర్ మరొకటి లేదు. అందుకే ఆపిల్ స్పష్టంగా చెబుతోంది.. మీ ప్రైవసీ కాపాడుకోవాలంటే ఐఫోన్‌లో సఫారీని మాత్రమే ఉపయోగించండి, గూగుల్ క్రోమ్ తొలగించండి!

Also Read: 40 లక్షల కంప్యూటర్లు హ్యాక్.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో ప్రమాదం.. ఈ జగ్రత్తలు పాటించండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×