E-Paper
Advertisement

సామాన్యులకు బంపరాఫర్.. BSNL కనీవినీ ఎరుగని ప్లాన్.. ఎగిరిగంతేయడం పక్కా!

సామాన్యులకు బంపరాఫర్.. BSNL కనీవినీ ఎరుగని ప్లాన్.. ఎగిరిగంతేయడం పక్కా!
Advertisement

BSNL Plan: టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యులకు షాకిస్తుంటే.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మాత్రం అదిరిపోయే ఆఫర్లతో దూసుకుపోతోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఆశించే వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ.51 రూపాయలకే రోజుకు 2GB హై స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తూ ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు గట్టి పోటీ ఇస్తోంది.

రూ.51 ప్లాన్ బెనిఫిట్స్..

బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.51 ప్లాన్ బడ్జెట్ వినియోగదారులు, మిడిల్ క్లాస్ వారికి ఒక వరమనే చెప్పాలి. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కు ప్రతీరోజూ 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ డైలీ లిమిట్ పూర్తైనా.. తక్కువ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ ను యూజర్ ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం పొందొచ్చు.

ఈ ఆఫర్ వారికి మాత్రమే

Advertisement

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే తీసుకొచ్చింది. కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లో చేరే వారికి ‘రూ.51 ఫ్రీడమ్ ఆఫర్’ వర్తించనుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నవారికి ఈ ఆఫర్ వర్తించదని జియో వర్గాలు తేల్చిచెప్పాయి. కొత్త యూజర్లకు.. పైన (పై పారాగ్రాఫ్) పేర్కొన్న బెనిఫిట్స్ తో పాటు ఉచితంగా సిమ్ సైతం అందించడం జరుగుతుందని జియో స్పష్టం చేసింది.

 కొద్ది రోజులే.. త్వరపడండి!

బీఎస్ఎన్ఎల్ ఈ రూ.51 ప్లాన్ ఆఫర్ ను మే 22న లాంచ్ చేసింది. జూన్ 30వ తేదీ వరకూ ఈ ఫ్రీడమ్ ఆఫర్ కొత్త కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. కాబట్టి కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లో చేరాలని భావిస్తున్నవారు.. ఈ ఆఫర్ పొందేందుకు BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలని సూచించింది. లేదంటే దగ్గరలోని రిటైలర్ స్టోర్స్ కు వెళ్లైనా.. ఫ్రీడమ్ ఆఫర్ ను దక్కించుకోవచ్చని వెల్లడించింది.

Advertisement

Also Read: ఇది కదా ప్లాన్ అంటే.. రూ.79కే జియో అదిరిపోయే గిఫ్ట్.. నెలంతా ఎంజాయ్ పండగో!

ఈ ఆఫర్‌తో ఎవరికి బెనిఫిట్..?

తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, ఫ్రీ కాలింగ్ కోరుకునే విద్యార్థులకు ఈ బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే వర్ ఫ్రమ్ ఉద్యోగులు, సెకండ్ సిమ్ కోరుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రైవేటు టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలలో ఇలాంటి ప్రయోజనాలు పొందాలంటే కనీసం రూ. 200 నుండి రూ. 300 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటిది బీఎస్‌ఎన్‌ఎల్ లో కేవలం రూ. 51 కే ఈ సేవలను పొందే అవకాశం కల్పిస్తుండటం విశేషం.

Also Read: ఐశ్వర్యా రాయ్ బరువుపై ట్రోల్స్ చేసిన వారికి కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇచ్చిపడేసిందిగా…

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×