E-Paper
Advertisement

చెట్లకూ ‘జీవించే హక్కు’.. చిన్న పట్టణం సంచలన నిర్ణయం!

చెట్లకూ ‘జీవించే హక్కు’..  చిన్న పట్టణం సంచలన నిర్ణయం!
Advertisement

Canada Trees Legal Protection: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కెనడాలోని ఒక చిన్న పట్టణం సంచలన నిర్ణయం తీసుకుంది. టెర్రాస్-వాడ్రూయిల్ మున్సిపాలిటీ చెట్లను జీవరాశులుగా గుర్తిస్తూ చట్టపరమైన హక్కులను కల్పించే ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. జూన్ 9న ఈ తీర్మానానికి పట్టణ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో చెట్లకు జీవించే హక్కు, సహజంగా పెరిగే హక్కు, తమ నిర్మాణాన్ని కాపాడుకునే హక్కు, పునరుత్పత్తి చేసుకునే హక్కు ఉన్నట్లు అధికారికంగా గుర్తించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

టెర్రాస్-వాడ్రూయిల్ మేయర్ ఏమన్నారంటే?  

చెట్లకు చట్ట పరమైన హక్కులను కల్పించాలనే ఈ ఆలోచనతో ప్రజల్లో అవగాహన పెరగడానికి చిత్ర దర్శకుడు ఆండ్రే డెస్రోచర్ చేసిన కృషి ఎంతో ఉపయోగపడిందన్నారు పట్టణ మేయర్ మిషెల్ బోర్డో. చెట్లను కేవలం అందం కోసం పెంచే మొక్కలుగా కాకుండా, మన జీవన వ్యవస్థలో కీలక పాత్ర పోషించే జీవరాశులుగా చూడాలనే దృక్పథం ప్రజల్లో పెరిగిందని చెప్పుకొచ్చారు. “చెట్టు కూడా మనిషిలాగే జీవిస్తుంది. అది శ్వాసిస్తుంది, నీటిని గ్రహిస్తుంది. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు, కాలుష్యాన్ని తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, అధిక వేడిని తగ్గించడం లాంటి అనేక విధాలుగా మనకు మేలు చేస్తుంది” అని వివరించారు.

Advertisement

ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా వరదలు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో చెట్లు ప్రకృతి రక్షకులుగా పనిచేస్తున్నాయి. వర్షపు నీటిని నియంత్రించడంలో, కార్బన్‌ ను నిల్వ చేయడంలో, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో, పట్టణాల్లో ఉష్ణోగ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

నిబంధనలు కఠినంగా అమలు

తాజా తీర్మానం ప్రకారం, అవసరం లేకుండా చెట్లను నరికివేయకుండా ఉండేందుకు స్థానిక నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో చెట్టును తొలగించాల్సి వస్తే, దాని స్థానంలో కొత్త మొక్కను తప్పనిసరిగా నాటే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ప్రకృతి హక్కుల ఉద్యమానికి ఈ నిర్ణయం మరో ఎగ్జాంఫుల్ గా   నిలుస్తోంది. ఈ ఉద్యమం ప్రకారం నదులు, అడవులు, చెట్లు లాంటి ప్రకృతి సంపదలకు కూడా చట్టపరమైన హక్కులు ఉండాలని, వాటిని రక్షించే బాధ్యత సమాజంపై ఉండాలని భావిస్తున్నారు.  టెర్రాస్-వాడ్రూయిల్ పట్టణం తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశ చూపిస్తోంది. చెట్లు కేవలం ప్రకృతిలోని భాగమే కాకుండా, మానవ జీవితానికి అత్యంత అవసరమైన జీవ వ్యవస్థలని గుర్తిస్తూ తీసుకున్న ఈ తీర్మానం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా మారబోతోంది.

Read Also: ఆదివారాల్లో టూరిస్టులకు నో ఎంట్రీ.. అత్యంత పరిశుభ్రమైన గ్రామం సరికొత్త నిర్ణయం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×