E-Paper
Advertisement

Smartphone Check: డిస్కౌంట్‌లో కొనుగోలు చేసిన ఫోన్ నిజమా లేక నకిలీదా?.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా!

Smartphone Check: డిస్కౌంట్‌లో కొనుగోలు చేసిన ఫోన్ నిజమా లేక నకిలీదా?.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా!
Advertisement

Smartphone Check: ఏడాది చివరికి వచ్చేసరికి బ్లాక్ ఫ్రైడే సేల్ అని, క్రిస్మస్ అని, ఫెస్టివల్ అని.. ఇంకేదో సేల్స్ అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలతో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్స్ ఇస్తుంటాయి. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ సేల్ ఆఫర్ల ద్వారా ఫోన్స్ కొంటుంటారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌లపై అనేక సంస్థలు భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తాయి. అయితే ఇలాంటి సమయాల్లో మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. కాబట్టి.. సేల్స్ ద్వారా మీరు కొన్న ఫోన్ నిజమైనదా లేక నకిలీదా తెలుసుకోవాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్ కొనుగోలు:

ఆఫ్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తుల్లో లోపాలు తలెత్తినా లేదా డ్యామేజీ ఉంటే.. స్టోర్‌కు వెళ్లి రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ స్టోర్‌లలో కొన్నిసార్లు నకిలీ ఉత్పత్తులు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సేల్స్ సమయంలో అనేక కంపెనీలు అధికారిక సెల్లర్స్ జాబితాను ప్రకటిస్తాయి. కాబట్టి.. ఈ ఆఫర్స్ నిజమని ధృవీకరించుకున్నాకే ఫోన్ కొనడం ఉత్తమం.

అధికారిక సెల్లర్స్ జాబితా:

Advertisement

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే అంతకంటే ముందే శాంసంగ్, షియోమీ, రియల్‌మి వంటి కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో తమ అధికారిక సెల్లర్స్ జాబితాను ప్రకటించాయి. కాబట్టి.. ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనేముందు.. ఆ ఫోన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఆఫర్ గురించి తనిఖీ చేయడం ఎంతైనా అవసరం.

సంచార్ సాథీ ద్వారా:

అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Sanchar Saathi వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీరు కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ నిజమైనదా, నకిలీదో తెలుసుకోవచ్చు. అందుకోసం మీ మొబైల్ నంబర్‌తోపాటు ఫోన్ IMEI నంబర్ మీ దగ్గర ఉండాలి.

ఇలా తనిఖీ చేయండి..

Advertisement

మొదట సంచార్ సాథీ అధికారిక వెబ్‌సైట్ sancharsaathi.gov.in లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజీలో Citizen Centric Servicesపైన క్లిక్ చేయండి. తర్వాత అక్కడ అనేక ఆప్షన్స్‌ తర్వాత Know Genuineness Of Your Mobile Handset అని చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, స్క్రీన్‌లో ఉన్న captcha ను నమోదు చేయాలి. దాని తర్వాత  మీ యాక్టివ్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేసి Submit పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ IMEI నంబర్‌ను నమోదు చేయాల్సిన ఆప్షన్ కనిపిస్తుంది.  IMEI నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీ ఫోన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×