E-Paper
Advertisement

Sree Vishnu OTT: ఓటీటీ మార్కెట్‌‌లో దుమ్ము రేపుతున్న శ్రీ విష్ణు.. డీల్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Sree Vishnu OTT: ఓటీటీ మార్కెట్‌‌లో దుమ్ము రేపుతున్న శ్రీ విష్ణు.. డీల్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Advertisement

Sree Vishnu OTT: టాలీవుడ్‌లో ‘మినిమం గ్యారెంటీ’ హీరో అంటే ఒకప్పుడు కొందరి పేర్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు ఆ జాబితాలో టాప్ ప్లేస్‌లో కనిపిస్తున్న పేరు శ్రీవిష్ణు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన అప్‌కమింగ్ సినిమాలతో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నారు. సాధారణంగా టైర్-2 హీరోల సినిమాలకు ఓటీటీ మార్కెట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఊపందుకుంటుంది. కానీ శ్రీవిష్ణు విషయంలో సీన్ మారింది. ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు రిలీజ్‌కు ముందే భారీ డీల్స్ కుదుర్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘మృత్యుంజయ’ సినిమాను సుమారు 8 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ‘విష్ణు విన్యాసం’ చిత్రాన్ని కూడా దాదాపు అదే రేటుకు (8 కోట్లు) సొంతం చేసుకుంది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలకు రెండు వేర్వేరు అగ్ర ఓటీటీ సంస్థలు పోటీపడి మరీ కోట్లు కుమ్మరించడం శ్రీవిష్ణు పెంచుకున్న బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనం.

Read also-Podarillu Today Episode : మాధవ్ పై మహా కు అనుమానం.. కొత్త ఫ్యామిలీతో ట్విస్ట్.. చక్రీకి షాక్..

‘థియేటర్’ హీరో vs ‘ఓటీటీ’ హీరో

Advertisement

ప్రస్తుతం పరిశ్రమలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొంతమంది హీరోలు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నా, కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నారు. వీరు కేవలం ఓటీటీలకు మాత్రమే పరిమితమవుతూ “ఓటీటీ హీరోలు” అనే ముద్ర వేయించుకుంటున్నారు. కానీ శ్రీవిష్ణు రూటే వేరు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాలతో థియేటర్ల వద్ద జనాలను క్యూ కట్టించారు. ఆ నమ్మకమే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆయన సినిమాలకు ఇంతటి క్రేజ్‌ను తీసుకొచ్చింది.

Read also-Mrunal Thakur: వాలెంటైన్స్ డే కాదు ఫూల్స్ డే.. రూమర్స్ పై మండిపడ్డ మృణాల్!

సక్సెస్ మంత్రం

Advertisement

శ్రీవిష్ణు సక్సెస్‌కు ప్రధాన కారణం ఆయన ఎంచుకునే వైవిధ్యమైన కథలు. రొటీన్ మాస్ మసాలా కథల జోలికి వెళ్లకుండా, కథలో కొత్తదనం ఉంటేనే సైన్ చేస్తారు దీంతో సినిమాకు ఆయన మార్క్ ఉంటుంది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ముందే ఊహించి, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్దపీట వేయడం కూడా శ్రీ విష్ణు సినిల్లో ఆయనకు కలిసొచ్చే అంశం. మిగతా హీరోలు కూడా కేవలం బ్యానర్ల వెంట పడకుండా, శ్రీవిష్ణు లాగా కంటెంట్‌ను నమ్ముకుంటేనే ఫామ్‌లో ఉండగలరు. లేదంటే మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల దృష్ట్యా, వారు త్వరగానే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×