E-Paper
Advertisement

టీవీ సౌండ్ నచ్చట్లేదా? రూ.5 వేలలో క్రేజీ సౌండ్‌బార్లు.. ఇంటిని థియేటర్‌లా మార్చేయండి!

టీవీ సౌండ్ నచ్చట్లేదా? రూ.5 వేలలో క్రేజీ సౌండ్‌బార్లు.. ఇంటిని థియేటర్‌లా మార్చేయండి!
Advertisement

Budget Soundbars: ప్రస్తుతం స్మార్ట్ టీవీల వాడకం బాగా పెరిగిపోయింది. అయితే స్లిమ్ డిజైన్ కారణంగా చాలా టీవీల్లో ఆడియో క్వాలిటీ అంతగా ఉండట్లేదు. దీంతో చాలామంది హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం సౌండ్‌బార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి మీ బడ్జెట్ రూ.5,000 లోపు ఉండి.. బెస్ట్ ఆడియో డివైజ్ కోసం చూస్తుంటే ఈ కథనం మీకోసమే. మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 అద్భుతమైన సౌండ్‌బార్లు, వాటి ప్రధాన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ZEBRONICS Juke BAR 200A

బడ్జెట్ ధరలో సాలిడ్ ఫీచర్లు కోరుకునే వారికి ‘జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 200A’ పర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది 90W పవర్‌ఫుల్ అవుట్‌పుట్‌తో రూపొందింది. ఇందులో ప్రత్యేకంగా లభించే వైర్డ్ సబ్‌వూఫర్.. గదిని క్రిస్టల్ క్లియర్ ఆడియోతో నింపేస్తుంది. బ్లూటూత్, HDMI (ARC), USB వంటి మల్టీ-కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండటం వల్ల స్మార్ట్ టీవీలకు చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Honeywell Moxie V3000

Advertisement

తక్కువ ఖర్చులో బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ సౌండ్‌బార్ చక్కగా సరిపోతుంది. ఇది 30W అవుట్‌పుట్‌తో క్లియర్ స్టీరియో సౌండ్‌ను అందిస్తుంది. ఇందులో 2400mAh బ్యాటరీని అమర్చారు. కాబట్టి కరెంట్ లేకపోయినా దాదాపు 12 గంటల పాటు పోర్టబుల్ స్పీకర్‌గా దీన్ని వాడుకోవచ్చు. బ్లూటూత్ v5.3 కనెక్టివిటీతో ఇది చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది.

boAt Aavante 2.2 1400

ఇంట్లోనే కూర్చుని సినిమా థియేటర్ అనుభూతిని పొందాలనుకునే వారికి బోట్ అవాంతే బెస్ట్ ఛాయిస్. ఇది ఏకంగా 140W పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇన్-బిల్ట్ సబ్‌వూఫర్లతో వచ్చే 2.2 ఛానల్ సెటప్ వల్ల డైలాగులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. మూవీస్, మ్యూజిక్ కోసం ప్రత్యేకమైన ఈక్వలైజర్ (EQ) మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

Philips TAB4120BK/94

Advertisement

పెద్ద పెద్ద సౌండ్‌బార్లు నచ్చనివారు.. కాంపాక్ట్ సైజులో ఉండే ఈ ‘ఫిలిప్స్’ మోడల్ ను ట్రై చేయవచ్చు. ఇది 20W అవుట్‌పుట్‌తో వస్తుంది. చిన్న గదులు, కంప్యూటర్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 8 గంటల బ్యాటరీ లైఫ్, ఆర్జీబీ లైటింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?

Blaupunkt SBW Newyork

పాటల్లో హెవీ బేస్ (Bass) కోరుకునేవారికి జర్మన్ బ్రాండ్ అయిన బ్లౌపంక్ట్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీని పవర్‌ఫుల్ సబ్‌వూఫర్ అందించే డీప్ బేస్ ఎఫెక్ట్.. పాటలు వింటున్నప్పుడు, యాక్షన్ సీన్లు చూస్తున్నప్పుడు అద్భుతమైన వైబ్రేషన్స్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో ప్రీమియం ఆడియో క్వాలిటీని ఇది అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: అమర్‌నాథ్ యాత్రకు కౌంట్‌డౌన్.. మంచు లింగానికి తొలి పూజలు నిర్వహించిన ఎల్‌జీ మనోజ్ సిన్హా

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×