E-Paper
Advertisement

AC కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్.. ఎక్కడ కొంటే డబ్బులు మిగుల్చుకోవచ్చో తెలుసా?

AC కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్.. ఎక్కడ కొంటే డబ్బులు మిగుల్చుకోవచ్చో తెలుసా?
Advertisement

AC Buying Tips: కరోనా పుణ్యమా అని మన అలవాట్లు అన్నీ మారిపోయాయి. అప్పట్లో బయట అడుగు పెట్టాలంటేనే భయపడి చచ్చేవాళ్లం కదా. అప్పుడు మొదలైన ఈ ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం ఇప్పటికీ మన జీవితంలో ముఖ్య భాగమైపోయింది. కిరాణా సామాను దగ్గరి నుండి.. స్మార్ట్‌ఫోన్, టీవీ, చివరకు ఏసీ వరకు అన్నీ మొబైల్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఇంటికి వచ్చేస్తున్నాయి. బయట ఎండలో తిరిగే పని లేకుండా, ఇంట్లో కూర్చునే ఏసీని ఆర్డర్ ఇచ్చేయడం ఈజీ అనిపిస్తుంది.

కానీ, అసలు కథ డెలివరీ అయ్యాకే మొదలవుతోంది. ఆన్‌లైన్‌లో తక్కువ రేటుకి వస్తుందని ఆశపడి ఏసీ కొంటే.. ఆ తర్వాత ఇన్‌స్టాలేషన్ కోసమో లేదా చిన్న రిపేర్ వచ్చినా కస్టమర్ కేర్ చుట్టూ తిరగలేక చాలామంది తలపట్టుకుంటున్నారు. అందుకే, ఈ వేసవిలో మీరు గనుక కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఆ తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క విషయం ఆలోచించుకోవాలి.. అసలు ఏసీ ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? లేక పాత పద్ధతిలో షోరూమ్‌కి వెళ్లి కొంటేనే సేఫా? ఈ రెండింటి మధ్య ఉన్న లోగుట్టులేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వందలాది మోడల్స్:

Advertisement

ప్రస్తుతం మనందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. ఆన్‌లైన్ షాపింగ్ బాగా అలవాటైపోయింది. ఆన్‌లైన్‌లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏమిటంటే.. బయట షాపులు తిరగాల్సిన పని లేకుండా, ఇంట్లో ఏసీ కింద కూర్చునే వందలాది మోడల్స్ చూసేయొచ్చు. ఏ బ్రాండ్ ధర ఎంత ఉంది? ఏయే ఫీచర్లు ఎలా ఉన్నాయి? అనేది నిమిషాల్లో పోల్చి చూసుకోవచ్చు. అలాగే మన బడ్జెట్‌కి ఏది కరెక్టో కూడా మనమే ఒక అంచనాకి రావచ్చు.

ఊరించే డిస్కౌంట్లు:

దీనికి తగ్గట్టే ఆన్‌లైన్ సైట్లలో అప్పుడప్పుడు ఇచ్చే సేల్స్ ఆఫర్లు అదిరిపోతాయి. ముఖ్యంగా సమ్మర్ సేల్స్ ఉన్నప్పుడు రేట్లు బాగా తగ్గుతాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉండటం వల్ల నెలకింత అని కట్టుకునే వీలుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇంతకుముందు ఆ ఏసీ కొన్న వాళ్లు అది ఎలా పనిచేస్తుందో, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కింద రివ్యూలు రాస్తారు. అవి చదివితే ఆ ఏసీ అసలు రంగు ఏంటో మనకు ముందే అర్థమైపోతుంది.

