E-Paper
Advertisement

కేతన్ కేసు మరొక మలుపు.. హత్య వెనుక సియా ఏం చెప్పింది ఇదే, చేతన్ ఫ్యామిలీ ఏమంటోంది?

కేతన్ కేసు మరొక మలుపు.. హత్య వెనుక సియా ఏం చెప్పింది ఇదే, చేతన్ ఫ్యామిలీ ఏమంటోంది?
Advertisement

Ketan Agarwal Case: యంగ్ బిజినెస్‌మేన్ కేతన్ అగర్వాల్ కేసు ఎంత వరకు వచ్చింది? ఇప్పటివరకు కేతన్ హత్య గురించి తేల్చేశారు. సియా-చేతన్ హత్య వెనుక అసలేం జరిగింది? హత్య చేయాల్సిన పని ఎందుకొచ్చింది? తన లవ్ గురించి సియా ఇంట్లో చెప్పడానికి బయపడిందా? అందుకే కాబోయే భర్తను టార్గెట్ చేసిందా? దీనిపై చేతన్ కుటుంబసభ్యులు ఏమంటున్నారు?

కేతన్ కేసు మరొక మలుపు.. సియా ఒకలా.. ఆమె ప్రియుడు మరొకలా

Advertisement

పుణెలోని లోహగడ్ కోట హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ హత్య ఎలా జరిగిందన్న విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. కాబోయే భర్తను సియా హత్య చేయడం వెనుక అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణలతో సియాగోయల్-చేతన్ చౌదరి ఏం చెప్పారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

పోలీసు వర్గాలు చెబుతున్న వివరాల మేరకు.. ఎంగేజ్‌మెంట్‌కు ముందు సియా గోయల్-చేతన్ చౌదరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. కేతన్‌ను వివాహం చేసుకోవడం సియాకు ఏ మాత్రం ఇష్టంలేదని తెలుస్తోంది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని ప్రియుడు చేతన్‌తో పారిపోతే తన కుటుంబానికి అవమానం కలుగుతుందని భయపడిందట.

Advertisement

ప్రియుడితో పారిపోతే పరువుపోతుందని ఈ విధంగా చేసిందా?

ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజులకే కేతన్ అగర్వాల్ హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తొలుత ట్రెకింగ్ ఘటనగా భావించినా, సీసీటీవీ ఫుటేజ్, సేకరించిన ఇతర సాక్ష్యాల తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేతన్ హత్యకు కుట్ర పన్నడానికి బదులు చేతన్ చౌదరి-సియా గోయల్ కలిసి ఎందుకు పారిపోలేదని దర్యాప్తు అధికారులు పదేపదే నిందితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

పారిపోతే కుటుంబం పరువు పోతుందని భావించి, అందుకు బదులుగా కేతన్‌ను హత మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదంతా సియా గోయల్ వెర్షన్. మరి సియా ప్రియుడిగా చెబుతున్న చేతన్ చౌదరి మాటేంటి? ఈ కేసులో చేతన్ ఎలాంటి విషయాలు వెల్లడించాడో తెలీదు. ఆయన తండ్రి మాత్రం తన కొడుకుకు హత్యకు సంబంధం లేదని చెబుతున్నాడు.

చేతన్ చౌదరి తండ్రి బాబులాల్ చౌదరి కొన్ని విషయాలు మీడియాకు తెలిపాడు. తనకు కొడుకు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఓ మీటింగ్ ఉందని చెప్పి వెళ్లాడని వివరించాడు. తల్లికి ఇదే విషయాన్ని చెప్పాడని, అంతకుమించి మరే వివరాలు చెప్పలేదన్నాడు. తన కొడుకును ఇరికించడానికి సియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ALSO READ: నల్గొండలో నాలుగు హత్యల కేసు.. ఇంటి వ్యక్తుల పనే, హత్యల వెనుక కూతురు-అల్లుడు 

సియాను తాము ఎప్పుడూ చూడలేదని, ఆమె గురించి మాకు ఏమీ తెలియదన్నారు. ఆమె పేరు సియా అని నాకు నిన్న తెలిసిందన్నారు. ఆమెను ఇంతకు ముందెన్నడూ చూడలేదని, పోలీస్ స్టేషన్‌లో మొదటిసారి చూశానని తెలిపాడు. స్టేషన్‌లో చేతన్‌ను నేను కలిసినప్పుడు సియాకు కేతన్‌ చాలా దూరంగా ఉన్నాడని తెలిపాడు. హత్య జరిగిన రోజు లోహగడ్ కోట వద్ద చేతన్ ఎందుకు ఉన్నాడో మాకు తెలియదన్నాడు.

కేతన్ లోయలో పడినప్పుడు సియా అక్కడే ఉందని, ఆమె ఏం చేసిందో తనకు తెలీదని, తాను వెనుక నిలబడి ఉన్నానని చేతన్ చెప్పినట్టు తెలిపాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడో మాకు చెప్పలేదన్నాడు. నా కొడుకు అలాంటివాడు కాదని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన కొడుకు-సియా మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×