E-Paper
Advertisement

చేతి వేలికే స్మార్ట్ ఫీచర్స్.. రూ.2,999 బడ్జెట్‌లోనే బోట్ స్మార్ట్ రింగ్!

చేతి వేలికే స్మార్ట్ ఫీచర్స్.. రూ.2,999 బడ్జెట్‌లోనే బోట్ స్మార్ట్ రింగ్!
Advertisement

boAt SmartRing Active Review: ఇప్పటివరకు మనం చేతికి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్లు పెట్టుకుని తిరిగాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది! టెక్నాలజీ మన చేతి వేలికి వచ్చేసింది. అవును.. ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోట్ (boAt) మార్కెట్లోకి తీసుకొచ్చిన boAt SmartRing Active ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. కేవలం రూ.2,999 బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ స్మార్ట్ రింగ్ నిజంగానే స్మార్ట్ వాచ్‌లకు ప్రత్యామ్నాయం అవుతుందా? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం!

క్లాసీ డిజైన్:

ఈ స్మార్ట్ రింగ్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది చాలా లైట్‌వెయిట్‌గా ఉండి, మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. వేలికి పెట్టుకుంటే ఇదొక నార్మల్ స్టైలిష్ రింగ్ లాగే అనిపిస్తుంది కానీ, దీని లోపల బోలెడంత టెక్నాలజీ దాగుంది. విభిన్నమైన సైజులలో , ట్రెండీ కలర్స్ లో ఇది లభిస్తుంది. పైగా దీనికి 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే మీరు దీన్ని పెట్టుకుని చేతులు శుభ్రం చేసుకోవచ్చు, వర్షంలో తడిచినా లేదా స్విమ్మింగ్ చేసినా అస్సలు భయపడాల్సిన పనే లేదు.

చిన్న రింగ్.. హోల్‌సేల్ హెల్త్ ఫీచర్స్:

Advertisement

ఇది సైజులో చిన్నదే కావచ్చు, కానీ స్మార్ట్ వాచ్ చేసే పనులన్నీ పక్కాగా చేస్తుంది. ఇందులో ఉన్న హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఇవే..

హార్ట్ రేట్ మానిటరింగ్: మీ గుండె వేగాన్ని 24 గంటల పాటు ట్రాక్ చేస్తుంది.

Advertisement

SpO2 బ్లడ్ ఆక్సిజన్: మీ రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంతున్నాయో ఎప్పటికప్పుడు కనిపెడుతుంది.

స్లీప్ ట్రాకింగ్: మీరు రాత్రి ఎంతసేపు గాఢనిద్రపోయారు, ఎంతసేపు లైట్ స్లీప్‌లో ఉన్నారో క్లియర్‌గా విశ్లేషిస్తుంది.

స్ట్రెస్ మానిటరింగ్: మీ మెదడులో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా ఇది స్మార్ట్‌గా గమనిస్తుంది.

మీరు నడిచే అడుగులు, బర్న్ చేసే క్యాలరీలను కూడా ఇది కరెక్ట్‌గా రికార్డ్ చేసి మీ మొబైల్‌లోని బోట్ యాప్‌లో చూపిస్తుంది.

స్మార్ట్ టచ్ కంట్రోల్స్ :

ఈ రింగ్ లో డిస్ప్లే ఉండదు కదా మరి ఎలా కంట్రోల్ చేయాలి? అనే డౌట్ మీకు రావచ్చు. దీని కోసం బోట్ ఇందులో ఒక క్రేజీ ఫీచర్ ఇచ్చింది. ఈ రింగ్ పైభాగంలో టచ్ సెన్సార్స్ ఉంటాయి. దానిపై జస్ట్ ప్రెస్ లేదా స్వైప్ చేయడం ద్వారా మీ మొబైల్‌లో మ్యూజిక్ మార్చవచ్చు, కెమెరా షట్టర్‌ని కంట్రోల్ చేసి ఫోటోలు క్లిక్ చేయవచ్చు.

Also Read: అదిరిపోయే డిజైన్, పిచ్చెక్కించే బేస్.. మోటో కొత్త బడ్స్ రచ్చ

బ్యాటరీ లైఫ్ :

స్మార్ట్ వాచ్‌లను రోజు మార్చి రోజు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ boAt SmartRing Active ని ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 5 నుంచి 7 రోజుల పాటు వాడుకోవచ్చు. దీనితో పాటు వచ్చే ఒక స్మార్ట్ మాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ (Charging Dock) సహాయంతో దీన్ని చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు!

ఇందులో డిస్ప్లే ఉండదు కాబట్టి నోటిఫికేషన్లు లేదా మెసేజ్‌లు నేరుగా చూసుకోలేము. ప్రతి చిన్న విషయానికి మొబైల్ యాప్ ఓపెన్ చేసి డేటా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. ఆర్డర్ చేసేటప్పుడు మీ వేలి సైజును పక్కాగా కొలుచుకుని కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

మీకు చేతికి పెద్ద పెద్ద స్మార్ట్ వాచ్‌లు పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ హెల్త్ డేటా ట్రాక్ అవ్వాలి. స్టైలిష్‌గా కనిపించాలి అనుకుంటే మాత్రం boAt SmartRing Active ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ.2,999 ధరలో ఈ రేంజ్ ఫీచర్స్ , ప్రీమియం లుక్ రావడం డెఫినెట్‌గా ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×