E-Paper
Advertisement

BSNL Recharge Plan: రోజుకు రూ.6తో.. 164 రోజుల పాటు.. 300GB డేటా, అపరిమిత కాల్స్!

BSNL Recharge Plan: రోజుకు రూ.6తో.. 164 రోజుల పాటు.. 300GB డేటా, అపరిమిత కాల్స్!
Advertisement

BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్లలో రూ. 997 ప్లాన్ ఒకటి. చాలా మంది యూజర్లు అత్యధికంగా ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. హోలీ సందర్భంగా జియో.. ఈ ప్లాన్ పై భారీ ఆఫర్ ను సైతం ప్రకటించింది. ప్లాన్ మీద అదనంగా 14 రోజుల వ్యాలిడిటీని పెంచింది. ఇంతకీ ప్లాన్ ఫీచర్లు ఏంటీ? దీనిని చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏవి? ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి? వంటివి ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 997 ప్లాన్ ఫీచర్లు

సాధారణంగా ఈ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో జియో విడుదల చేసింది. అయితే మార్చి 4న హోలీ సందర్భంగా జియో ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 31లోపు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 14 వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 164 రోజుల పాటు ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ కింద ప్రతీ రోజు 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకి తగ్గుతుంది. అటు దేశంలో ఎక్కడికైనా ఫ్రీ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, అదనంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ (BSNL Tunes) అందుబాటులో ఉంటాయి.

ఈ ప్లాన్ ఎవరికి ప్రయోజనకరం?

Advertisement

ప్రతి నెలా రీఛార్జ్ చేసే పని లేకుండా ఒకేసారి రీఛార్జ్ 5 నెలల కాలానికి మంచి ప్లాన్ కోరుకునేవారికి ఇది ఉత్తమమైన ప్లాన్ గా నిలుస్తుంది. అలాగే విద్యార్థులు, డేటా అధికంగా అవసరం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్లాన్ వల్ల కలిగే లాభాలు

రోజువారీ ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తుంది. రూ.997 రీఛార్జ్ ప్లాన్ ను 164 వ్యాలిడిటీతో పరిగణిస్తే రోజుకు సుమారు రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి టెలికాం సంస్థల ప్లాన్స్ తో పోలిస్తే.. 5 నెలల కాలానికి ఇంత తక్కువ ఖర్చుతో అన్ని ఎక్కువ ప్రయోజనాలు ఎందులోనూ లేదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also Read: BSNL Monthly Plans: వారెవ్వా.. ఇవి కదా చీపెస్ట్ ప్లాన్స్ అంటే.. భలే ఛాన్సులే!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

రూ.997 ప్లాన్ ను 4 రకాల పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మెుదటి మార్గంలో భాగంగా.. మీ ఫోన్‌లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, ‘Recharge’ విభాగంలో రూ. 997 ప్లాన్ ఎంచుకుని పేమెంట్ చేయవచ్చు. లేదంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్ నంబర్ నమోదు చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే (GPay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm), అమెజాన్ పే వంటి ప్లాట్‌ఫామ్స్ లో BSNL ఆప్షన్ ఎంచుకుని రూ. 997  రీఛార్జ్ చేయవచ్చు. ఇది కానీ పక్షంలో నేరుగా రిటైలర్ వద్దకు వెళ్లి ప్లాన్ గురించి చెప్పి రీఛార్జ్ పొందవచ్చు.

Also Read: AC Placement Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? వాస్తు లేదనుకుంటా.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×