E-Paper
Advertisement

Bluetooth Landline: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Bluetooth Landline: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన
Advertisement

Bluetooth Landline Sales| అమెరికాకు చెందిన టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఒక యువతి క్యాట్ గోట్జే. ఆమె స్మార్ట్‌ఫోన్‌ నోటిఫికేషన్లు, బ్లూ స్క్రీన్‌తో విసిగిపోయింది. దీనికి బదులు పాత ల్యాండ్‌లైన్ ఫోన్ ఎంత ప్రశాంతంగా ఉండేదని ఆమెకు ఆలోచన వచ్చింది. కానీ కొత్త ల్యాండ్‌లైన్ కనెక్షన్ కోసం ఖర్చు చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే సెకండ్-హ్యాండ్ షాపు నుంచి పాత ల్యాండ్‌లైన్ హ్యాండ్‌సెట్ కొని తెచ్చింది.

బ్లూటూత్ ల్యాండ్ లైన్ తయారు చేసిన క్యాట్

ఆ పాత ల్యాండ్ లైన్‌ని ఇంట్లోనే తెరిచి దాని వైరింగ్ మార్చింది. అందులో బ్లూటూత్ చిప్ అమర్చి, స్మార్ట్‌ఫోన్‌తో వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఆ తరువాత కాల్ వస్తే పాత ఫోన్ మోగింది. దాన్నే ఎత్తి మాట్లాడింది. పాత ఫోన్ ఇప్పుడు సూపర్‌గా పనిచేస్తోందని ఆమె తన స్నేహితులకు షేర్ చేసింది.

సోషల్ మీడియాలో సూపర్‌హిట్

Advertisement

జూలై 2025లో తన బ్లూటూత్ ల్యాండ్‌లైన్ ప్రాజెక్ట్ వీడియోను క్యాట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొద్ది గంటల్లోనే వందల కామెంట్లు వచ్చాయి. కామెంట్లలో “నాకూ కావాలి! ఎక్కడ కొనాలి?” అని నెటిజెన్లు ఆమెను అడిగారు.

3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

బ్లూటూత్ ల్యాండ్ లైన్ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉందని తెలిసిన క్యాట్ వెంటనే చిన్న వెబ్‌సైట్ తెరిచి ప్రీ-ఆర్డర్ పెట్టింది. కేవలం మూడు రోజుల్లో $120,000 (భారత కరెన్సీలో సుమారు రూ.1 కోటి) ఆర్డర్లు వచ్చాయి. కొన్ని వారాల్లో మొత్తం $280,000 (రూ.2.3 కోట్లు) అయింది. మొత్తం 3,000 కంటే ఎక్కువ ఫోన్లు సేల్స్ జరిగాయి.

కంపెనీ ప్రారంభించిన క్యాట్

Advertisement

సేల్స్ బాగా జరుగుతుండడంతో ఇప్పుడు “ఫిజికల్ ఫోన్స్” అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఐదు రకాల పాత స్టైల్ మోడళ్లు తయారు చేస్తోంది. ఒక్కో ఫోన్ ధర రూ.7,500 నుంచి రూ.9,000 మధ్య ఉంటుంది. డిసెంబర్ 2025 నుంచి డెలివరీ మొదలైంది.

ఫోన్ ఎలా పనిచేస్తుంది?

  • స్మార్ట్‌ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది
  • నార్మల్ కాల్స్, వాట్సాప్, ఫేస్‌టైమ్ కాల్స్ – అన్నీ ఈ ఫోన్‌లోనే మోగుతాయి
  • పాత బటన్లతోనే నంబర్ డయల్ చేయొచ్చు
  • స్టార్ (*) బటన్ నొక్కితే సిరి/గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. ఫోన్ తడవకుండానే వాయిస్ కమాండ్ ఇవ్వొచ్చు!

వేర్వేరు కారణాలతో కొనుగోలు చేస్తున్న యూజర్లు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. కోవిడ్ తర్వాత సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఈ రెట్రో ఫోన్ డిజిటల్ డిటాక్స్‌కు హెల్ప్ చేస్తుంది. ఇందులో పింక్-గోల్డ్ మోడల్ సూపర్ హిట్!

తదుపరి క్యాట్ ప్లాన్ ఏమిటి?

క్యాట్ ఇంకా కొత్త మోడళ్లను రూపొందిస్తోంది. “ప్రజలు డిజిటల్ జీవితం నుంచి కొంచెం దూరమై, సరళమైన జీవితం ఆస్వాదించాలి” అని ఆమె చెబుతోంది. ఒక చిన్న సరదాగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారిందని క్యాట్ సంతోషంగా తెలిపింది.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×