E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ ఆంధ్ర నాన్ థియేట్రికల్ రైట్స్.. పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్..

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ ఆంధ్ర నాన్ థియేట్రికల్ రైట్స్.. పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్..
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ సినిమా మార్చ్ 26వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకి ఎంతో అద్భుతమైన ఆదరణ లభించింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

కళ్ళు చెదిరే రేంజ్ లో ఆంధ్ర నాన్ థియేట్రికల్ బిజినెస్..

ఇక ఈ సినిమా ప్రమోషన్లను మొదలు పెడుతూనే మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంటున్నారు అయితే ఈ సినిమా ఆంధ్ర నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్ర నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా 72 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇలా ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటేనే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో స్పష్టమవుతుంది .

ఓవర్సీస్ లో భారీ హైప్..

Advertisement

ఇక ఈ సినిమా ప్రీ బిజినెస్ కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం ఆంధ్ర నైజాంలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ ఉండబోతుందని తెలుస్తుంది. ఇదివరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాకు ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్లు రావడంతో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే యాక్షన్ డ్రామా గానే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా పవన్..

Advertisement

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. అలాగే మరొక నటి రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇదివరకే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ కొడతారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చ్ 26వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×