E-Paper
Advertisement

Cancer:- డీఎన్ఏ బార్‌కోడ్స్‌తో క్యాన్సర్ గుర్తింపు..

Cancer:- డీఎన్ఏ బార్‌కోడ్స్‌తో క్యాన్సర్ గుర్తింపు..
Advertisement

Cancer:- టెక్నాలజీ ఎంత పెరిగినా కొన్ని దేశాల్లో క్యాన్సర్ మరణాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం క్యాన్సర్ భూతంతో పోరాడక తప్పడం లేదు. అయితే క్యాన్సర్ అనేది లేటుగా బయటపడడం కూడా మరణాలకు ఎక్కువశాతం కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సను అందించడంతో పాటు దానిని తొందరగా కనుగొనే మార్గాలపై శాస్త్రవేత్తలు దష్టిపెట్టారు.

ఇప్పటికే క్యాన్సర్‌ను కనుక్కోవడానికి ఎన్నో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. టెస్టులు జరిగిన తర్వాత ఎక్కువగా ఆలస్యం అవ్వకుండా రిపోర్టులు వచ్చేలాగా టెక్నాలజీలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజుల్లో పెరుగుతున్న క్యాన్సర్ మరణాలను దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ అనేది శరీరంలోకి రాకముందే అది వచ్చే అవకాశం ఉందేమో అని తెలుసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు భావించారు. అందుకే ఆ కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు.

Advertisement

ఇప్పటికే పలు పద్ధతుల్లో భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో కనుక్కునే అవకాశం ఉంది. కానీ అవేవి పూర్తిస్థాయిలో వైద్యులకు అందుబాటులో లేవు. తాజాగా కేవలం యూరిన్ టెస్ట్‌తో క్యాన్సర్‌ను కనుక్కోవచ్చన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత ఒక నానోపార్టికల్ సెన్సార్‌తో దానిని పరీక్షించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని తెలుస్తుందని వారు తెలిపారు.

నానోపార్టికల్ సెన్సార్ అనేది కేవలం క్యాన్సర్ అవకాశాన్ని కనిపెట్టడం మాత్రమే కాకుండా ఎలాంటి క్యాన్సర్ అటాక్ అవ్వబోతుంది, దానికి మెరుగైన చికిత్స ఏంటని కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నానోపార్టికల్స్ అనేవి మనిషి శరీరంలో ఉన్న ట్యూమర్‌కు సంబంధించిన డీఎన్ఏ రూపాలు యూరిన్ నుండి బయటికి రావడాన్ని కనిపెడతాయి. ఆపై దానికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు క్యాన్సర్ మొదటి స్టేజ్‌లో ఉండడాన్ని కూడా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ నానోపార్టికల్ సెన్సార్ డీఎన్ఏ టెస్టులను ఎలుకలపై ప్రయోగించి చూశారు. అప్పుడు వివిధ రకాల డీఎన్ఏ బార్‌కోడ్లు అయిదు రకాల వేర్వేరు రకాల క్యాన్సర్లను కరెక్ట్‌గా కనిపెట్టింది. అయితే ఎలుకలకు వచ్చే క్యాన్సర్‌కు, మనుషులకు వచ్చే క్యాన్సర్లకు చాలా తేడా ఉంటుందని, అందుకే ప్రస్తుతం తాము తయారు చేసిన డీఎన్ఏ బార్‌కోడ్లు మనుషులలో క్యాన్సర్ల తేడాలను కనిపెట్టడానికి ఉపయోగపడవని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. త్వరలోనే మనుషులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ డీఎన్ఏ బార్‌కోడ్ల టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×