E-Paper
Advertisement

BSNL T20I WC 2026 Offer: క్రికెట్ లవర్స్ కు BSNL గుడ్ న్యూస్, ఈ ప్లాన్ తో ఏకంగా వరల్డ్ కప్ మొత్తం చూసేయొచ్చు!

BSNL T20I WC 2026 Offer: క్రికెట్ లవర్స్ కు BSNL గుడ్ న్యూస్, ఈ ప్లాన్ తో ఏకంగా వరల్డ్ కప్ మొత్తం చూసేయొచ్చు!
Advertisement

BSNL 499 Plan: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా క్రేజీ ప్లాన్స్ తీసుకురావడంలో BSNL ముందుంటుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ హంగామా కొనసాగుతున్న నేపథ్యంలో స్పెషల్ ప్లాన్ ను పరిచయం చేసింది. అభిమానులు ఎక్కడి నుంచైనా ప్రతి లైవ్ మ్యాచ్ థ్రిల్‌ ను ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రీఛార్జ్ ప్లాన్ మాదిరిగా కాకుండా, BSNL  యాడ్ ఆన్ OTT ప్యాక్‌ ను ప్రారంభించింది. ఈ యాడ్ ఆన్ తో మూడు ప్రధాన OTT ప్లాట్‌ ఫామ్‌ లకు మూడు నెలల మెంబర్ షిప్ ను కేవలం రూ. 499కే అందించనుంది. ఒకవేళ T20 ప్రపంచ కప్‌ లోని ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకుంటే, ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది.

BSNL 499 ప్లాన్  బెనిఫిట్స్ ఏంటి?  

ఈ కొత్త యాడ్ ఆన్ ప్లాన్ ను కేవలం రూ.499కే అందుబాటులోకి తీసుకొచ్చింది. BSNL తన అధికారిక X  అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్లాన్ ప్రకారం బోలెడు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇంతకీ అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల వరకు OTT సభ్యత్వాన్ని పొందుతారు.

⦿ ఒకేసారి 2 స్క్రీన్లలో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ ఈ రీఛార్జ్ తో JioHotstar, ZEE5, SonyLiv లాంటి ప్లాట్‌ ఫారమ్‌ల ను చూసే అవకాశం ఉంటుంది.

⦿ ఈ రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు చెల్లెబాటు అవుతుంది.

⦿ మొత్తం T20 ప్రపంచ కప్ సీజన్‌ను కవర్ చేస్తుంది.

ఇది రీఛార్జ్ కాదు.. జస్ట్ స్ట్రీమింగ్ ప్యాక్!

ఇక ఈ రూ. 499 ప్లాన్ గురించి BSNL కీలక ప్రకటన చేసింది. ఈ ప్లాన్‌ లో డేటా, కాలింగ్, SMS లాంటి బెనిఫిట్స్ ఉండవు. ఇది పూర్తిగా కంటెంట్ యాడ్ ఆన్ ప్యాకేజీ. మ్యాచ్‌లు, షోలను ప్రసారం చేయడానికి మీకు ఇప్పటికీ తగినంత డేటాతో యాక్టివ్ BSNL బేస్ ప్లాన్ అవసరం. దీన్ని OTT యాక్సెస్‌ కు షార్ట్‌ కట్‌ గా భావించాల్సి ఉంటుంది. మీ సాధారణ రీఛార్జ్‌ కు ప్రత్యామ్నాయం కాదు. ఇప్పటికే ఉన్న ప్లాన్ కు ఇది యాడ్ అవుతుంది. ఈ రీఛార్జ్ తో వినియోగదారులు ఇప్పుడు ఒకే ప్లాన్‌తో మూడు ప్రధాన OTT ప్లాట్‌ ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. టీ20 ప్రపంచ కప్ 2026 అయినా, ఇష్టమైన వెబ్ సిరీస్ అయినా మూడు నెలల పాటు చూసే వెసులుబాటు ఉంటుంది.

Read Also: పెళ్లి విందులో ఏం తినాలో తెలియక తికమక పడుతున్నారా? ఈ AI ఏజెంట్‌‌ను అడిగితే సరి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×