E-Paper
Advertisement

ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 5 రంగులు వేస్తే.. ఇల్లు ఊటీ అయిపోద్ది!

ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 5 రంగులు వేస్తే.. ఇల్లు ఊటీ అయిపోద్ది!
Advertisement

Cool Colors: వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కుంపటిలా మారుతుంటాయి. ఏసీలు, కూలర్లు పెట్టినా ఒక్కోసారి వేడి ఏమాత్రం తగ్గదు. అయితే మన ఇంట్లోని గోడలకు వేసే రంగులు కూడా ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మీకు తెలుసా? కొన్ని ప్రత్యేక రంగులు సూర్యరశ్మిని ప్రతిబింబించి ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండేలా చేస్తాయి. అలాంటి 5 అద్భుతమైన రంగుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

తెలుపు రంగు

ఇంటిని చల్లబరచడంలో తెలుపు రంగును మించింది మరోటి లేదు. సైన్స్ ప్రకారం.. తెలుపు రంగు తనపై పడే సూర్యకాంతిని, వేడిని గదిలోకి రానివ్వకుండా పూర్తిగా వెనక్కి పంపేస్తుంది. ఇది ఇళ్లకు క్లాసిక్ లుక్ ఇవ్వడమే కాకుండా గది విశాలంగా, ప్రశాంతంగా కనిపించేలా చేస్తుంది.

లేత పచ్చదనం

Advertisement

ప్రకృతికి దగ్గరగా ఉండే మింట్ గ్రీన్ వేసవికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ లైట్ గ్రీన్ కలర్.. కళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి గదిలో ఒక రకమైన చల్లని వాతావరణం, తాజాదనం నెలకొనేలా చేస్తుంది.

నీలం రంగు

ఆకాశం, సముద్రం రంగు అయిన నీలం.. ఎప్పుడూ చల్లదనానికి ప్రతీక. గోడలకు సాఫ్ట్ స్కై బ్లూ కలర్ వేయడం వల్ల గదిలోకి అడుగుపెట్టగానే ఏదో హిల్ స్టేషన్‌కి వచ్చినట్లు హాయిగా అనిపిస్తుంది. ఇది గదిలోని వేడి అనుభూతిని మానసికంగా దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

లేత గులాబీ రంగు

Advertisement

చాలామంది పింక్ అంటే కేవలం అందం కోసమే అనుకుంటారు. కానీ లేత గులాబీ రంగు వేసవి వేడిని అస్సలు గ్రహించదు. ఇది గదికి అందమైన, ఆహ్లాదకరమైన రూపాన్ని ఇస్తూనే వాతావరణం చల్లగా ఉండేలా చూస్తుంది. లివింగ్ రూమ్‌లకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read: హోటల్స్‌లో బస చేస్తున్నారా? సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే.. 5 సులువైన ట్రిక్స్!

లేత బూడిద రంగు

ఇల్లు చల్లగా ఉండటంతో పాటు మోడ్రన్ లుక్ లోనూ కనిపించాలని అనుకుంటే లైట్ గ్రే కలర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ముదురు రంగుల్లా ఇది వేడిని పట్టి ఉంచదు. పైగా ఇంట్లోని ఫర్నిచర్‌కు మంచి లగ్జరీ లుక్‌ని ఇది తీసుకొస్తుంది. మెుత్తంగా వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే నలుపు, ముదురు ఎరుపు, బ్రౌన్ వంటి డార్క్ కలర్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఏసీ ఆఫ్ చేసినా గది చల్లగా ఉండాలా? ఈ 6 ట్రిక్స్ పాటిస్తే.. రోజంతా కూల్ కూల్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×