E-Paper
Advertisement

Cameraless iPhone: కెమెరా లేని స్పెషల్ ఐఫోన్‌.. ధర చాలా ఎక్కువ.. ఎందుకంటే?

Cameraless iPhone: కెమెరా లేని స్పెషల్ ఐఫోన్‌.. ధర చాలా ఎక్కువ.. ఎందుకంటే?
Advertisement

Cameraless security iPhone Expensive| స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్ లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే ఫోన్‌లలో అగ్రస్థానం ఐఫోన్‌లదే. ఇందులో ఉండే సూపర్ డిస్‌ప్లే, సెక్యూరిటీ, కెమెరా ఫీచర్స్ మరే ఇతర బ్రాండ్ లలో లభించవు. అయితే చాలా మంది ఐఫోన్ లను కెమెరా కోసమే కొంటారు. కానీ కొందరికి తెలియని సీక్రెట్ ఐఫోన్ ఒకటి ఉంది. అసలు కెమెరాలేని ఐఫోన్ మోడల్స్ ఉన్నాయి. ఫోన్ ముందు, వెనుకభాగం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. లెన్స్, కటౌట్ ఏమీ కనిపించదు. పైగా ఈ స్పెషల్ ఫోన్‌లు మామూలు ఐఫోన్ కంటే చాలా ఖరీదు. ఎవరు కొంటారు, ఎందుకు ఉన్నాయి అనే వివరాలు మీ కోసం.

ఈ ఫోన్‌లు ఎవరి కోసం తయారు చేశారు?

ఈ ఫోన్‌లు హై సెక్యూరిటీ (కఠిన భద్రత) అవసరం ఉండే ప్రదేశాల్లో పని చేసే వారు ఉపయోగిస్తారు. ఉదాహరణకు న్యూక్లియర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియా, సీక్రెట్ రీసెర్చ్ ల్యాబ్స్, షిప్‌యార్డ్స్ లాంటివి. ఇక్కడ ఫోటో తీయడం పూర్తిగా నిషేధం. అక్కడ పని చేసే ఉద్యోగులకి కెమెరా లేని ఫోన్ తప్పనిసరి. వాళ్లు ఈ స్పెషల్ ఐఫోన్స్ ఉపయోగిస్తారు. ఈ విషయం ఆ ఏరియాల్లో పని చేసే వారు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

ఈ ఫోన్‌ల ధర ఎంత ఖరీదు?

Advertisement

ఈ కొత్త రకం ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి. ఉదాహరణకి iPhone SE (2020) మోడల్ 1,130 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.95,000), iPhone SE (2022) 1,680 డాలర్లు (సుమారు రూ.1.4 లక్షలు). ఈ ధరలు చూస్తేనే తెలుస్తోంది.. మామూలు ఐఫోన్ కంటే ఈ ధరలు చాలా రెట్లు ఎక్కువ అని. కానీ ఈ హై సెక్యూరిటీ ఏరియాల్లో పని చేసే కంపెనీలు తప్పనిసరిగా ఈ ఫోన్స్‌ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తాయి. భద్రత కోసం అంత ధరను చెల్లిస్తాయి.

ఈ ఫోన్‌లు ఎవరు తయారు చేస్తారు?

సాధారణంగా ఐఫోన్స్ తయారు చేసేది ఆపిల్ కంపెనీ. కానీ ఈ ఫోన్‌లు మాత్రం ఆపిల్ తయారు చేయదు. స్పెషల్ థర్డ్ పార్టీ కంపెనీలు చేస్తాయి. NonCam, Mister Mobile లాంటి కంపెనీలు ఈ సర్వీస్ ఇస్తాయి. వాళ్లు మామూలు ఐఫోన్ తీసుకొని కెమెరా మాడ్యూల్ పూర్తిగా తొలగించి. వెనుకవైపు ఖాళీ ప్యానెల్ పెడతారు. సాఫ్ట్‌వేర్‌లో కెమెరా ఫంక్షన్స్ డిసేబుల్ చేస్తారు. చూస్తే మామూలు ఐఫోన్‌లాగానే కనిపిస్తుంది. ఇది ప్రత్యేక ఫోన్ అని ఎవరూ గుర్తించలేరు.

Advertisement

టెక్నీషియన్స్ మామూలు ఐఫోన్ ఓపెన్ చేస్తారు. కెమెరా పార్ట్స్ అన్నీ జాగ్రత్తగా తీసేస్తారు. లోపలి స్పేస్ శుభ్రం చేస్తారు. వెనుక కవర్‌లో కెమెరా గ్లాస్ బదులు ఖాళీ ప్యానెల్ పెడతారు. సాఫ్ట్‌వేర్ మార్చి కెమెరా ఆప్షన్స్ పూర్తిగా డిసేబుల్ చేస్తారు. చివరికి ఫోన్ ఒరిజినల్ ఐఫోన్‌లాగానే కనిపిస్తుంది.

Also Read: గూగుల్ క్రోమ్‌‌ని వెంటనే డెలీట్ చేయండి.. ఐఫోన్ యూజర్లకు సీరియస్ వార్నింగ్

సాధారణ పౌరుల కోసం కాదు

ఈ ఫోన్‌లు మామూలు ప్రజల కోసం కాదు. హై సెక్యూరిటీ పరిసరాల్లో పని చేసే వారి కోసం మాత్రమే. ఆ పరిసరాల్లో ఫోటో తీయడం నేరం. ఈ కారణంగానే ఈ ప్రత్యేక ఫోన్లను ఉపయోగించాల్సి వస్తుంది.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×