E-Paper
Advertisement

Vem Narender Reddy: బిగ్ టీవీ ఛైర్మన్‌కు పితృవియోగం.. పరామర్శించిన సీఎం సలహాదారుడు.. చిత్రపటానికి నివాళులు

Vem Narender Reddy: బిగ్ టీవీ ఛైర్మన్‌కు పితృవియోగం.. పరామర్శించిన సీఎం సలహాదారుడు.. చిత్రపటానికి నివాళులు
Advertisement

Vem Narender Reddy: బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ తండ్రి రాఘవేందర్ రెడ్డి మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పరామర్శించారు. తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న విజయ్, ఆయన సోదరుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిని ఓదార్చారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేం నరేందర్ రెడ్డి తోపాటు, పలవురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

బిగ్ టీవీ ఛైర్మన్ తండ్రి రాఘవేందర్ రెడ్డి (79).. ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి అనారోగ్య సంబంధిత కారణాలతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో సంస్మరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు.. అక్కడికి వెళ్లి రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి.. రెడ్యాల గ్రామానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు.

Advertisement

రాఘవేందర్ రెడ్డి మరణించిన రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థించారు. రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఎక్స్ వేదికగా రాఘవేందర్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. వెన్న రాఘవేందర్ రెడ్డి మృతి బాధాకరమంటూ పోస్ట్ పెట్టారు. అటు తెలంగాణ మంత్రులు, రాజకీయ ప్రముఖులు సైతం రాఘవేందర్ రెడ్డి మరణం నేపథ్యంలో సంతాపం తెలియజేశారు.

Also Read: Ramzan 2026: ప్రభుత్వం కీలక ఆదేశం.. తెల్లవారుజామున 5 గంటల వరకూ షాపులు ఓపెన్.. ఎందుకంటే?

Advertisement

వెన్నం రాఘవేందర్ రెడ్డి మరణం నేపథ్యంలో ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, సన్నిహితులకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. మంత్రులు సీతక్క (Minister Seethakka), వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ సైతం బిగ్ టీవీ ఛైర్మన్ తండ్రి మరణంపై స్పందించారు. వారి మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తీరని లోటని పేర్కొన్నారు. అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం.. సంతాప ప్రకటన విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయంలో విజయ్ రెడ్డి, వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అటు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలియజేశారు.

Also Read: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×