E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: తమిళంలో విడుదలకు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్..ఎప్పుడంటే?

Ustaad Bhagat Singh: తమిళంలో విడుదలకు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్..ఎప్పుడంటే?
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గతంలో కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈయన నటించిన హరిహర వీరమల్లు, ఒజి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పట్ల కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చి 19 లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తమిళంలోనూ విడుదల కానున్న పవన్ సినిమా..

హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే విడుదల కాబోతున్నదని అభిమానులు భావించారు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర బృందం శుభవార్తను తెలియజేశారు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కాబోతుందని తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తమిళ విడుదల గురించి మేకర్స్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మాస్ యుఫోరియా రాబోతోంది..

Advertisement

ఈ సినిమా మార్చి 19వ తేదీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కాబోతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాస్ యుఫోరియా రాబోతోంది.. గెట్ రెడీ అంటూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు తమిళనాడు వ్యాప్తంగా ఏజీఎస్ సినిమా ద్వారా ఈ చిత్రం మార్చ్ 19వ తేదీ విడుదల కానుంది. ఇలా ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడ విడుదల కాబోతున్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

Advertisement

గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఈయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఆ సినిమా పెద్ద ఎత్తున సక్సెస్ అందుకుంది. ఇలా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించగా శ్రీలీల, రాశీ కన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. హరీష్ శంకర్ ఇటీవల కాలంలో పలు సినిమాలు ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ సినిమా పైనే హరీష్ భారీగా అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Peddi Movie: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు..అసలేం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×