Advertisement

Also Read: వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

బరువు మోసే బాధ ఉండదు:

సాధారణంగా ఏసీ అంటేనే భారీ వస్తువు. షాపులో కొంటే అది ఇంటికి వచ్చే వరకు ఎక్కడో కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో కొంటే ఆ బాధ్యత అంతా వాళ్లే తీసుకుంటారు. డెలివరీ అబ్బాయిలు జాగ్రత్తగా మన రూమ్ వరకు తెచ్చి పెడతారు. మనం చేయాల్సిందల్లా ఆర్డర్ ఇచ్చి హాయిగా ఎదురుచూడటమే. ఇది మన శ్రమను, టైమ్‌ను చాలా వరకు సేవ్ చేస్తుంది.

షాపుకెళ్లి చూస్తేనే కదా తృప్తి:

కొంతమందికి వస్తువును కళ్లతో చూసి, చేత్తో ముట్టుకుంటేనే నమ్మకం కుదురుతుంది. అందుకే ఇప్పటికీ చాలామంది షోరూమ్‌లకే వెళ్తుంటారు. ఏసీ సైజు ఎంత ఉంది? బాడీ క్వాలిటీ ఎలా ఉంది? రిమోట్ వాడటం ఈజీగా ఉందా? ఇవన్నీ లైవ్‌లో చూడొచ్చు. అక్కడ ఉండే సేల్స్ వాళ్లని అడిగితే ఇన్వర్టర్ టెక్నాలజీ గురించి లేదా కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అనే విషయాల గురించి మనకు అర్థమయ్యేలా వివరిస్తారు. ఇది ఒక రకంగా పర్సనల్ టచ్ అన్నమాట.

ఆన్‌లైన్‌లో బేరసారాలు చేయలేం:

ఆన్‌లైన్‌లో రేటు ఎంత ఉంటే అంతే కట్టాలి. కానీ షాపుల్లో కొంటే బేరమాడే ఛాన్స్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఇంతకే వస్తుంది.. మీరు కూడా అదే రేటుకి ఇస్తే ఇప్పుడే కొనేస్తా అని అడిగితే, వాళ్లు మన కోసం రేటు తగ్గించడమో లేదా ఒక స్టెబిలైజర్‌ను ఫ్రీగా ఇవ్వడమో చేస్తారు. పైగా షాపులో కొంటే డెలివరీ కూడా స్పీడుగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో లాగా వారం రోజులు వెయిట్ చేయాల్సిన పని లేకుండా, సాయంత్రానికే ఇంట్లో ఏసీ ఉండొచ్చు.

ఇన్‌స్టాలేషనే అసలు సమస్య:

ఏసీ కొంటే సరిపోదు.. దాన్ని గోడకు బిగించాలి. ఆన్‌లైన్‌లో కొన్నప్పుడు డెలివరీ ఒకరు చేస్తే.. బిగించడానికి ఇంకొకరు వస్తారు. వీళ్ల మధ్య సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోతే రెండు మూడు రోజులు టైమ్ పట్టొచ్చు. అదే మనం తెలిసిన షాపులో కొంటే, వాళ్లు వెంటనే టెక్నీషియన్‌ను పంపిస్తారు. అయితే ఎక్కడ కొన్నా సరే, పక్కాగా జీఎస్టీ బిల్లు అడిగి తీసుకోవాలి. రేపు పొద్దున్న వారంటీ కావాలన్నా, రిపేర్ వచ్చినా ఆ బిల్లే ముఖ్యం.

ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్:

సింపుల్‌గా చెప్పాలంటే.. తక్కువ ధరలో ఓపికగా మోడల్స్ వెతుక్కోగలను అనుకుంటే ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అలా కాకుండా.. వెంటనే ఏసీ కావాలి, కళ్లారా చూసి కొనాలి అనుకుంటే షోరూమ్‌కి వెళ్లి కొనడం ఉత్తమం. చిన్న ట్రిక్ ఏంటంటే.. ముందు ఒకసారి బయట షాపుకెళ్లి మీకు నచ్చిన మోడల్ చూసి, దాని ధర కనుక్కోండి. అదే మోడల్ ఆన్‌లైన్‌లో ఎంత ఉందో చెక్ చేయండి. ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడ డీల్ క్లోజ్ చేసేయండి.

Also Read: ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×