E-Paper
Advertisement

ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!
Advertisement

Fridge Safety: ఫ్రిజ్ క్లీన్ చేస్తూ ఓ మహిళ కరెంట్ షాక్‌కు గురైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రిజ్ లోని పదార్థాలు అన్నింటినీ బయటకు తీసి శుభ్రం చేస్తుండగా ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోవడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన ఫ్రిజ్ వాడుతున్న వారందరికీ ఓ హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు. నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ పేర్కొంటున్నారు. ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ తప్పులు చేయకూడదో ఈ కథనంలో చూద్దాం.

ఫ్రిజ్ క్లీనింగ్ పొరపాట్లు

సాధారణంగా చాలామంది ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు.. కొన్ని ప్రాథమిక నియమాలను విస్మరిస్తారు. ఫ్రిజ్ ప్లగ్ తీయకుండానే కేవలం స్విచ్ ఆఫ్ చేసి లేదా అసలు స్విచ్ కూడా ఆఫ్ చేయకుండా క్లీనింగ్ మెుదలు పెడుతుంటారు. అలాగే ఫ్రిజ్ లోపల వైర్లు, బల్బులు ఉండే భాగాల దగ్గర కూడా నీటితో కడిగే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా తడి చేతులతో ఫ్రిజ్ వెనుక భాగాన్ని, ప్లగ్ లను పట్టుకోవడానికి యత్నిస్తుంటారు. ఇలాంటివి ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని నిపుణులు అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తప్పని సరి అని సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

పవర్ కనెక్షన్ తొలగింపు

Advertisement

ఫ్రిజ్ క్లీన్ చేయడానికి కనీసం 15 నిమిషాల ముందే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి సాకెట్ నుండి ప్లగ్‌ను పూర్తిగా బయటకు తీసేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదని కొన్నిసార్లు ఎర్తింగ్ లోపం వల్ల కూడా షాక్ కొట్టే ప్రమాదం ఉందని తెలియజేస్తు్ననారు.

ఫ్రిజ్‌ను ఖాళీగా వదిలేయండి

ప్లగ్ తీసేసిన తర్వాత ఫ్రిజ్ తలుపులు తెరిచి కొద్ది సేపు ఉంచితే బెటర్. లోపల ఉన్న ఐస్ కరిగిపోవడానికి, లోపల ఉన్న కూలింగ్ తగ్గడానికి సమయం ఇవ్వండి. ఆ తర్వాతే క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాలి.

తడి గుడ్డను వాడండి

Advertisement

ఫ్రిజ్ లోపలి భాగాలను తుడవడానికి ఎక్కువ నీటిని ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోఫైబర్ క్లాత్‌ను కొద్దిగా తడిపి దాంతో తుడవాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా లైట్లు, రెగ్యులేటర్ బటన్స్ ఉన్న చోట అస్సలు నీరు తగలనివ్వకూడదని హెచ్చరిస్తున్నారు.

కాళ్లకు చెప్పులు తప్పనిసరి

ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేస్తున్నా, రిపేర్ చేస్తున్నా కాళ్ళకు రబ్బరు లేదా ప్లాస్టిక్ చెప్పులు ధరించడం తప్పనిసరి. ఇది ఎర్తింగ్ షాక్‌ల నుండి కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

Also Read: అమ్మ, నాన్నల కోసం ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోని సీనియర్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే!

వైరింగ్‌పై కన్నేయండి

ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కాయిల్స్, కంప్రెసర్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ ఏవైనా వైర్లు తెగిపోయి ఉన్నాయా? ప్లాస్టిక్ కోటింగ్ ఊడిపోయిందా? అనేది గమనించాలని సూచిస్తున్నారు. ఒకవేళ వైర్లు పాడైతే వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి బాగు చేయించుకోవాలని హితవు పలుకుతున్నారు.

Also Read: ఖాతాదారులకు భారీ షాక్.. జులైలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×