E-Paper
Advertisement

Fridge Blast: ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ఫ్రిడ్జ్ పేలిపోతుంది!

Fridge Blast: ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ఫ్రిడ్జ్ పేలిపోతుంది!
Advertisement

Fridge Blast: సాధారణంగా ఫ్రిడ్జ్ పేలడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ, ఒక్కసారి ఇది పేలిందంటే మాత్రం దాని తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. మన కుటుంబానికే కాకుండా పక్క ఇళ్లకు కూడా నష్టం కలిగించేంత ప్రమాదం దీనిలో దాగి ఉంది. స్టవ్ లేదా టోస్టర్ వంటి వస్తువుల వల్ల ప్రమాదం జరిగితే కనీసం పొగ వచ్చి మనల్ని అలర్ట్ చేస్తాయి. కానీ ఫ్రిడ్జ్ పేలుడు మాత్రం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బూమ్ అంటూ ఒక్కసారిగా పేలిపోతుంది. అందుకే దీని గురించి ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అసలు ఫ్రిజ్ ఎందుకు పేలుతుంది?

ఫ్రిజ్ పేలడానికి ప్రధాన కారణం దాని వెనుక భాగంలో ఉండే కంప్రెషర్. దీనిలో ఉండే పంప్, మోటార్.. గ్యాస్‌ను కాయిల్స్ ద్వారా పంపిస్తుంటాయి. ఈ గ్యాస్ చల్లబడి ద్రవ రూపంలోకి మారినప్పుడు ఫ్రిజ్ లోపల ఉన్న వేడిని పీల్చుకుని వస్తువులను చల్లగా ఉంచుతుంది. అయితే, కొన్నిసార్లు ఈ కంప్రెషర్ విపరీతంగా వేడెక్కిపోతుంది. అలాంటప్పుడు లోపల ఉన్న కాయిల్స్ కుంచించుకుపోయి, గ్యాస్ బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతుంది. ఇలా గ్యాస్ పేరుకుపోయి ఒత్తిడి పెరగడం వల్ల ప్రమాదకరమైన పేలుడు సంభవిస్తుంది. ముఖ్యంగా 8 నుండి 10 ఏళ్ల కంటే పాతదైన ఫ్రిడ్జుల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Also Read: సమ్మర్ వచ్చేసింది.. ఏసీని ఆన్ చేసే ముందు ఈ 4 పనులు తప్పక చేయండి!

ప్రమాదకరమైన ఇన్సులేషన్:

మనం ఇంట్లో వాడే వస్తువులన్నిటిలో ఫ్రిడ్జ్ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే.. దీనిలో వాడే ఇన్సులేషన్ ఫోమ్, ప్లాస్టిక్ కవర్లు త్వరగా మంటలు అంటుకునే స్వభావం కలిగి ఉంటాయి. ఒకవేళ చిన్న ఎలక్ట్రికల్ ఫాల్ట్ జరిగినా లేదా పక్కన ఉన్న వేరే వస్తువు వల్ల మంటలు అంటుకున్నా, ఫ్రిజ్ ఒక్కసారిగా అగ్నిగుండంలా మారిపోతుంది. మిగతా వస్తువులన్నీ మనం వాడి ఆపేస్తాం కానీ, ఫ్రిజ్ మాత్రం రాత్రింబవళ్లు పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి.. మనం పడుకున్న సమయంలో ఏదైనా చిన్న తేడా జరిగినా అది ప్రాణాంతకమైన బ్లాస్ట్‌కు దారితీసే అవకాశం ఉంది.

ఈ ప్రమాదాలను ఆపడమెలా?

Advertisement

మీ ఫ్రిడ్జ్ సురక్షితంగా ఉండాలంటే కంప్రెషర్ కాయిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అక్కడ దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవడం వల్ల కంప్రెషర్ మీద లోడ్ తగ్గుతుంది. ఫ్రిడ్జ్ లోపల ఏవైనా భాగాలు పాడైపోయినా లేదా అరిగిపోయినా వాటిని వెంటనే రిపేర్ చేయించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రస్తుతం సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి.. ఈ సమయంలో మీ ఫ్రిడ్స్‌ను ఒకసారి సర్వీస్ చేయిస్తే మీరూ ప్రశాంతంగా ఉండొచ్చు.

Also Read: వాషింగ్ మెషీన్‌ను పాడు చేసే ఈ 4 పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×