E-Paper
Advertisement

Laptop Mistakes: బాగా పనిచేసే ల్యాప్‌టాప్ ఒక్కసారిగా పనిచేయడం లేదా? ఇవే కారణాలు

Laptop Mistakes: బాగా పనిచేసే ల్యాప్‌టాప్ ఒక్కసారిగా పనిచేయడం లేదా? ఇవే కారణాలు
Advertisement

Laptop Mistakes| ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు.. అందరూ వీటిని ఉపయోగించాల్సి వస్తుంది. తమ వృత్తి కోసం ల్యాప్‌టాప్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యమైన ఫైల్స్, డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ ల్యాప్‌టాప్‌లోనే ఉంటాయి. అందుకే ల్యాప్‌టాప్‌ ఉపయోగించడంలో చిన్న తప్పు చేసినా ల్యాప్‌టాప్‌ సరిగా పనిచేయదు.

రిపేర్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దానికి తోడు పనిఆగిపోవడంతో పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. చాలా మంది ల్యాప్‌టాప్‌‌తో పనిచేసే సమయంలో సాధారణ తప్పులు చూద్దాం.

ల్యాప్‌టాప్‌పై బరువు పెట్టడం, భౌతికంగా డ్యామేజ్ కాకుండా జాగ్రత్త వహించండి

Advertisement

ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లడం సులభం. కానీ ప్రయాణంలో కింద పడిపోయే ప్రమాదం ఎక్కువ. చాలా మంది అజాగ్రత్తగా తీసుకెళతారు. హఠాత్తుగా జారిపోతే లోపలి భాగాలు పాడవుతాయి. కొందరు స్క్రీన్ పట్టుకుని ల్యాప్‌టాప్‌ని ఎత్తడం చేస్తారు. ఇలా చేస్తే డిస్‌ప్లే ప్యానెల్ పగిలిపోతుంది. ఎల్లప్పుడూ బేస్ భాగం పట్టుకుని ఎత్తాలి. ప్యాడెడ్ ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉపయోగించండి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి.

ల్యాప్‌టాప్ దగ్గర తినడం, తాగడం చేయకండి

చాలా మంది టీ, కాఫీ తాగుతూ పని చేస్తారు. పానీయాలను ల్యాప్‌టాప్ పక్కనే పెడతారు. పొరపాటున డ్రింక్స్ జారి పడినా నీరు లోపలికి వెళ్తుంది. కీబోర్డ్, మదర్‌బోర్డ్ డ్యామేజ్ అవుతాయి. ఇలాంటి లిక్విడ్ డ్యామేజ్ రిపేర్ ఖర్చు చాలా ఎక్కువ. పానీయాలను దూరంగా ఉంచండి. ప్రమాదవశాత్తు పడితే వెంటనే ల్యాప్‌టాప్ ఆఫ్ చేయండి. చార్జర్ తీసేసి, సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి.

ల్యాప్‌టాప్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి

Advertisement

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చాలా ముఖ్యం. అవి సెక్యూరిటీని మెరుగుపరుస్తాయి. బగ్‌లను సరిచేస్తాయి. పనితీరు మెరుగుపడుతుంది. కంపెనీలు రెగ్యులర్‌గా అప్‌డేట్లు ఇస్తాయి. అప్‌డేట్ చేయకపోతే హ్యాకర్లు సులభంగా దాడి చేస్తారు. కొత్త ఫీచర్లు కూడా వస్తాయి. ఆటోమేటిక్ అప్‌డేట్స్ ఆన్ చేయండి. సమయానికి అప్‌డేట్ చేయండి.

హార్డ్ డ్రైవ్‌ను ఓవర్‌లోడ్ చేయకండి

హార్డ్ డ్రైవ్ నిండిపోతే ల్యాప్‌టాప్ నెమ్మదిగా పనిచేస్తుంది. ఫ్రీజ్ అవుతుంది. సిస్టమ్ క్రాష్ అవుతుంది. అనవసర ఫైల్స్ డిలీట్ చేయండి. పెద్ద ఫైల్స్ ఎక్స్‌టర్నల్ డ్రైవ్ లేదా క్లౌడ్‌లో భద్రపరచండి. ఎప్పుడూ కొంత ఖాళీ స్పేస్ ఉంచండి.

Also Read: ఆన్‌లైన్ మోసాలు నివారించడానికి ఈ సెట్టింగ్స్ మార్చండి.. ఆధార్ లాక్ ఇలా చేయండి

తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూలింగ్ తప్పనిసరి

ల్యాప్‌టాప్ సాధారణ గది ఉష్ణోగ్రతలో బాగా పనిచేస్తుంది. ఎక్కువ వేడి వల్ల ఓవర్‌హీటింగ్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. లోపలి భాగాలు పాడవుతాయి. ఎండలో పెట్టకండి. మృదువైన సర్ఫేస్‌పై ఉపయోగించకండి. వెంటిలేషన్ బ్లాక్ అవుతుంది. అలాగే మరీ ఎక్కువ చల్లగా ఉండే వాతావరణంలో పెట్టినా సమస్యలు వస్తాయి. మధ్యస్థ ఉష్ణోగ్రతలోనే ఉపయోగించండి.

చిన్న జాగ్రత్తలతో ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పాటు బాగుంటుంది. ఖరీదైన రిపేర్లు తప్పుతాయి. వర్క్‌స్పేస్ శుభ్రంగా ఉంచండి. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయండి. మీ ల్యాప్‌టాప్‌ను రక్షిస్తే మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×