E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. ఐఫోన్ డిజైన్‌తో కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్.. రేటు మరీ ఇంత తక్కువా!

ఇదేందయ్యా ఇది.. ఐఫోన్ డిజైన్‌తో కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్.. రేటు మరీ ఇంత తక్కువా!
Advertisement

Coolpad Cool 80: కూల్‌ప్యాడ్ కంపెనీ తమ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘కూల్‌ప్యాడ్ కూల్ 80’ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా దీని బ్యాక్ ప్యానెల్ డిజైన్ చూడటానికి ఐఫోన్‌ను పోలి ఉండటం విశేషం.

ఈ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను రూ.11,500గా నిర్ణయించారు. ఇది రాక్ శాండ్ బ్లాక్, డ్యూన్ ఆరెంజ్, గాజ్ వైట్ అనే ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం చైనాలో మాత్రమే విక్రయాలు ప్రారంభమవగా.. గ్లోబల్ లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Also Read: పాత మోడల్‌కు గుడ్‌బై.. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో Redmi 17C వచ్చేసింది!

ఈ ఫోన్ కూల్‌ప్యాడ్ కూల్ 80 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పెద్ద IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పైభాగంలో పంచ్-హోల్ డిజైన్ ఇచ్చారు. ఫోన్ వెనుక వైపు కెమెరా సెటప్ ఐఫోన్ మోడల్స్‌ను గుర్తుకు తెచ్చినప్పటికీ.. కెమెరాల అమరిక కాస్త భిన్నంగా ఉంటుంది.

Advertisement

ఇది మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 6GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు అదనంగా మరో 8GB వరకు వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే సదుపాయం ఉంది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. దీనివల్ల ఫోన్ వేగంగా పనిచేయడమే కాకుండా ఫొటోలు, వీడియోలకు కొదవ ఉండదు.

కంపెనీ ఈ ఫోన్‌లో ఫొటోల కోసం వెనుక వైపు 13MP కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరాను అందించింది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. చైనా ఈ-కామర్స్ సైట్ జేడీ.కామ్ ప్రకారం ఇందులో 4,000mAh బ్యాటరీ, 10W చార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌తో పోలిస్తే ఇది కాస్త తక్కువ కాబట్టి, దీనిపై కంపెనీ నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: హిందీతో పాటు 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్.. ఈ Meta AI Glasses మాయాజాలం చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×