E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకా? సినిమా హాల్ లాంటి 48W సౌండ్, Google TVతో Blaupunkt QLED TV సంచలనం!

ఇంత తక్కువ ధరకా? సినిమా హాల్ లాంటి 48W సౌండ్, Google TVతో Blaupunkt QLED TV సంచలనం!
Advertisement

Blaupunkt QLED TV: ప్రముఖ ఆడియో, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బ్లౌపంక్త్ (Blaupunkt) భారత మార్కెట్లోకి సరికొత్త క్యూఎల్ఈడీ (QLED) స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం విజువల్స్, అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ టీవీలను కంపెనీ తీసుకొచ్చింది. గూగుల్ టీవీ 5.0 సపోర్ట్, డాల్బీ ఆడియో వంటి అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.

బడ్జెట్‌కు తగ్గ సైజులు, ధరలు:

వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఈ కొత్త సిరీస్‌ను బ్లౌపంక్త్ మూడు రకాల స్క్రీన్ సైజుల్లో ప్రవేశపెట్టింది. ఇందులో 32 ఇంచులు, 40 ఇంచులు, 43 ఇంచుల మోడల్స్ ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. బేసిక్ 32 ఇంచుల మోడల్ ధర కేవలం రూ.11,499గా ఉంది. అలాగే 40 ఇంచుల వేరియంట్ ధర రూ.16,499 కాగా.. పెద్ద స్క్రీన్ కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన 43 ఇంచుల టీవీ ధరను రూ.17,499గా నిర్ణయించారు. అఫర్డబుల్ స్మార్ట్ టీవీ విభాగంలో ఈ ధరలు ఖచ్చితంగా గట్టి పోటీని ఇస్తాయని చెప్పొచ్చు.

థియేటర్ లాంటి ఆడియో:

Advertisement

బ్లౌపంక్త్ కంపెనీకి ఆడియో రంగంలో దశాబ్దాల చరిత్ర ఉంది. అందుకే ఈ టీవీల్లో ఆడియో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సిరీస్ టీవీల్లో ఏకంగా 48 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లను అమర్చారు. వీటికి డాల్బీ డిజిటల్ ప్లస్ టెక్నాలజీ తోడవడంతో ఇంట్లోనే సినిమా హాల్ లాంటి అనుభూతి కలుగుతుంది. మనం సినిమాలు చూస్తున్నా, లైవ్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నా లేదా గేమ్స్ ఆడుతున్నా.. క్లియర్ అండ్ లౌడ్ సౌండ్ వినిపిస్తుంది.

Also Read: Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!

స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్:

Advertisement

ఈ టీవీలు లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఇది యూజర్ల ఇష్టాఇష్టాలను బట్టి నచ్చిన కంటెంట్‌ను హోమ్ స్క్రీన్‌పైనే రికమండ్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దాదాపు పదివేలకు పైగా యాప్స్, గేమ్స్‌ను ఇందులో వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పాపులర్ ఓటీటీ యాప్స్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. దీనివల్ల ఎలాంటి అదనపు డివైజ్‌లు లేకుండానే నేరుగా నచ్చిన షోస్ చూసేయొచ్చు.

కళ్లు చెదిరే డిజైన్:

చూడటానికి చాలా స్లిమ్ బెజెల్స్ (అంచులు) ఉన్న డిజైన్‌తో ఈ టీవీలు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మోడల్‌ను బట్టి ఇవి హెచ్‌డీ రెడీ, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆప్షన్లలో లభిస్తాయి. క్వాంటం డాట్ టెక్నాలజీ వల్ల రంగులు చాలా సహజంగా కనిపిస్తాయి. ఇందులో ఏఆర్ఎమ్ కార్టెక్స్-A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAM, 8GB స్టోరేజ్ ఇచ్చారు.

ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, మూడు హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. అలాగే వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్, మొబైల్ స్క్రీన్‌ను టీవీలో చూసేందుకు క్రోమ్‌కాస్ట్, మిరాకాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: ఫొటో తీశాక కూడా బ్యాక్‌గ్రౌండ్‌ మార్చేయొచ్చు.. Apple Intelligence సరికొత్త మ్యాజిక్ అదే మరి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×