E-Paper
Advertisement

సైదాపూర్‌లో కల్తీ పెరుగు కలకలం.. VLR డెయిరీ లీలలు బయటపెట్టిన ల్యాబ్ రిపోర్ట్..!

సైదాపూర్‌లో కల్తీ పెరుగు కలకలం.. VLR డెయిరీ లీలలు బయటపెట్టిన ల్యాబ్ రిపోర్ట్..!
Advertisement

Fake Dairy: స్వేచ్చ బ్యూరో: సైదాపూర్ రోడ్డులోని VLR డెయిరీలో సాగుతున్న కల్తీ పాల వ్యాపారాన్ని “స్వేచ్ఛ” దినపత్రిక వరుస కథనాలతో బహిర్గతం చేసింది. ఈ కథనాలకు స్పందించిన ఆహార భద్రతా అధికారులు సదరు డెయిరీపై దాడులు చేసి, శాంపిల్స్ సేకరించారు. ఈ చర్యతో కల్తీ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ల్యాబ్ రిపోర్ట్‌తో బట్టబయలైన కల్తీ గుట్టు

ల్యాబ్ రిపోర్ట్ వివరాల ప్రకారం… హైదరాబాద్ నాచారంలోని ‘స్టేట్ ఫుడ్ లాబొరేటరీ’ (State Food Laboratory) నుండి వచ్చిన అధికారిక నివేదిక (No. 456/SFL/2026, తేదీ: 15-05-2026) డెయిరీ నిర్వాహకుల కల్తీ లీలను ఆధారాలతో సహా నిరూపించింది. కరీంనగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ డెయిరీ నుండి సేకరించిన “గేదె పాలతో తయారు చేసిన పెరుగు” (Curd (Loose) Made from Buffalo Milk – Code NO. 002/13078/2026) శాంపిల్స్‌ను పరీక్షించగా, అది “సబ్‌స్టాండర్డ్” (SUBSTANDARD – నాణ్యత లేనిది) అని ల్యాబ్ అధికారులు తేల్చారు. ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ యాక్ట్ 2006 (Food Safety & Standards Act 2006) నిబంధనల ప్రకారం ఈ పెరుగు మానవ ఆరోగ్యానికి హానికరంగా, కల్తీగా ఉన్నట్లు చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ కార్యాలయం ధృవీకరించింది. దీంతో “స్వేచ్ఛ” పత్రిక ప్రచురించిన కథనాలు నూటికి నూరు శాతం నిజమని తేలిపోయింది.

రిపోర్టర్లపై తిరగబడ్డ యజమాని..

Advertisement

తమ కల్తీ గుట్టు ల్యాబ్ రిపోర్టుల ద్వారా ఎక్కడ బయటపడుతుందో, కంటిముందు కస్టమర్లు దూరం అవుతారనే ఆందోళనతో VLR డెయిరీ యజమానులు నెల్లి ప్రవీణ్, నెల్లి ప్రకాష్ రిపోర్టర్లపై దుష్ప్రచారానికి దిగారు. అధికారుల చర్యను, కల్తీ గురించి వచ్చిన నిజమైన వార్తలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన కొత్త నాటకానికి తెరలేపారు. ఈ క్రమంలో, డెయిరీ ముందు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, అందులో కొందరు రిపోర్టర్లపై అసత్య ఆరోపణలు చేశారు.

Also Read: దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఏ సెగ్మెంట్‌ లో ఏది బెస్ట్ అంటే?

డబ్బు డిమాండ్ చేశారని అసత్య ప్రచారం..

Advertisement

యజమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో, కొందరు రిపోర్టర్లు తనను డబ్బు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వకపోతేనే తమపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా ప్రజారోగ్యం కోసం వార్తలు రాసిన రిపోర్టర్ల పరువుకు భంగం కలిగించేలా ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో యూనియన్ ఫిర్యాదు

డెయిరీ యజమాని చేసిన ఈ దుశ్చర్యను పట్టణంలోని రిపోర్టర్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూనియన్ ప్రతినిధులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ల్యాబ్ నివేదికలో కూడా పెరుగు ‘సబ్‌స్టాండర్డ్’ అని తేలడంతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న యజమానిపై ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, తమ తప్పులను దాచుకోవడానికి రిపోర్టర్లపై బురద చల్లినందుకు కఠినంగా శిక్షించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read: సీఎం విజయ్ రూట్ మార్చారుగా.. బ్లాక్ సూట్ టు పట్టుపంచె! ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజువల్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×