E-Paper
Advertisement

బీఎల్డీసీ Vs రెగ్యులర్ ఫ్యాన్.. కరెంట్ బిల్లును సగానికి తగ్గించే ఫ్యాన్ ఏది?

బీఎల్డీసీ Vs రెగ్యులర్ ఫ్యాన్..  కరెంట్ బిల్లును సగానికి తగ్గించే  ఫ్యాన్ ఏది?
Advertisement

BLDC vs Regular Fan: ఇంటి కోసం కొత్త ఫ్యాన్ కొనాలంటే ఇప్పుడొక పెద్ద సందేహం చాలా మందిలో మెదులుతోంది. BLDC ఫ్యాన్ తీసుకోవాలా? లేక రెగ్యులర్ ఫ్యాన్ సరిపోతుందా? అని. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి . కానీ.. కరెంట్ బిల్లు, ఫర్మామెన్స్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. ముఖ్యంగా పెరుగుతున్న కరెంట్ బిల్లుల కారణంగా ఇంటి కోసం బెస్ట్ ఫ్యాన్ ఎంపిక అనేది చాలా ముఖ్యం. మీ బడ్జెట్, రోజు వారీ వాడకం, సేవింగ్స్‌తో కలిపి మీ ఇంటికి ఏది బెటర్ అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం.

BLDC ఫ్యాన్స్ :
ఇప్పుడు మార్కెట్‌లో BLDC ఫ్యాన్స్ చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. BLDC అంటే Brushless Direct Current టెక్నాలజీ. ఇవి కొత్త తరహా మోటార్‌తో పని చేస్తాయి కాబట్టి తక్కువ కరెంట్‌తోనే ఎక్కువ ఎఫిషియెన్సీ ఇస్తాయి. మరో వైపు మనం చాలా సంవత్సరాలుగా వాడుతున్న రెగ్యులర్ ఫ్యాన్స్ ఇండక్షన్ మోటార్‌తో పని చేస్తాయి. ఇవి బలంగా, సింపుల్‌గా ఉంటాయి కానీ కరెంట్ ఎక్కువగా తీసుకుంటాయి. ఇక్కడే ఈ రెండింటి మధ్య అసలు తేడా..మొదలవుతుంది.

Advertisement

కరెంట్ ఖర్చు:
కరెంట్ వాడకం విషయానికి వస్తే.. BLDC ఫ్యాన్స్ నిజంగా గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఒక BLDC ఫ్యాన్ 25 నుంచి 35 వాట్స్ మాత్రమే కరెంట్ ఖర్చు చేస్తుంది. అదే రెగ్యులర్ ఫ్యాన్ అయితే 70 నుంచి 80 వాట్స్ వరకు తీసుకుంటుంది. అంటే సుమారు 50 నుంచి 60 శాతం వరకు కరెంట్ సేవ్ అవుతుంది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఫ్యాన్ వాడే ఇంట్లో అయితే నెలాఖరులో బిల్లు తగ్గిన తేడా క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకే దీన్ని చాలా మంది మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు.

ఖర్చు:
అయితే ఖర్చు విషయానికి వస్తే.. BLDC ఫ్యాన్ కొంచెం ఎక్కువ ధర ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవి సాధారణంగా రూ. 2,500 నుంచి రూ. 7,000 వరకు ఉంటాయి. అదే రెగ్యులర్ ఫ్యాన్స్ అయితే రూ. 1,200 నుంచి రూ. 2,500 మధ్యలో దొరుకుతాయి. అందుకే తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్లు ఎక్కువగా రెగ్యులర్ ఫ్యాన్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ  BLDC ఫ్యాన్ కొనడం వల్ల కరెంట్ బిల్లులో సేవ్ అయ్యే డబ్బు, మొదట పెట్టిన ఖర్చును కవర్ చేస్తుంది.

Advertisement

వాడకం:
వాడకం విషయంలో కూడా BLDC ఫ్యాన్స్ కొంచెం అడ్వాన్స్‌గా ఉంటాయి. ఇవి చాలా సైలెంట్‌గా పని చేస్తాయి. రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా దీనికి అందుబాటులో ఉంటాయి. కరెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల వేడి కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఒక సారి లోపల ఉన్న సర్క్యూట్ లేదా PCBలో సమస్య వస్తే రిపేర్ ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ ఫ్యాన్స్ అయితే.. సింపుల్ టెక్నాలజీతో ఉంటాయి కాబట్టి రిపేర్ చేయడం ఈజీ.  ఖర్చు కూడా తక్కువ. శబ్దం ఎక్కువగా ఉండటం, కరెంట్ ఎక్కువగా తీసుకోవడం దీని మైనస్ పాయింట్స్.

Also Read: Ai+ Nova 2 సిరీస్ రిలీజ్, రూ. 8,999 కే 6000mAh బ్యాటరీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?

రోజువారీ వాడకాన్ని బట్టి చూస్తే.. మీరు రోజులో ఎక్కువ సేపు ఫ్యాన్ వాడే వాళ్లయితే BLDC ఫ్యాన్ తీసుకోవడం బెస్ట్. ముఖ్యంగా సమ్మర్‌లో రోజంతా ఫ్యాన్ ఆన్‌లో ఉండే ఇళ్లలో ఇది చాలా ఉపయోగ పడుతుంది. కానీ మీరు అప్పుడప్పుడు మాత్రమే వాడితే.. లేదా బడ్జెట్ చాలా లిమిటెడ్‌గా ఉంటే రెగ్యులర్ ఫ్యాన్ కూడా సరి పోతుంది. చిన్న గదులు లేదా గెస్ట్ రూమ్స్‌ లాంటి చోట్ల రెగ్యులర్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు.

మొత్తానికి చూసుకుంటే.. BLDC ఫ్యాన్ అంటే కొంచెం ముందుచూపుతో చేసే ఎంపిక. మొదట ఖర్చు ఎక్కువైనా.. తర్వాత సేవింగ్ ఎక్కువ. రెగ్యులర్ ఫ్యాన్ అంటే తక్కువ ఖర్చుతో వెంటనే పని అయ్యే ఆప్షన్. కాబట్టి మీ అవసరం, బడ్జెట్, వాడకంతో పాటు అన్ని విషయాలను చెక్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో పెరుగుతున్న కరెంట్ బిల్లులను దృష్టిలో పెట్టుకుంటే.. BLDC ఫ్యాన్ మాత్రం స్మార్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×