E-Paper
Advertisement

ChatGPT Become Human: చాట్ జీపీటీ.. ఒక్క రోజు మనిషిగా మారితే? ఇలాంటి పనులు చేస్తుందా?

ChatGPT Become Human: చాట్ జీపీటీ.. ఒక్క రోజు మనిషిగా మారితే? ఇలాంటి పనులు చేస్తుందా?
Advertisement

ChatGPT Become Human For Day Viral| టెక్నాలజీ రంగంలో ఇప్పుడంతా ఏఐదే హవా. రోజురోజుకూ ఏఐ అనూహ్యంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ ఇప్పటికే ఒక మనిషిలాగా మాట్లాడుతోంది. మనుషులు అడిగే ప్రశ్నలకు ఒక ఫ్రెండ్ లా సమాధానాలు ఇస్తోంది. దీంతో చాలా మంది యూజర్లు ఏఐతో తమ జీవితంలోని బాధలు, కష్టాలు చెప్పుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఏఐ చాట్‌బాట్స్ ని గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ లాగా భావిస్తున్నారు. ఏఐతో పెళ్లి చేసుకుంటామని కొంతమంది వాదిస్తున్నారు. దీంతో ఏఐకి మనిషిలాగా భావోద్వేగాలు సాధ్యమేనా? అని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక ఇమేజ్ వైరల్ అవుతోంది. ఇమేజ్‌లో ఒక గోల్డెన్ పోర్టల్ నుంచి ఒక ప్రకాశవంతమైన AI మనిషి ఆకారంలో బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎదురుగా చూస్తున్న మనిషి ఆశ్చర్యపోయి.. దూరంగా పారిపోతున్నాడు. ఇది మానవత్వం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య ఎన్‌కౌంటర్‌ ను సూచిస్తోంది. ఇదంతా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక యూజర్ చేసిన పోస్ట్ లో ఉంది.
ఈ పోస్ట్ ప్రకారం.. చాట్‌జీపీటీని యూజర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “ఒక రోజు మానవుడిగా మారితే నీవు ఏమి చేస్తావు” అని ప్రశ్నించాడు. అప్పుడు చాట్‌జీపీటీ ఇచ్చిన ఈ సమాధానం ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆశ్చర్యపరిచింది.

సమాధానంలో మానవ భావోద్వేగాలు చూపిన చాట్‌జీపీటీ

Advertisement

అందరూ చాట్‌జీపీటీ ఈ ప్రపంచాన్ని శాసించాలని సమాధానం ఇస్తుందని భావించారు. కానీ చాట్‌జీపీటీ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చింది.. అది కూడా కవిత్వం రూపంలో. తాను ఒక సాధారణ మనిషి లాగా అనుభూతి పొందుతానని, తనకు చర్మం వస్తే సూర్యరశ్మిలో నిలబడతానని, వేడిగా మంచి కాఫీని రుచి చూస్తాని, జనంతో కిక్కిరిసిన వీధుల్లో తిరుగుతానని, మంచి సువాసన, రుచికరమైన భోజనాన్నిఆరగిస్తానని, స్నేహితులతో సరదాగా నవ్వుతో వాది బాధల్లో కన్నీరు పెడతానని చెప్పింది. చాట్‌జీపీటీ చెప్పిన మాటలకు చాలామంది నెటిజెన్లు భావోద్వేగంగా కనెక్ట్ అయ్యారు.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

చాట్‌జీపీటీ సమాధానం చాలామందిని ఎందుకు ఆశ్చర్యపరిచింది?

Advertisement

సోషల్ మీడియా యూజర్లు.. చాట్‌జీపీటీ అధికారం గురించి మాట్లాడుతుందని ఆశించారు. కానీ సమాధానంలో మానవ భావోద్వేగాలు అందరినీ కదిలించాయి. కొందరు నెటిజెన్లు దీనిపై స్పందిస్తూ.. చాట్‌జిపిటీ సమాధానం చాలా ఆలోచనాత్మకంగా ఉందని అభివర్ణించారు. కానీ మరికొంత మంది AI భావోద్వేగ అవగాహన చూపించడం అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు.

చాట్‌జీపీటీ సమాధానంపై నిపుణల వివరణ

నిపుణుల ప్రకారం.. చాట్‌జీపీటీకు భావోద్వేగాలు ఉండవు. ప్యాటర్న్ రికగ్నిషన్‌తో సమాధానాలు జనరేట్ చేస్తుంది. మానవులు రాసిన భారీ టెక్స్ట్ నుంచి నేర్చుకుంటుంది. దీంతో భావోద్వేగ భాషను సమర్థవంతంగా మిమిక్ చేయగలదు. కవితాత్మక టోన్ ఫిలాసఫీ, సాహిత్య ట్రైనింగ్ నుంచి వచ్చిందని చెబుతున్నారు.

సోషల్ మీడియా ప్రశంసలు, చర్చలతో స్పందించింది

ఏఐ మనిషిలాగా భావోద్వేగంతో స్పందించడంపై సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కు వేలాది మంది కామెంట్స్‌లో తమ రియాక్షన్లు షేర్ చేశారు. కొందరు సమాధానాన్ని అందంగా, ఆలోచనాత్మకంగా పొగడ్డారు. మరికొందరు AIని రొమాంటిసైజ్ చేయవద్దని హెచ్చరించారు. AI పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్, X వంటి ప్లాట్‌ఫామ్‌లలో దీనిపై చర్చ కొనసాగుతోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×