E-Paper
Advertisement

Chine Traffic Robot: నడిరోడ్డుపై రోబో పోలీసులు.. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే తప్పించుకోవడం అసాధ్యం.. ఎందుకంటే

Chine Traffic Robot: నడిరోడ్డుపై రోబో పోలీసులు.. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే తప్పించుకోవడం అసాధ్యం.. ఎందుకంటే
Advertisement

Chine Traffic Robot| చైనా దేశం అడ్వాన్స్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీల అభివృద్ధిలో దూసుకుపోతోంది. చైనా.. అన్హుయి ప్రావిన్స్‌ (రాష్ట్రం)లోని వుహు నగరంలో ఒక రద్దీ జంక్షన్‌లో ఇప్పుడు మానవ పోలీసులకు బదులు హ్యూమనాయిడ్ (మనిషి పోలికలతో ఉన్న) రోబో ట్రాఫిక్ నియంత్రిస్తోంది. సైకిల్ రైడర్లను నాన్-మోటారైజ్డ్ ప్రత్యేక లేన్‌లో వెళ్లమని, ట్రాఫిక్ రూల్స్ పాటించమని సూచిస్తూ ఉంటుంది. పోలీస్ యూనిఫాం, రిఫ్లెక్టివ్ జాకెట్, తెలుపు ట్రాఫిక్ క్యాప్ ధరించిన రోబో అచ్చం మనిషిలా అనిపిస్తుంది.

ఛాతీపై “ఇంటెలిజెంట్ పోలీస్ యూనిట్ R001” అనే బ్యాడ్జ్ కూడా ఉంటుంది. దూరంగా చూస్తే నిజమైన పోలీసుగా అనిపిస్తుంది. అయితే దగ్గరగా చూస్తే.. లోహపు శరీరం, ఫ్యూచరిస్టిక్ డిజైన్ వల్ల దాన్ని సులభంగా గుర్తించవచ్చు. స్థానికులు, ప్రయాణికులు ఆగి రోబోను చూసి ఫోటోలు తీసుకుంటున్నారు.

రోబో పోలీసులు ప్రత్యేకతలు ఇవే

Advertisement

ఇంటెలిజెంట్ పోలీస్ యూనిట్ R001 అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. సిటీ స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ నెట్‌వర్క్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ లైట్స్ మారినప్పుడు రోబో ఆటోమాటిక్‌గా సైగలు మారుస్తుంది. పాదచారులు, సైకిల్ రైడర్లు సిగ్నల్స్ స్పష్టంగా అర్థం చేసుకోగలరు. హై-డెఫినిషన్ కెమెరాలతో ట్రాఫిక్‌ను కచ్చితంగా పర్యవేక్షిస్తుంది. ఇంటెలిజెంట్ వాయిస్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్‌తో ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తుంది. AI సాఫ్ట్‌వేర్ రియల్ టైమ్‌లో ట్రాఫిక్ వైలేషన్లను గుర్తిస్తుంది. సైకిల్ రైడర్లు, పాదచారులు, వాహనాలు రూల్స్ బ్రేక్ చేస్తే ఆ తక్షణమే వార్నింగ్ ఇస్తుంది. నియమాలు ఉల్లంఘిస్తే.. డిజిటల్ ఫైన్లు విధిస్తుంది. ఆ ఫైన్లు నేరుగా ఉల్లఘించినవారి ఇంటికి చేరుతాయి.

నిరంతర పర్యవేక్షణ, స్మార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్

ఈ రోబోట్ 24 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. ఆదేశాల మేరకు ఒక చోటి నుండి మరో చోటికి స్వయంగా తరలి వెళ్తుంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అనుమతి లేని పార్కింగ్‌ను గుర్తిస్తుంది. ట్రాఫిక్ మ్యాప్‌ని పర్యవేక్షించి ట్రాఫిక్ జామ్ తగ్గిస్తుంది. ఈ రోబోల ద్వారా సేకరించిన డేటాతో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఊరి ప్లానింగ్ మెరుగుపరుస్తుంది. మానవ పోలీసులపై ఆధారపడకుండా చేస్తుంది. సేఫ్టీ పెంచి, ఖర్చులు తగ్గిస్తుంది. రోబోలు నిష్పక్షపాతంగా, స్థిరంగా చట్టాలు అమలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

చైనాలో రోబో పోలీసుల విస్తరణ

Advertisement

గత సంవత్సరం నుండి చైనాలోని అనేక నగరాల్లో అధికారులు రోబో పోలీసులను డెప్లాయ్ చేస్తున్నారు. జూన్‌లో చెంగ్డు నగరంలో హ్యూమనాయిడ్, వీల్డ్, నాలుగు కాళ్ల రోబోట్లను ఉపయోగించారు. పెట్రోలింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడ్డాయి. డిసెంబర్‌లో హాంగ్‌జౌలో AI ట్రాఫిక్ రోబోను లాంచ్ చేశారు. ఇలా చైనా వేగంగా రోబోలను చట్టాల అమలు కోసం విస్తరిస్తోంది.

Also Read: రూ.1000 కంటే తక్కవ ధరలో అద్భుత డివైజ్.. గ్యాస్ లేకుండానే కోడిగుడ్లు, కూరగాయలు బాయిల్

చైనా AI ఇండస్ట్రీ వేగంగా వృద్ధి

చైనా AI ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది. 2030 నాటికి AI మార్కెట్ 400 బిలియన్ యువాన్ (సుమారు 57.1 బిలియన్ డాలర్లు)కు చేరుతుందని అంచనా. 2035 నాటికి ఒక ట్రిలియన్ యువాన్ మించవచ్చు.

రోబోటిక్ పోలీసింగ్ భవిష్యత్తు

చైనాకు చెందిన AiMOGA రోబోటిక్స్ కంపెనీ రోబోట్ పోలీసుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. రియల్ వరల్డ్‌లో ఉపయోగించడం వల్ల ప్రజల విశ్వాసం పెరుగుతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ ప్రొడక్ట్స్ రియల్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేయాలని వారి ఉద్దేశ్యం. AiMOGA ఇప్పటికే 100కి పైగా చోట్ల రోబోట్లను డెప్లాయ్ చేసింది. రిసెప్షన్, సెక్యూరిటీ పెట్రోల్స్, పబ్లిక్ సర్వీసెస్ చేస్తున్నాయి. 2025లో 300 హ్యూమనాయిడ్ రోబోట్లు, 1000 నాలుగు కాళ్ల రోబోట్లను డెలివర్ చేశారు. 30కి పైగా దేశాల్లో AiMOGA రోబోలు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సహాయం చేసే, రియల్ టైమ్ సమాచారం ఇచ్చే వెర్షన్లు రావచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×