E-Paper
Advertisement

సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో నెల రోజుల కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ? రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

బీఎస్ఎన్ఎల్ క్రేజీ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.249 ప్లాన్.. ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇది బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్లాన్ వివరాలకు వస్తే.. దీనిని 35 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చారు. రోజుకు 2GB హై స్పీడ్ డేటాతో పాటు అపరిమిత కాల్స్ అందించనున్నారు. డేటా లిమిట్ అయిపోతే.. ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకి తగ్గిపోనుంది. వాట్సప్ చాట్ కు ఈ నెట్ వేగం సరిపోనుంది. మరోవైపు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లు చేసుకునే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కింద కల్పిస్తోంది.

రూ.225 ప్లాన్‌తో పోలికలు..

Advertisement

అయితే గతంలోనే తీసుకొచ్చిన రూ.225 ప్లాన్ కు దగ్గరగా రూ.249 ఉండటం విశేషం. అయితే రూ.225 ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రోజుకు 2.5GB డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలను ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. అయితే రూ.19 అదనంగా చెల్లించడం ద్వారా మరో 5 రోజుల వ్యాలిడిటీ అదనంగా రూ.249 ప్లాన్ లో లభిస్తుండటం గమనార్హం. ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలని కోరుకునేవారికి రూ.249 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే రోజూ వారి డేటా 500MB వరకూ తగ్గడం ఈ ప్లాన్ లో మైనస్ గా చెప్పవచ్చు.

Also Read: ఫ్రిడ్జ్‌లో ఈ పండ్లు పెడుతున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. షాకింగ్ నిజాలు!

ఎవరికి ఈ ప్లాన్ బెస్ట్?

Advertisement

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను సెకండరీ సిమ్‌గా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల కాలింగ్, ఇంటర్నెట్ అవసరాలు ఉన్నవారు కూడా ఈ రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్, జియోతో పోలిస్తే ఇంత తక్కువ ధరలో 35 రోజుల వ్యాలిడిటీ, 2GB డేటా, ఫ్రీ కాల్స్ ఇస్తున్న ప్లాన్ ఇదేనని టెలికాం వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.

Also Read: వర్షాకాలం స్పెషల్.. ఏసీలో ‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×