E-Paper
Advertisement

Bill Gates: ఇండియా ఏఐ సదస్సు నుంచి బిల్ గేట్స్ అవుట్.. ఆ వివాదమే కారణమా?

Bill Gates: ఇండియా ఏఐ సదస్సు నుంచి బిల్ గేట్స్ అవుట్.. ఆ వివాదమే కారణమా?
Advertisement

Bill Gates: ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 నుంచి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు తప్పించడం అంతర్జాతీయంగా చ‌ర్చియానీయాంశంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బిల్ గేట్స్ కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయన పేరును అతిథుల జాబితా నుంచి తొలగించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల అమెరికా న్యాయ‌శాఖ వెల్ల‌డించిన జెఫ్రీ ఎబ్స్టీన్ వ్యవహారానికి సంబంధించిన వివాదాస్పద పత్రాల్లో బిల్ గేట్స్ పేరు బయటపడటమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ఎబ్స్టీన్ కేసులో బయటపడిన తాజా ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ సదస్సుకు వివాదాస్పద వ్యక్తులు హాజరుకావడం సరికాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాథమికంగా సమీక్ష జరిపిన నిర్వాహకులు.. ఆయనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం బిల్ గేట్స్ ఈ సదస్సులో జరిగే ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం, దానివల్ల కలిగే సామాజిక మార్పులపై ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ ఎబ్స్టీన్ పత్రాల వివాదం నేపథ్యంలో ఆయన హాజరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, సదస్సు వెబ్‌సైట్ నుంచి కూడా ఆయన పేరును మరియు ఫోటోను తొలగించింది. ప్రస్తుతం సదస్సు అధికారిక వెబ్‌సైట్‌లో అతిథుల జాబితాలో బిల్ గేట్స్ పేరు కనిపించడం లేదు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కేవలం నైతిక కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నిర్వహిస్తున్న ఇటువంటి అంతర్జాతీయ వేదికలపై ఎటువంటి మచ్చ పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. బిల్ గేట్స్ వంటి ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించి, ఆ తర్వాత తొలగించడం అనేది దౌత్యపరంగా కూడా చర్చకు దారితీస్తోంది. అయితే, ఈ సదస్సులో ఇతర గ్లోబల్ టెక్ లీడర్లు, ఏఐ నిపుణులు యధావిధిగా పాల్గొంటున్నారు.

Advertisement

ఈ పరిణామం ఒక్కసారిగా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ సంస్థ గానీ, బిల్ గేట్స్ వ్యక్తిగత ప్రతినిధులు గానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గతంలో ఎబ్స్టీన్ తో సంబంధాల విషయంలో బిల్ గేట్స్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు.  ఒక దేశం అధికారికంగా నిర్వహించే సదస్సు నుంచి ఆయన పేరును ఇలా తొలగించడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×