E-Paper
Advertisement

జేబీఎల్ నుంచి సోనీ వరకు..రూ.10వేలలోపు అదిరిపోయే సౌండ్‌బార్స్

జేబీఎల్ నుంచి సోనీ వరకు..రూ.10వేలలోపు అదిరిపోయే సౌండ్‌బార్స్
Advertisement

Best Soundbars under 10,000: ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. గ్రౌండ్‌లో మ్యాచ్ చూస్తున్న ఫీల్ ఇంట్లోనే పొందాలని అందరూ కోరుకుంటారు. అయితే.. మన టీవీల్లో బొమ్మ ఎంత బాగున్నా, ఆ శబ్దం (ఆడియో) మాత్రం అంతగా కిక్ ఇవ్వదు. అందుకే.. తక్కువ బడ్జెట్‌లో మీ టీవీ సౌండ్‌ని హోమ్ థియేటర్ స్థాయికి తీసుకెళ్లే బెస్ట్ సౌండ్‌బార్లు చాలానే ఉన్నాయి. రూ. 10,000 లోపు లభించే టాప్ బ్రాండ్ల వివరాలు మీకోసం.

రూ. 10,000 లోపు టాప్ సౌండ్‌బార్స్:

Advertisement

క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు స్టేడియంలో వచ్చే ఆ కేకలు, బౌండరీ కొట్టినప్పుడు వచ్చే శబ్దం క్లియర్‌గా వినిపిస్తేనే ఆ మజా వేరు. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలోనే.. అదిరిపోయే ఫీచర్లతో సౌండ్‌బార్లు అందుబాటులోకి వచ్చాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ వంటి ఫేమస్ కంపెనీలు అందిస్తున్న టాప్ ఆప్షన్లు ఇవే..

1. బ్లౌపంక్ట్ SBW చికాగో HT5.1 (Blaupunkt SBW Chicago HT5.1):
తక్కువ ధరలో పూర్తి స్థాయి హోమ్ థియేటర్ ఫీల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 5.1 ఛానల్ సెటప్‌తో వస్తుంది. అంటే ఇందులో ఒక సౌండ్‌బార్‌తో పాటు సబ్‌వూఫర్ , వెనక వైపు పెట్టుకోవడానికి శాటిలైట్ స్పీకర్లు కూడా ఉంటాయి.

Advertisement

ధర:  రూ.7,999

ప్రత్యేకత: HDMI, బ్లూటూత్, ఆప్టికల్ కనెక్టివిటీ ఉన్నాయి. చుట్టూ శబ్దం వినిపించే ‘సరౌండ్ సౌండ్’ఫీల్ ఇది ఇస్తుంది.

2. ఎల్‌జీ సౌండ్‌బార్ SP2 (LG Soundbar SP2):
మీ గది చిన్నగా ఉండి, ఎక్కువ వైర్లు లేకుండా సింపుల్‌గా ఉండే సెటప్ కావాలంటే.. ఎల్‌జీ SP2 బాగుంటుంది. ఇందులో సబ్‌వూఫర్ లోపలే ఉంటుంది.

ధర:  రూ.6,990

ప్రత్యేకత: 100W అవుట్‌పుట్. ఇందులో ‘AI సౌండ్ ప్రో’ ఫీచర్ ఉంది. ఇది మీరు చూసే కంటెంట్‌ను బట్టి (ఉదాహరణకు కామెంటరీ లేదా మ్యూజిక్) ఆడియోను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.

3. సామ్‌సంగ్ HW-T42E/XL (Samsung HW-T42E/XL):
సామ్‌సంగ్ బ్రాండ్ నమ్మకంతో పాటు మంచి బేస్ కావాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. ఇది 2.1 ఛానల్ సౌండ్‌బార్.

ధర: రూ. 8,761

ప్రత్యేకత: 150W పవర్ అవుట్‌పుట్ , డాల్బీ డిజిటల్ సపోర్ట్. దీనివల్ల సౌండ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. సరౌండ్ సౌండ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ స్టేడియం ఫీల్‌ను కలిగిస్తుంది.

4. సోనీ HT-S100F (Sony HT-S100F):
బేస్ కంటే క్లారిటీ ముఖ్యమనుకునే వారికి సోనీ ఎప్పుడూ మొదటి ఛాయిస్. ఇది కాంపాక్ట్ 2.0 ఛానల్ సెటప్.

ధర:  రూ. 8,990

ప్రత్యేకత: సోనీ ‘S-Force Front Surround’ టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది సబ్‌వూఫర్ లేకపోయినా మంచి సౌండ్ అందిస్తుంది. తక్కువ స్థలం ఉన్న రూమ్స్‌కి ఇది పర్ఫెక్ట్.

Also Read: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటో సంచలనం..నీటిలో పడ్డా,ఎత్తు నుంచి పడినా చెక్కుచెదరని మోటో G87

5. జేబీఎల్ సినిమా SB271 (JBL Cinema SB271):
పవర్ ఫుల్ సౌండ్ కావాలంటే జేబీఎల్ స్పీకర్లే కరెక్ట్. ఇందులో వైర్‌లెస్ సబ్‌వూఫర్ ఉండటం అతిపెద్ద ప్లస్ పాయింట్. అంటే సబ్‌వూఫర్‌ను వైర్లు లేకుండా గదిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

ధర:  రూ. 8,999

ప్రత్యేకత: 220W భారీ అవుట్‌పుట్. డాల్బీ డిజిటల్ సపోర్ట్ , HDMI ARC కనెక్టివిటీ ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వచ్చే భారీ శబ్దాలను ఇది అద్భుతంగా రీప్రొడ్యూస్ చేస్తుంది.

మీరు పూర్తి హోమ్ థియేటర్ కావాలనుకుంటే Blaupunkt, బ్రాండెడ్ క్వాలిటీ , బేస్ కావాలనుకుంటే JBL లేదా Samsung, చిన్న గదికి సింపుల్ సెటప్ కావాలనుకుంటే LG లేదా Sony ఎంచుకోవచ్చు. ఈ ఐపీఎల్ సీజన్‌ను సరికొత్త ఆడియో ఫీల్ తో ఎంజాయ్ చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×