E-Paper
Advertisement

Cybercrime Blackmail: మీ ప్రైవేట్ ఫొటో, వీడియో లీక్ చేస్తామని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఇలా చేయండి

Cybercrime Blackmail: మీ ప్రైవేట్ ఫొటో, వీడియో లీక్ చేస్తామని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఇలా చేయండి
Advertisement

Cybercrime Blackmail| సైబర్ మోసగాళ్లు చాలామందిని వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు చూపింది వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తుంటారు. వారు అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని అమాయకులను బ్లాక్‌మెయిల్ ఇస్తారు. చాలా కేసుల్లో భయపడి.. వెంటనే డబ్బు పంపేస్తారు. మరి కొందరు ఆ దొంగలు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ బెదిరింపులను ఆపే సులభమైన మార్గం ఉంది.

భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ I4C (Indian Cyber Crime Coordination Centre) దీని గురించి తెలియజేసింది. ఈ విభాగం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేరుగా పనిచేస్తుంది. Cyber Dost అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.

ప్రైవేట్ కంటెంట్‌తో బ్లాక్‌మెయిల్ ఎలా జరుగుతుంది?

Advertisement

హ్యాకర్లు మీ ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలు తమ దగ్గర ఉన్నాయని చెప్పి బెదిరిస్తారు. వాటిని సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో పెడతామని భయపెడతారు. డబ్బు ఇస్తే ఆపేస్తామని చెబుతారు. చాలామంది భయంతో వెంటనే డబ్బు పంపేస్తారు. కానీ ఇలా బెదిరించే వారికి డబ్బులు ఇవ్వకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డబ్బు ఇచ్చినా వారు మళ్లీ బెదిరిస్తారు. మీ భద్రత కోసం సరైన చర్యలు తీసుకోవాలి చాలా అవసరం.

ప్రైవేట్ ఫోటోల భద్రత కోసం సులభమైన మార్గం

I4C తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక మంచి సలహా ఇచ్చింది. StopNCII.org అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించమని తెలిపింది. ఈ సైట్ ప్రైవేట్ ఇమేజ్‌ల దుర్వినియోగాన్ని ఆపడానికి సహాయపడుతుంది. ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసిన వెంటనే ఆందోళన చెందకుండా త్వరగా చర్య తీసుకోవాలి.

StopNCII.orgలో పాటించాల్సిన  దశలు

Advertisement

ముందుగా StopNCII.org అనే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేసే సేఫ్టీ ప్లాట్‌ఫాం. తర్వాత మీ ఫోటో లేదా వీడియో డిజిటల్ ఫింగర్‌ప్రింట్ (HASH కోడ్) తయారు చేయండి. ఈ ప్రక్రియ మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోనే జరుగుతుంది. మీ అసలు ఫోటో లేదా వీడియో ఎక్కడికీ అప్‌లోడ్ కాదు. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఈ HASH కోడ్‌ను ప్లాట్‌ఫాం భాగస్వామ్య సైట్‌లకు పంపుతుంది. ఒకవేళ అదే కంటెంట్ ఆన్‌లైన్‌లో కనిపిస్తే వెంటనే తొలగిస్తారు. భవిష్యత్తులో అప్‌లోడ్ అయ్యే అవకాశాన్ని కూడా బ్లాక్ చేస్తారు.

StopNCII.org అంటే ఏమిటి?

ఇది అంతర్జాతీయ సేఫ్టీ ప్లాట్‌ఫాం. నాన్-కన్సెన్సువల్ ఇమేజ్ షేరింగ్‌ను ఆపడానికి సహాయపడుతుంది. మీ కంటెంట్ సురక్షిత డిజిటల్ కోడ్‌ను తయారు చేసి, Meta, TikTok, Snapchat వంటి పెద్ద సోషల్ మీడియా కంపెనీలతో షేర్ చేస్తుంది. వీరు ఈ కోడ్‌తో మ్యాచ్ అయ్యే కంటెంట్‌ను తొలగిస్తారు, మళ్లీ అప్‌లోడ్ కాకుండా చూస్తారు. మీ అసలు ఫోటోలు ఎక్కడా స్టోర్ కావు.

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

ఈ పద్ధతి ఎందుకు పాటించాలి?

ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. డిజిటల్ భద్రత మీ చేతుల్లో ఉంటుంది. టెక్నికల్ జ్ఞానం అవసరం లేదు. కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేరస్థులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ గౌరవం, మన:శాంతిని కాపాడుకోవచ్చు.

బ్లాక్‌మెయిల్ బెదిరింపులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. తెలియని వ్యక్తులకు డబ్బు బదిలీ చేయవద్దు. నమ్మకమైన డిజిటల్ సేఫ్టీ టూల్స్ ఉపయోగించండి. I4C ప్రజలు ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. అవగాహన, త్వరిత చర్యలతో భారీ నష్టాన్ని నివారించవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు పాటించండి. మీ ప్రైవసీని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×