E-Paper
Advertisement

BSNL Reduces Validity: 35 రోజుల వ్యాలిడిటీ 22 రోజులకు కుదింపు, ఇదేం దారుణం?

BSNL Reduces Validity: 35 రోజుల వ్యాలిడిటీ 22 రోజులకు కుదింపు, ఇదేం దారుణం?
Advertisement

ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు షాక్ ఇచ్చింది. దాని ప్రీపెయిడ్ ప్లాన్స్ కు సంబంధించి వ్యాలిడిటీని తగ్గిస్తూ నిర్ణయం తీకుంటుంది. తాజాగా రూ. 107 రీఛార్జ్ వోచర్ చెల్లుబాటును తగ్గించింది. BSNL సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ గతంలో 35 రోజుల వ్యాలిడిటీని అందించగా, ఆ తర్వాత దానిని, 28 రోజులకు కుదించింది. ఇప్పుడు మరోసారి ఆ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. BSNL మరికొన్ని చౌకైన రీఛార్జ్ ప్లాన్లలో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 54 రోజుల చెల్లుబాటును అందించే రూ. 197 రీఛార్జ్ ఇప్పుడు 42 రోజుల వ్యాలిడిటీకి కుదించినట్లు సమాచారం.

రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్  22 రోజులకు కుదింపు!  

BSNL రూ. 107 రీఛార్జ్ వోచర్ ను కొద్ది రోజుల క్రితం 28 రోజులకు తగ్గించగా, ఇప్పుడు మరింత తగ్గించింది. కేవలం 22 రోజులు చెల్లుబాటు అందిస్తుంది. రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభంలో 35 రోజుల చెల్లుబాటుతో వచ్చేది. కొద్ది రోజలు క్రితం ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులకు కుదించింది. ఇప్పుడు మరో 6 రోజులు తగ్గించి, 22 రోజులకు పరిమితం చేసింది.

బెనిఫిట్స్ విషయంలో నో ఛేంజ్!

Advertisement

వ్యాలిడిటీ తగ్గించినప్పటికీ, టాక్‌ టైమ్, డేటా, SMS సహా ఇతర బెనిఫిట్స్ మారలేదు. రూ. 107 రీఛార్జ్ వోచర్ అపరిమిత డేటాను అందిస్తుంది. అయితే, వినియోగదారులు 3GB డేటాను వినియోగించిన తర్వాత 40 kbps వేగాన్ని తగ్గించింది. ఇది మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) నెట్‌ వర్క్‌ తో సహా 200 నిమిషాల ఉచిత లోకల్, STD, రోమింగ్ వాయిస్ కాల్స్ ను కూడా అందిస్తుంది.  ఉచిత టాక్‌టైమ్ అయిపోయిన తర్వాత, సబ్‌స్క్రైబర్లకు లోకల్ వాయిస్ కాల్స్‌ కు నిమిషానికి రూ. 1, వీడియో కాల్స్‌ కు నిమిషానికి రూ. 1.3, STD వాయిస్ కాల్స్‌ కు నిమిషానికి రూ. 2 ఛార్జ్ చేస్తుంది.   , కోటా అయిపోయిన తర్వాత ఉపయోగించే ప్రతి MB డేటాకు డేటా ఛార్జీ 25pగా నిర్ణయించింది.

Read Also: ఎయిర్‌ టెల్ బెస్ట్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్, బాబోయ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

చౌక ధరల వ్యాలిటిడీ తగ్గింపు! 

Advertisement

BSNL దాని గత కొద్ది రోజులుగా తన చౌక ప్లాన్స్ కు సంబంధించి వ్యాలిడిటీని తగ్గిస్తుంది. జూలైలో రూ. 197 ప్లాన్ చెల్లుబాటును 70 రోజు నుంచి 54 రోజులకు కుదించింది. ఇప్పుడు, ఆ ప్లాన్ వ్యాలిడిటీని 42 రోజులకు తగ్గించింది. ఇందులో 300 నిమిషాల వాయిస్ కాల్స్, 4GB వరకు అపరిమిత హై-స్పీడ్ డేటా, మొత్తం 100 SMSలు ఉచితంగా లభిస్తున్నాయి.  అయితే, తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ వ్యాలిడిటీ తగ్గించడం వల్ల.. ఆ ప్రభావం పేద వినియోగదారుల మీద భారీగా పడుతుంది. వ్యాలిడిటీ తగ్గింపు విషయంలో కంపెనీ మరోసారి పునరాలోచించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Read Also: జస్ట్ రూ. 251కే 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. ఎన్ని రోజులంటే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×