// // Jana Nayagan: విజయ్‌ సినిమాకు తప్పని తిప్పలు.. రిలీజ్‌కు ముందే -->
E-Paper
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘జన నాయగన్’ పైరసీ ప్రింట్.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘జన నాయగన్’ పైరసీ ప్రింట్.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు..
Advertisement

Jana Nayagan: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఇప్పటికే ఈసినిమా పలు మార్లు విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. దాదాపు ఆరు నెలల నుంచి ఈ సినిమా విడుదల కొసం రెడీ అవుతుంది. కానీ సెన్సార్ చిక్కులు కారణంగా సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే పైరసీ భూతానికి చిక్కి చిత్ర యూనిట్‌కు, అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీనిని చూసిన నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

Read also-వరణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..

‘జన నాయగన్’ లీక్

Advertisement

ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ‘జన నాయగన్’ చిత్రం థియేటర్లలో విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. తొలుత విజయ్ ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ కార్డ్స్ ఉన్న ఐదు నిమిషాల వీడియో బయటకు రాగా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సినిమాకు సంబంధించిన HD ప్రింట్ పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 48 నిమిషాల నిడివి గల ఫుటేజ్ లీక్ అయిందని కొందరు అంటుంటే, పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

విడుదలలో జాప్యం..

ఈ సినిమా వాస్తవానికి 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సినిమాలోని రాజకీయ డైలాగులు, కొన్ని కీలక సన్నివేశాలపై సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై నిర్మాతలు కోర్టును కూడా ఆశ్రయించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, విజయ్ రాజకీయ పార్టీ (TVK) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కూడా ఈ సినిమాను పరిశీలించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ సినిమా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం కూడా ఉంది, ఇది కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read also-నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ టీనేజ్ ప్రేమకథ ‘18th Rose’ ఎలా ఉందంటే?

అభిమానుల ఆగ్రహం

విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఈ లీకేజీకి పాల్పడ్డారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సెన్సార్ పూర్తికాని సినిమా బయటకు రావడం వెనుక ఎడిటింగ్ రూమ్ లేదా ఇతర అంతర్గత వ్యక్తుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ లీక్ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, పైరసీని ప్రోత్సహించవద్దని చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేస్తోంది. ఎన్నికల తర్వాతే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు అయిదు వందల కోట్టు పెట్టిన ఈ సినిమా ఇలా పైరసీపాలు కావడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో తోచని స్థితలో కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×