E-Paper
Advertisement

Cancer:- ఇంట్లోనే క్యాన్సర్‌కు టెస్ట్.. సెన్సార్ ద్వారా..

Cancer:- ఇంట్లోనే క్యాన్సర్‌కు టెస్ట్.. సెన్సార్ ద్వారా..
Advertisement

Cancer:- ఈరోజుల్లో టెక్నాలజీ పెరగడం వల్ల ప్రాణాంతక వ్యాధుల గురించి కూడా తెలుసుకోవడం సులభంగా మారింది. కానీ వాటిని ఎంత తొందరగా గుర్తిస్తాం అనేదాన్ని బట్టి మరణం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇప్పుడు చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. దీని కారణంగానే క్యాన్సర్‌ను కూడా లక్షణాలు కనిపించడానికి ముందే కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మరో కొత్త పద్ధతిని వారు కనుక్కున్నారు.

ఒక యూరిన్ టెస్ట్‌తో క్యాన్సర్‌ను కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటికే యూరిన్ టెస్ట్ వల్ల క్యాన్సర్ అనేది బయటపడకముందే కనుక్కోవచ్చని ఇతర శాస్త్రవేత్తలు కనిపెట్టినా.. తాజాగా ఎమ్ఐటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మరికాస్త భిన్నంగా, మరికొన్ని కొత్త విషయాలను బయటపెట్టాయి. ఎమ్ఐటీ పరిశోధకులు మనిషిలోని క్యాన్సర్‌ను కనిపెట్టడానికి కొత్త రకమైన సెన్సార్‌ను తయారు చేశారు. ఈ సెన్సార్‌పైన యూరిన్ చేసిన తర్వాత దాని నుండి వచ్చే రిజల్ట్ ద్వారా మనిషికి వచ్చిన ట్యూమర్ ఏ రకమని తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

క్యాన్సర్ గుర్తించడంతో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి కూడా ఆ ట్రీట్మెంట్ ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అని తెలుసుకోవడానికి ఈ సెన్సార్ యూరిన్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ విధంగానే క్యాన్సర్ కిట్ ఉంటుందని, ఎవరైనా ఈ టెస్ట్‌ను ఇంట్లో సులభంగా చేసుకోవచ్చని వారు తెలిపారు. ఇలాంటి కిట్స్ తయారయ్యి మార్కెట్లోకి వచ్చే సమయానికి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నారు.

ఇప్పటికే ఈ క్యాన్సర్ టెస్టులను ఎలుకలపై చేసి చూశారు. ఈ సెన్సార్ల సాయంతో ఎలుకల్లో ఉన్న లంగ్ క్యాన్సర్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రస్తుతం వారు చేస్తున్న పరిశోధనల్లో 46 రకాల డీఎన్ఏ శాంపుల్ బార్‌కోడ్స్‌ను విభజిస్తామని తెలిపారు. ఈ బార్‌కోడ్స్ ద్వారా క్యాన్సర్‌ను కనిపెట్టడం మాత్రమే కాకుండా దానిని విభజించే ప్రయత్నం కూడా చేస్తున్నామని వారు బయటపెట్టారు. త్వరలోనే మనుషులపై ఈ కిట్‌ను ప్రయోగించడంతో పాటు అతిత్వరలో దీనిని మార్కెట్లోకి కూడా ప్రవేశపెట్టాలని వారు సన్నాహాలు చేస్తున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×