E-Paper
Advertisement

Human Age 150: మనుషులు నిజంగా 150 సంవత్సరాలు జీవించగలరు.. ఎలాగంటే?

Human Age 150: మనుషులు నిజంగా 150 సంవత్సరాలు జీవించగలరు.. ఎలాగంటే?
Advertisement

Human Age 150| భూమిపై అత్యంత అభివృద్ధి చెందిన జాతి మానవ జాతి. టెక్నాలజీ, మెడికల్ సైన్స్‌ రంగంలో మనుషులు నిరంతరం అభివృద్ధి సాధిస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు తరుచూ ఒక ప్రశ్న ఎదుర్కొంటున్నారు. మనుషులు 150 సంవత్సరాలు జీవించగలరా? అని. అయితే కొందరు ఇది అసాధ్యమని చెబుతుండగా.. మరికొందరు సైన్స్ రంగంలో పెద్ద విజయాలతో సాధ్యమని నమ్ముతున్నారు. ఏదేమైనా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడపైనే ఇప్పుడు అందరి ఫోకస్.

ఇటీవలి అధ్యయనం ఏమి చెబుతోంది?

నేచర్ జర్నల్‌లో ఇటీవలే మనిషి జీవితకాల పరిమితిపై ఒక అధ్యయనం ప్రచురితమైంది. 20వ శతాబ్దంలో మరణాల రేటు గణనీయంగా తగ్గింది. కానీ ఈ శతాబ్దంలో అదే స్థాయి పురోగతి లేదని అధ్యయనం చెప్పింది. శాస్త్రవేత్తలు బయోలాజికల్ సీలింగ్ ఉండవచ్చని అంచనా వేశారు. శరీర నిర్మాణం అతి ఎక్కువ వయస్సును అనుమతించకపోవచ్చు.

హార్వాత్ క్లాక్, బయోలాజికల్ ఏజ్

Advertisement

స్టీవ్ హార్వాత్ అనే జన్యు శాస్త్రవేత్త బయోలాజికల్ ఏజింగ్ టూల్ తయారు చేశాడు. దీన్ని హార్వాత్ క్లాక్ అంటారు. ఇది జన్యు డేటా ఆధారంగా బయోలాజికల్ ఏజ్ అంచనా వేస్తుంది.DNA మెథైలేషన్ ప్యాటర్న్స్ ద్వారా సెల్యులర్ లెవల్‌లో ఏజింగ్ కొలుస్తుంది. శరీరం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా వృద్ధాప్యం చెందుతోందో చూపిస్తుంది. హార్వాత్ ప్రకారం ఏజింగ్ సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో 150 సంవత్సరాలు సాధ్యమని హార్వాత్ క్లాక్ నమ్మకం.

DNA మెథైలేషన్ అంటే ఏమిటి?

DNA మెథైలేషన్ జీన్ల పర్‌ఫామెన్స్ నియంత్రిస్తుంది. DNA స్ట్రక్చర్ మారకుండానే జీన్ యాక్టివిటీని మారుస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని బయోలాజికల్ ఏజ్ అంచనా కోసం ఉపయోగిస్తారు. కానీ ఇది ఏజింగ్‌కు ఒకే ఫ్యాక్టర్ మాత్రమే. పూర్తి జీవితకాలాన్ని కచ్చితంగా చెప్పలేదు.

జీవనశైలి, ఆరోగ్యమే ముఖ్యం

Advertisement

న్యూట్రిషన్ నిపుణురాలు ముగ్ధా ప్రధాన్ ముఖ్యమైన విషయాలు చెప్పారు. జీవితకాలం జీవనశైలి ఫ్యాక్టర్లపై ఆధారపడుతుంది. మంచి సమతులమైన ఆహారం, మంచి జీర్ణక్రియ, నిద్ర, స్ట్రెస్ లెవల్స్ ముఖ్యమైనవి. ఇన్‌ఫ్లమేషన్, ఎన్విరాన్‌మెంటల్ టాక్సిన్స్ కూడా ప్రభావం చూపుతాయి. మానసిక ఆరోగ్యం, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన శరీరం కోసం రోజువారీ శ్రద్ధ అవసరం. టెక్నాలజీ మాత్రమే జీవితాన్ని పెంచలేదు.

మెడికల్ రంగంలో కొత్త మార్పు, పరిమితులు

ఆధునిక మెడిసిన్ (ఔషధాలు) మనిషి సగటు జీవితకాలాన్నిపెంచింది. శరీరంలో ఆర్గాన్లు (ముఖ్యభాగాలు) ఫెయిల్ అయినప్పుడు మెషీన్లు సపోర్ట్ చేస్తాయి. డయాలసిస్, వెంటిలేటర్లు దానికి ఉదాహరణలు. ఇవి మనుషులను ఎక్కువ కాలం బతికేలా చేస్తాయి. కానీ కొన్నిసార్లు జీవన క్వాలిటీ తగ్గుతుంది. ఎక్కువ వయస్సు అంటే ఎక్కువ కాలం జీవించడం కాదు.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం. చాలా మంది వృద్ధులు ఆరోగ్య సమస్యలతో, కనీసం శరీరాన్ని కదలించడానికి కూడా ఇబ్బంది పడుతూ జీవిస్తుంటారు.

లాంగెవిటీ అసలు అర్థం ఏమిటి?

నిపుణులు అసలు లాంగెవిటీ అంటే ఆరోగ్యంగా జీవించడమని చెబుతున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, కాళ్లు చేతులు బాగా పనిచేస్తుండడం చేయగలగాలి. వృద్ధాప్యంలోనూ ఎవరి సహాయం లేకుండా జీవించగలగడం చాలా ముఖ్యం. అంతేకాని.. ఏ పనీచేయలేని, అర్థంలేని జీవితం గడుపుతూ ఎక్కువ కాలం బతకడం కాదు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎనర్జీ, కాంట్రిబ్యూషన్ ఉన్న జీవితమే సార్థకమని వారి వాదన. మంచి ఆరోగ్యంతో 100 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

సరైన జీవితకాలాన్ని అంచనా వేయగలమా?

శాస్త్రవేత్తలు జీవితకాలాన్ని కచ్చితంగా చెప్పలేరు. బయోలాజికల్ క్లాక్స్ అంచనాలు మాత్రమే ఇస్తాయి. అవి ప్రాబబిలిటీ చూపిస్తాయి, డెస్టినీ కాదు. భవిష్యత్ విజయం మెడికల్ సైన్స్ ఆవిష్కరణలపై ఆధారపడుతుంది. జీన్ థెరపీ, రిజెనరేటివ్ మెడిసిన్ ముఖ్యమైనవి. సెల్ రిపేర్ టెక్నాలజీ గణనీయంగా మెరుగవ్వాలి. అప్పుడే మనుషులు అతి ఎక్కువ వయస్సును సమీపించగలరు.

150 సంవత్సరాలు జీవించడంపై శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పలేరు. కానీ సరైన జీవినశైలితో సాధ్యమయ్యే అవకాశాలున్నాయని మనిషి ఏజింగ్ మెకానిజమ్‌ల గురించి అన్వేషణ సాగుతోంది. టెక్నాలజీ కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఎక్కువ ముఖ్యం. నాణ్యమైన జీవితమే అసలు విజయం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×